David Miller : నేనేందుకు అలా చేశాను.. ఒంటరిగా డ్రెస్సింగ్ రూమ్‌లో డేవిడ్ మిల్లర్.. వీడియో.. చూస్తే కన్నీళ్లు రాకమానవు..
క్షణికావేశంలో చేసిన ఓ తప్పు కారణంగా డేవిడ్ మిల్లర్ (David Miller) ఇప్పుడు ఢిల్లీ పాలిట విలన్‌గా నిలిచాడు.
IPL 2026 David Miller reflecting on his brain fade moment in DC dressing room (pic credit@dc)
- 1 రన్ తేడాతో ఓడిపోయిన ఢిల్లీ
- నిరాశలో కూరుకుపోయిన డేవిడ్ మిల్లర్
- ఆఖరి రెండు బంతుల్లో జరిగిన ఘటననే కారణం
David Miller : అరుణ్‌జైట్లీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ బ్యాటర్ విజృంభించి ఆడాడు. 12 పరుగుల వద్ద గాయంతో రిటైర్డ్ హర్ట్‌గా మైదానాన్ని వీడిన మిల్లర్.. జట్టు వికెట్లు కోల్పోవడంతో మళ్లీ గ్రౌండ్లోకి వచ్చాడు. మొత్తంగా 20 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 41 పరుగులతో అజేయంగా నిలిచాడు.
గెలుపు ఆశలు సన్నగిల్లిన దశ నుంచి జట్టు విజయం వైపుకు నిడిపించి హీరోగా మారాడు. అయితే.. క్షణికావేశంలో చేసిన ఓ తప్పు కారణంగా అతడు ఇప్పుడు ఢిల్లీ పాలిట విలన్‌గా నిలిచాడు. మ్యాచ్ ఆఖరి ఓవర్లోని ఆఖరి బాల్‌కు ముందు బంతికి సింగిల్ తీసేందుకు నిరాకరించాడు. ఈ క్రమంలో తన బ్యాటింగ్ భాగస్వామి కుల్దీప్ యాదవ్ పై తనకు నమ్మకం లేదని చెప్పకనే చెప్పాడు. ఇక చివరి బంతిని ప్రసిద్ద్ కృష్ణ స్లో బౌన్సర్‌గా వేయగా.. దాన్ని ఆడడంలో విఫలం అయ్యాడు. పరుగు తీసేందుకు ప్రయత్నించగా కుల్దీప్ రనౌట్ కావడంతో డిల్లీ పరుగు తేడాతో ఓడిపోయింది.
కుల్దీప్కు సింగిల్ ఇవ్వకుండా మిల్లర్ తీసుకున్న నిర్ణయంపై భారత క్రికెట్ వర్గాలు విభేదిస్తుండగా, చివరి రెండు బంతుల్లో మైదానంలో జరిగిన సంఘటన నుంచి ఈ ఎడమచేతివాటం ఆటగాడు ఎలా బయటపడలేకపోతున్నాడో చూపిస్తూ ఢిల్లీ క్యాపిటల్స్ డ్రెస్సింగ్ రూమ్ నుంచి ఒక వీడియోను పంచుకుంది.
Backing our Tiger, always 🫂💙 pic.twitter.com/pAFouiVmVH
— Delhi Capitals (@DelhiCapitals) April 9, 2026
ఆ వీడియోలో డ్రెస్సింగ్ రూమ్‌లో ఓ మూలకు కూర్చున్న డేవిడ్ మిల్లర్ బాధపడుతుండడం కనిపిస్తుంది. వీడియో చివరిలో కోచ్ హేమాంగ్ బదానీ అతడి వద్దకు వెళ్లి ఓదార్చడం కనిపిస్తుంది.
