Vaibhav Sooryavanshi : బౌలర్ ఎవరు అన్నది చూడను.. కేవలం ఆ ఒక్క దానిపైనే నా దృష్టంతా.. వైభవ్ సూర్యవంశీ కామెంట్స్..
ఐపీఎల్ 2026 సీజన్లో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi ) పెను విధ్వంసం సృష్టిస్తున్నాడు.
IPL 2026 RR vs RCB Vaibhav Sooryavanshi comments after player of the match award received(pic credit @mufaddal_vohra)
- ఆర్సీబీ పై వైభవ్ సూర్యవంశీ విధ్వంసం
- ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సొంతం
- తాను బౌలర్ వైపు చూడనని, బంతిపై మాత్రమే తన దృష్టి ఉంటుందని వ్యాఖ్య
Vaibhav Sooryavanshi : ఐపీఎల్ 2026 సీజన్లో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ పెను విధ్వంసం సృష్టిస్తున్నాడు. శుక్రవారం గౌహతి వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 202 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఆర్సీబీ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 26 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 78 పరుగులు చేశాడు. అతడితో పాటు ధ్రువ్ జురెల్ (81 నాటౌట్; 43 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించడంతో 18 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఆర్ఆర్ లక్ష్యాన్ని సాధించింది.
ఇక ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించిన వైభవ్ సూర్యవంశీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సొంతం చేసుకున్నాడు. అవార్డు అందుకున్న తరువాత అతడు మాట్లాడుతూ.. తాను క్రీజులో ఉన్నప్పుడు బౌలర్ వైపు చూడని, కేవలం బంతిపైనే తన దృష్టి ఉంటుందని చెప్పుకొచ్చాడు.
ఈ రోజు కేక్ కటింగ్ లాంటిది ఏమైనా చేస్తావా? అని అడుగగా.. అలాంటి ఏమీ లేదన్నాడు. ఈ రోజు తొందరగా పడుకోవాలని అన్నాడు. ఎందుకంటే రేపు ఉదయమే ప్లైట్ ఎక్కాల్సి ఉందన్నాడు. తాను మైదానంలో కొత్తగా ఏదీ ప్రయత్నించనని అన్నాడు. ప్రాక్టీస్‌లో ఏదైతే చేస్తానో గ్రౌండ్లో కూడా అలాగే ఆడేందుకు ప్రయత్నిస్తానని చెప్పుకొచ్చాడు.
ఎవరు బౌలింగ్ చేస్తున్నారనే ఆలోచన మనసులో ఉంటుంది, కానీ నేను బౌలర్‌ను చూడను. బంతిపై మాత్రమే దృష్టి పెడుతా. అందుకనే బౌలర్ ఎవరైనా సరే నేను భయపడను. నా సహజ సిద్ధమైన ఆటను ఆడేందుకు ప్రయత్నిస్తా. ఇక నా ప్రయాణం ఇప్పుడే ప్రారంభమైందని, ఎంతో సుదర్ఘమైనదని మానాన్న, కోచ్‌లు అందరూ చెబుతుంటారు. అటు ఇటు చూడకుండా కేవలం ఆట, ప్రక్రియ మీద పూర్తి దృష్టి పెట్టాలని ఎల్లప్పుడూ అంటుంటారు. అని వైభవ్ సూర్యవంశీ అన్నాడు.
Rajat Patidar : అతడే మా కొంపముంచాడు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ కీలక వ్యాఖ్యలు..
ఇక తాను ఔట్ కావడం పై వైభవ్ సూర్యవంశీ కాస్త నిరాశను వ్యక్తం చేశాడు. లక్ష్యాన్ని ఛేదించేటప్పుడు ఇంకాసేపు తాను క్రీజులో ఉంటే మరో రెండు ఓవర్ల ముందే మ్యాచ్‌ను ముగించేవాళ్లం అని తెలిపాడు. ఇలాంటి సమయాల్లో ఓ చెత్త షాట్ ఆడి ఔట్ అయితే బాధ కలుగుతుంది.
