Virat Kohli : రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌తో ఆర్‌సీబీ మ్యాచ్‌.. కోహ్లీని ఊరిస్తున్న భారీ రికార్డు ఇదే..

ఆర్‌సీబీ స్టార్ ఆట‌గాడు విరాట్ కోహ్లీని (Virat Kohli) ఓ అరుదైన మైలురాయి ఊరిస్తోంది.

IPL 2026 RR vs RCB clash Virat Kohli Need 3 To Complete 300 Sixes In Ipl History (pic credit@ipl)

  • శుక్ర‌వారం ఆర్ఆర్‌తో ఆర్‌సీబీ మ్యాచ్‌
  • 300 సిక్స‌ర్ల మైలురాయిపై కోహ్లీ క‌న్ను
  • 3 సిక్స‌ర్లు అవ‌స‌రం

Virat Kohli : ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టు అద‌ర‌గొడుతోంది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ విజ‌యాలు సాధించింది. శుక్ర‌వారం (ఏప్రిల్ 10) రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌తో త‌ల‌ప‌డ‌నుంది. ఈ మ్యాచ్‌కు గౌహ‌తి ఆతిథ్యం ఇవ్వ‌నుంది. కాగా.. ఈ మ్యాచ్‌కు ముందు ఆర్‌సీబీ స్టార్ ఆట‌గాడు విరాట్ కోహ్లీని ఓ అరుదైన మైలురాయి ఊరిస్తోంది.

ఈ మ్యాచ్‌లో గ‌నుక కోహ్లీ మూడు సిక్స‌ర్లు కొడితే ఐపీఎల్‌లో 300 సిక్స‌ర్ల మైలురాయిని చేరుకుంటాడు. ఈ ఘ‌న‌త సాధించిన మూడో ఆట‌గాడిగా కోహ్లీ రికార్డుల‌కు ఎక్కుతాడు. క్రిస్‌గేల్‌, రోహిత్ శ‌ర్మ మాత్ర‌మే ఇంత‌క‌ముందు ఈ ఘ‌నత సాధించారు.

David Miller : నేనేందుకు అలా చేశాను.. ఒంట‌రిగా డ్రెస్సింగ్ రూమ్‌లో డేవిడ్ మిల్ల‌ర్.. వీడియో.. చూస్తే క‌న్నీళ్లు రాక‌మాన‌వు..

ఐపీఎల్ ఆరంభ (2008) సీజ‌న్ నుంచి విరాట్ కోహ్లీ రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుకు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు అత‌డు 269 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. 261 ఇన్నింగ్స్‌ల్లో 39.8 స‌గ‌టుతో 8758 ప‌రుగులు సాధించాడు. ఇందులో 8 సెంచ‌రీలు, 64 అర్థ‌శ‌త‌కాలు ఉన్నాయి. 778 ఫోర్లు, 297 సిక్స‌ర్లు బాదాడు. ఐపీఎల్‌లో అత్య‌ధిక సిక్స‌ర్లు కొట్టిన జాబితాలో మూడో ఆట‌గాడిగా కొన‌సాగుతున్నాడు.

ఐపీఎల్‌లో అత్య‌ధిక సిక్స‌ర్లు కొట్టిన ఆట‌గాళ్లు వీరే..

* క్రిస్‌గేల్ – 142 మ్యాచ్‌ల్లో 357 సిక్స‌ర్లు
* రోహిత్ శ‌ర్మ – 275 మ్యాచ్‌ల్లో 309 సిక్స‌ర్లు
* విరాట్ కోహ్లీ – 269 మ్యాచ్‌ల్లో 297 సిక్స‌ర్లు
* ఎంఎస్ ధోని – 278 మ్యాచ్‌ల్లో 264 సిక్స‌ర్లు
* ఏబీ డివిలియ‌ర్స్ – 184 మ్యాచ్‌ల్లో 251 సిక్స‌ర్లు