Virat Kohli : ఆర్‌సీబీ పై వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. బుడ్డోడి కోసం విరాట్ కోహ్లీ చేసిన పనికి అందరూ ఫిదా
ప్రత్యక్షంగా 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్‌ను వీక్షించిన విరాట్ కోహ్లీ (Virat Kohli ) అతడి ఆటతీరుకు ఫిదా అయ్యాడు.
- Thota Vamshi Kumar
- Published On : April 11, 2026 / 09:21 AM IST
IPL 2026 RR vs RCB Virat Kohli Gesture For Vaibhav Sooryavanshi
- ఆర్‌సీబీ పై వైభవ్ సూర్యవంశీ విధ్వంసం
- 15 ఏళ్ల బుడ్డోడి బ్యాటింగ్‌కు కోహ్లీ ఫిదా
- ఆర్ఆర్ క్యాప్ ఆటోగ్రాఫ్ ఇచ్చిన రన్ మెషీన్
Virat Kohli : ఐపీఎల్ 2026లో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ అదరగొడుతున్నాడు. బంతి పడితే బౌండరీయే లక్ష్యంగా అతడి బ్యాటింగ్ సాగుతోంది. ప్రత్యర్థి బౌలర్లకు నిద్రలేని రాత్రుళ్లు మిగులుస్తున్నాడు. ఇక శుక్రవారం గౌహతి వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లోనూ వైభవ్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. 202 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 26 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 78 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అతడు ఐపీఎల్ ఆరెంజ్ క్యాప్‌ను కూడా గెలుచుకున్నాడు.
వైభవ్ ఆటతీరుకు చాలా మంది ఫిదా అయ్యారు. అందులో ఆర్‌సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ (Virat Kohli)సైతం ఉన్నాడు. వైభవ్ ఆటను ప్రత్యక్షంగా వీక్షించిన కోహ్లీ.. మ్యాచ్ అనంతరం వైభవ్‌ను కలిసి ప్రత్యేకంగా అభినందించాడు. అంతేకాదండోయ్.. ఆర్ఆర్ క్యాప్‌పై ఆటోగ్రాఫ్ చేసి వైభవ్‌కు ఇచ్చాడు.
Player of the Match ✅
Orange Cap ✅
An autograph from Kohli 🐐✅Good night to everyone and remember to keep believing in yourself no matter what 💗 pic.twitter.com/Up2BZuYObM
— Rajasthan Royals (@rajasthanroyals) April 10, 2026
Rajat Patidar : అతడే మా కొంపముంచాడు.. ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ కీలక వ్యాఖ్యలు..
ఆ క్యాప్ పై ప్రియమైన వైభవ్.. చాలా బాగా చేశావు అని కోహ్లీ రాశారు. ఈ విషయాన్ని రాజస్థాన్ రాయల్స్ తమ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. కోహ్లీ ఆటోగ్రాఫ్ ఇచ్చిన క్యాప్ ఫోటోను పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ కాగా.. కోహ్లీది మంచి మనసు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
A job well done with a long road ahead! 💗 pic.twitter.com/tymVTrdeqK
— Rajasthan Royals (@rajasthanroyals) April 11, 2026
