RR vs MI : బుమ్రా బౌలింగ్‌ను చితక్కొట్టిన బుడ్డోడు.. తొలి బంతికే సిక్స్.. పేస్ గుర్రం రియాక్షన్ వైరల్
మంగళవారం రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ (RR vs MI)జరిగింది.
- Thota Vamshi Kumar
- Published On : April 8, 2026 / 08:32 AM IST
IPL 2026 RR vs MI Vaibhav Sooryavanshi hits two sixes in Jasprit Bumrah over
- బుమ్రా బౌలింగ్‌ను అలవోకగా ఎదుర్కొన్న వైభవ్ సూర్యవంశీ
- ఒకే ఓవర్‌లో రెండు సిక్సర్లు
RR vs MI : మంగళవారం రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ ఫలితం ఎలాగున్నా సరే ఓ విషయం మాత్రం అందరి దృష్టిని ఆకర్షించింది. బుమ్రా బౌలింగ్‌ను 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఎలా ఎదుర్కొంటాడు అన్న ఆసక్తి మ్యాచ్‌కు ముందు నుంచి అందరిలో ఉంది. వీరిద్దరి మధ్య జరిగిన పోరులో వైభవ్ పై చేయి సాధించడం విశేషం.
వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ను 11 ఓవర్లకు కుదించారు. టాస్ ఓడిన రాజస్థాన్ మొదట బ్యాటింగ్‌కు వచ్చింది. దీపక్ చాహర్ వేసిన తొలి ఓవర్‌లో యశస్వి జైస్వాల్ 22 పరుగలు సాధించాడు. ఆ తరువాత రెండో ఓవర్‌లో క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూసిన క్షణం వచ్చేసింది. బుమ్రా బంతిని అందుకోగా.. స్ట్రైకింగ్ ఎండ్‌లో వైభవ్ సూర్యవంశీ ఉన్నాడు.
RR vs MI : అదే మా కొంప ముంచింది.. బ్యాటర్ల తప్పేం లేదు.. హార్దిక్ పాండ్యా కీలక వ్యాఖ్యలు..
బుమ్రా వేసిన తొలి బంతికే వైభవ్ సిక్స్ బాదాడు. ఫుల్ లెంగ్త్ బంతిని వైడ్ లాంగ్-ఆన్ మీదుగా చూడచక్కని షాట్ ఆడాడు. ఇక ఇదే ఓవర్‌లో నాలుగో బంతిని కూడా వైభవ్ బ్యాక్‌వర్డ్ స్క్వేర్ లెగ్ మీదుగా సిక్స్‌గా మలిచాడు. బుమ్రా ఈ ఓవర్‌లో 14 పరుగులు ఇవ్వగా ఇందులో 13 పరుగులు వైభవ్ సూర్యవంశీ సాధించవే. ఇక వైభవ్ సూర్యవంశీ తన బౌలింగ్‌లో రెండు సిక్సర్లు కొట్టినా కూడా బుమ్రా చిరునవ్వులు చిందించడం అభిమానులను ఎంతో అలరించింది.
The sheer audacity of Vaibhav Sooryavanshi 🫡
🎥 The 1️⃣5️⃣ year old welcomes Jasprit Bumrah with a maximum! 👏#TATAIPL | #KhelBindaas | #RRvMI | @rajasthanroyals pic.twitter.com/cI0zqCXz0X
— IndianPremierLeague (@IPL) April 7, 2026
