Vaibhav Sooryavanshi : అట్లుందని వైభవ్ సూర్యవంశీ అంటే.. లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గొయెంకా లేచి మరీ..
ఐపీఎల్ 2026 సీజన్‌లో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) అదరగొడుతున్నాడు.
- Thota Vamshi Kumar
- Updated on- May 20, 2026 / 10:08 AM IST
IPL 2026 RR vs LSG Vaibhav Sooryavanshi Gets Standing Ovation From Sanjiv Goenka
- లక్నో పై వైభవ్ విధ్వంసం
- 38 బంతుల్లో 93 పరుగులు
- అతడి ఇన్నింగ్స్‌కు ఫిదా అయిన సంజీవ్ గొయెంకా
Vaibhav Sooryavanshi : ఐపీఎల్ 2026 సీజన్‌లో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ అదరగొడుతున్నాడు. మంగళవారం జైపూర్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పెను విధ్వంసం సృష్టించాడు. 221 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 23 బంతుల్లోనే అర్థశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో 38 బంతులు ఎదుర్కొన్నాడు. 7 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో 93 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో అతడు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపిక అయ్యాడు.
వైభవ్ ఆటకు అందరూ ఫిదా అవుతున్నారు. చిన్నా, పెద్దా అని తేడా లేకుండా అందరిని తన ఆటతో వైభవ్ ఆకట్టుకుంటున్నాడు. ఇక మంగళవారం ముఖ్యంగా ప్రత్యర్థి జట్టు అయిన లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గొయెంకా కూడా వైభవ్ ఆటకు ఫిదా అయ్యాడు. 93 పరుగులు చేసిన తరువాత మోసిన్ ఖాన్ బౌలింగ్‌లో భారీ షాట్ కు యత్నించిన వైభవ్.. అబ్దుల్ సమర్ద్ క్యాచ్ అందుకోవడంతో తృటిలో సెంచరీని చేజార్చుకున్నాడు.
Sanjiv Goenka giving a standing ovation to Vaibhav Sooryavanshi 🔥 pic.twitter.com/irXq8Gwvs5
— Deepak paswan (@PaswanDeep12610) May 19, 2026
అయినప్పటికి కూడా అతడు ఔట్ అయి పెవిలియన్‌కు వెలుతున్న సమయంలో మైదానంలోని ప్రేక్షకులే కాదు సంజీవ్ గొయెంకా సైతం లేచి నిలబడి మరీ చప్పట్లతో అతడిని ప్రశంసించాడు. ఇక మ్యాచ్ ముగిసిన తరువాత వైభవ్‌ను కలిసి ప్రత్యేకంగా అభినందించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Rajasthan Royals Hero Vaibhav Suryavanshi winning hearts on & off the field♥️
“After Lucknow Super Giants Vs RR Sanjiv Goenka to meet Vaibhav Sooryavanshi, they started talking for a while. Then shortly after Goenka’s & his wife arrived there. At that moment, when LSG owner… pic.twitter.com/LidEIF0NTw
— MANU. (@IMManu_18) May 19, 2026
సాధారణంగా సొంతం ఆటగాళ్లపై గొయెంకా మైదానంలోనే విరుచుకుపడిన సందర్భాలను చూశాం. అదే సమయంలో ప్రత్యర్థి ఆటగాళ్లు బాగా ఆడినప్పుడు అతడు అభినందించే విధానం అద్భుతం.
