Vaibhav Sooryavanshi : వారీ బుడ్డోడా.. ఒక్క సెంచ‌రీతో ఇన్ని రికార్డులా.. నువ్వు మామూలోడివి కాదురా బాబు..

ఐపీఎల్‌లో 15 ఏళ్ల వైభ‌వ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) సంచ‌నాలు కొన‌సాగుతూనే ఉన్నాయి.

IPL 2026 RR vs SRH Vaibhav Sooryavanshi script history break multiple records (pic credit@ipl)

  • స‌న్‌రైజ‌ర్స్‌తో మ్యాచ్‌లో శ‌త‌క్కొట్టిన వైభ‌వ్ సూర్య‌వంశీ
  • 36 బంతుల్లోనే మూడు అంకెల స్కోరు
  • ఈ క్ర‌మంలో ప‌లు రికార్డులు బ్రేక్‌

Vaibhav Sooryavanshi : ఐపీఎల్‌లో 15 ఏళ్ల వైభ‌వ్ సూర్యవంశీ సంచ‌నాలు కొన‌సాగుతూనే ఉన్నాయి. ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో భాగంగా జైపూర్ వేదిక‌గా శ‌నివారం స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ఓపెన‌ర్ అయిన వైభ‌వ్ సూర్యవంశీ ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు. 15 బంతుల్లో అర్థ‌శ‌త‌కాన్ని అందుకున్న ఈ యువ ఆట‌గాడు 36 బంతుల్లోనే శ‌త‌కాన్ని పూర్తి చేసుకున్నాడు. ఇందులో 5 ఫోర్లు, 12 సిక్స‌ర్లు ఉన్నాయి. అత‌డి స్టైక్ రేటు 278.38 కావ‌డం గ‌మ‌నార్హం. ఇక ఐపీఎల్‌లో అత‌డికి ఇది రెండో శ‌త‌కం.

ఈ క్ర‌మంలో వైభ‌వ్ సూర్య‌వంశీ ప‌లు రికార్డుల‌ను అందుకున్నాడు.

* 40 కంటే త‌క్కువ బంతుల్లో రెండు ఐపీఎల్ సెంచ‌రీలు చేసిన తొలి బ్యాట‌ర్‌గా వైభ‌వ్ సూర్య‌వంశీ చ‌రిత్ర సృష్టించాడు. అత‌డు 2025 ఐపీఎల్‌లో గుజ‌రాత్ టైటాన్స్ పై 35 బంతుల్లోనే సెంచ‌రీ చేశాడు.

* టీ20 క్రికెట్‌లో 1000 ప‌రుగుల మైలురాయిని చేరుకున్న అతి పిన్న వ‌య‌స్కుడిగా రికార్డుల‌కు ఎక్కాడు. అంతేకాదండోయ్ అత్యంత వేగంగా (బంతుల ప‌రంగా) ఈ ఘ‌న‌త సాధించిన ఆట‌గాడిగా నిలిచాడు. 473 బంతుల్లోనే అత‌డు ఈ ఘ‌న‌త సాధించాడు. ఈ క్ర‌మంలో అత‌డు మిచెల్ ఓవెన్ (533 బంతులు), ఆండ్రూ సైమ‌న్స్ (558 బంతులు)ల‌ను అధిగ‌మించాడు.

Vaibhav Sooryavanshi injury : రాజ‌స్థాన్‌కు భారీ షాక్.. న‌డ‌వ‌లేని స్థితిలో వైభ‌వ్ సూర్య‌వంశీ.. ఇద్ద‌రి సాయంతో.. ఐపీఎల్ నుంచి ఔట్‌?

* ఇన్నింగ్స్‌ల ప‌రంగా అత్యంవ వేగంగా టీ20ల్లో 1000 ప‌రుగులు చేసిన నాలుగో ఆట‌గాడిగా నిలిచాడు. వైభ‌వ్ కేవ‌లం 26 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘ‌న‌త సాధించాడు. ఆస్ట్రేలియా స్టార్ ఆట‌గాళ్లు బ్రాడ్ హాడ్జ్‌, షాన్ మార్ష్‌లు కేవ‌లం 23 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మైలురాయిని చేరుకున్నారు.

* ఐపీఎల్‌లో అత్య‌ధిక సార్లు 15 లేదా అంత‌కంటే త‌క్కువ బంతుల్లో హాఫ్ సెంచ‌రీ చేసిన ప్లేయ‌ర్‌గా రికార్డుల‌కు ఎక్కాడు. వైభ‌వ్ మూడు సార్లు ఈ ఘ‌న‌త సాధించాడు.

* స‌న్‌రైజ‌ర్స్‌పై వైభ‌వ్ సెంచ‌రీ ఐపీఎల్ చ‌రిత్ర‌లో మూడో ఫాస్టెస్ట్ సెంచ‌రీ. తొలి స్థానంలో క్రిస్ గేల్ ఉన్నాడు. 30 బంతుల్లోనే వెస్టిండీస్ దిగ్గ‌జం సెంచ‌రీ చేశాడు. ఇక రెండో స్థానంలో వైభ‌వే ఉన్నాడు. అత‌డు గ‌తేడాది 35 బంతుల్లోనే మూడు అంకెల స్కోరు అందుకున్నాడు.