MI vs LSG : ముంబైతో మ్యాచ్‌కు ముందు సచిన్ టెండూల్కర్ ఇంటికి లక్నో ఆటగాళ్లు..
ఐపీఎల్ 2026లో భాగంగా నేడు (మే 4) వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య (MI vs LSG )మ్యాచ్ జరగనుంది.
- Thota Vamshi Kumar
- Updated on- May 4, 2026 / 12:27 PM IST
IPL 2026 Sachin Tendulkar hosted the Lucknow Super Giants for dinner ahead of MI vs LSG match
- నేడు లక్నో వర్సెస్ ముంబై మ్యాచ్
- ఈ మ్యాచ్‌కు కొన్ని గంటల ముందు సచిన్ ఇంటికి లక్నో ప్లేయర్లు
- విందు ఇచ్చిన మాస్టర్ బ్లాస్టర్
MI vs LSG : ఐపీఎల్ 2026లో భాగంగా నేడు (మే 4) వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. కాగా.. ఈ మ్యాచ్‌కు కొన్ని గంటల ముందు క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ లక్నో ప్లేయర్లకు తన ఇంటిలో విందు ఇచ్చాడు. లక్నో జట్టులో పలువురు ఆటగాళ్లకు ఇది ఓ ప్రత్యేక క్షణంగా నిలిచిపోయింది.
సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్ 2026 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలోనే తమ టీమ్ సభ్యులను అర్జున్ తమ ఇంటికి ఆహ్వానించి విందు ఇచ్చాడు. లక్నో కెప్టెన్ రిషబ్ పంత్, స్టార్ పేసర్లు మహ్మద్ షమీ, మోసిన్ ఖాన్, ఆవేశ్ ఖాన్, యువ ఆటగాళ్లు అబ్దుల్ సమద్, హిమ్మత్ సింగ్ వంటి ఆటగాళ్లు ఈ విందుకు హాజరు అయ్యారు.
BCCI : ఐపీఎల్‌లో గర్ల్‌ఫ్రెండ్ కల్చర్ పై బీసీసీఐ ఆగ్రహం.. త్వరలోనే కొత్త నిబంధనలు..!
ఇందుకు సంబంధించిన కొన్ని ఫోటోలను మోసిన్ ఖాన్ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు. సచిన్‌తో గడిపిన క్షణాలు ఎంతో ప్రత్యేకం అని, ఇక విందుకు ఆహ్వానించిన అర్జున్ టెండూల్కర్‌కు ధన్యవాదాలు తెలియజేశాడు.
ఐపీఎల్ 2026లో ముంబై ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు ఆడింది. కేవలం రెండు మ్యాచ్‌ల్లోనే విజయం సాధించింది. ఈ క్రమంలో ఇప్పటికే ముంబై జట్టు ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్ర్కమించింది. కేవలం సాంకేతికంగా మాత్రమే ఆ జట్టు రేసులో ఉంది. నేటి లక్నోతో మ్యాచ్‌లో ఓడిపోతే.. అధికారికంగా ఈ సీజన్ నుంచి నిష్ర్కమించిన తొలి జట్టుగా నిలుస్తుంది. ప్లేఆఫ్స్‌కు చేరుకోని ముంబై మిగిలిన మ్యాచ్‌ల్లో గెలిచి ప్రస్తుతం ఉన్న 9వ స్థానం నుంచి మెరుగైన స్థానానికి వెళ్లాలని భావిస్తోంది.
మరోవైపు లక్నో సూపర్ జెయింట్స్ ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడింది. రెండు మ్యాచ్‌ల్లోనే విజయం సాధించింది. నేడు ముంబైతో మ్యాచ్‌లో ఓడిపోతే.. లక్నో ప్లేఆఫ్స్ ఆశలు గల్లంతు అయినట్లే.
