BCCI : ఐపీఎల్లో గర్ల్‌ఫ్రెండ్ కల్చర్ పై బీసీసీఐ ఆగ్రహం.. త్వరలోనే కొత్త నిబంధనలు..!
ఐపీఎల్ 2026లో కొంతమంది ఆటగాళ్లు తమ ప్రియురాళ్లతో బహిరంగంగా కనిపించడంపై బీసీసీఐ (BCCI ) అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం
BCCI angry on Girlfriend Culture In IPL and New Rules To Be Implemented report
- ఐపీఎల్లో గర్ల్ ఫ్రెండ్ కల్చర్ పై బీసీసీఐ ఆగ్రహం
- టీమ్ బస్సులతో పాటు ఆటగాళ్లు ఉండే హోటల్స్‌లోనే బస చేస్తున్న కొందరు ప్లేయర్ల ప్రియురాళ్లు
- కొత్త నిబంధనలు తెచ్చే ఆలోచనలో బీసీసీఐ
BCCI : ఐపీఎల్ 2026లో కొంతమంది ఆటగాళ్లు తమ ప్రియురాళ్లతో బహిరంగంగా కనిపించడంపై బీసీసీఐ అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం జరుగుతున్న ఈ సీజన్లో హార్దిక్ పాండ్యా, యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్, అర్ష్‌దీప్ సింగ్ వంటి ఆటగాళ్లు తమ గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి టీమ్ బస్సుల్లో ప్రయాణిస్తూ, టీమ్ హోటళ్లలో బస చేస్తూ కనిపిస్తున్నారు. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో పెద్ద సమస్య తలెత్తవచ్చని బీసీసీఐ భావిస్తోంది. ఈ క్రమంలోనే ఐపీఎల్లో గర్ల్‌ఫ్రెండ్ కల్చర్‌ను నిషేదించడానికి సిద్ధమవుతోందని నివేదికలు వస్తున్నాయి.
ఆటగాళ్ల ప్రియురాళ్లలో కొందరు ఇన్‌ప్లుయెన్సర్ లుగా ఉన్నారు. వీరిలో కొందరు గతంలో సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్‌లను ప్రచారం చేశారని పలు నివేదికలు సూచిస్తున్నాయి. అదే సమయంలో వీరి ద్వారా సున్నితమైన సమాచారం లీక్ అయితే క్రీడల యొక్క సమగ్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని బీసీసీఐ ఆందోళన చెందుతోంది.
CSK : సీజన్ మధ్యలో సీఎస్కేకు భారీ షాక్..
ఆటగాళ్ల ప్రియురాళ్లను ‘అధికారికంగా ప్రకటించబడిన భాగస్వాములు’ అని చెప్పి, వారిని ఆటగాళ్లతో కలిసి ఉండటానికి అనుమతిస్తున్నారు. దీనిని ఇప్పుడు ఆపకపోతే, భవిష్యత్తులో పెద్ద సమస్యలకు దారితీయవచ్చు. ప్రియురాళ్ల కోసం జట్టు బస్సులను ఆగేలా చేస్తున్న సందర్భాలను మేము చూస్తున్నాము, వారు ఆటగాళ్లతో పాటు అదే హోటళ్లలో బస చేస్తున్నారు. అని ఓ బీసీసీఐ అధికారి ఆందోళన వ్యక్తం చేసినట్లు దైనిక్ జాగరణ్ తెలిపింది.
ఈ భాగస్వాములలో చాలామంది ప్రసిద్ధ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కావడంతో, సున్నితమైన సమాచారం ప్రమాదవశాత్తు లీక్ అయి.. క్రీడ యొక్క సమగ్రతకు ముప్పు వాటిల్లవచ్చని బోర్డు ఆందోళన చెందుతున్నట్లు సదరు అధికారి పేర్కొన్నారు. బీసీసీఐ తన తదుపరి సమావేశంలో ఈ విషయాన్ని పరిష్కరించి, లీగ్‌లో “గర్ల్‌ఫ్రెండ్ కల్చర్”కు సంబంధించి కఠినమైన మార్గదర్శకాలను జారీ చేయాలని భావిస్తున్నట్లుగా వెల్లడించారు.
ఇక ఈ నిబంధనలు ఐపీఎల్‌కు మాత్రమే కాకుండా, అంతర్జాతీయ పర్యటనల సమయంలో భారత జాతీయ జట్టుకు కూడా వర్తిస్తాయని సమాచారం. ఐపీఎల్ జట్లు ప్రైవేటు యాజమాన్యంలో ఉన్నప్పటికీ, అన్ని ఫ్రాంచైజీలకు వర్తించేలా ఓ నిబంధనను తీసుకురావాలని బీసీసీఐ ఉద్దేశంగా కనిపిస్తోంది.
