Sanju Samson : మ్యాచ్.. మ్యాచ్‌కు స్కోరును పెంచుకుంటూ పోతున్న సంజూ శాంసన్.. సెంచరీ చేసేందుకు పదేళ్లు..!
ఎన్నో ఆశలతో ఐపీఎల్ 2026 సీజన్‌లో అడుగుపెట్టిన సంజూ శాంసన్ (Sanju Samson ) అంచనాలను అందుకోవడంలో ఘోరంగా విఫలం అవుతున్నాడు.
- Thota Vamshi Kumar
- Updated on- April 6, 2026 / 08:44 AM IST
IPL 2026 Sanju Samson failes in three consecutive matches
- వరుసగా మూడు మ్యాచ్‌ల్లోనూ విఫలమైన సంజూ శాంసన్
- సోషల్ మీడియాలో విమర్శల వర్షం
- జట్టు నుంచి తొలగించాలని సీఎస్‌కే ఫ్యాన్స్ డిమాండ్
Sanju Samson : ఎన్నో ఆశలతో ఐపీఎల్ 2026 సీజన్‌లో అడుగుపెట్టిన సంజూ శాంసన్ అంచనాలను అందుకోవడంలో ఘోరంగా విఫలం అవుతున్నాడు. ఈ సీజన్‌కు ముందు ట్రేడింగ్ ద్వారా రాజస్థాన్ రాయల్స్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ వచ్చాడు సంజూ శాంసన్. ఇప్పటి వరకు అతడు సీఎస్‌కే తరుపున మూడు మ్యాచ్‌లు ఆడగా అన్ని మ్యాచ్‌ల్లోనూ ఘోరంగా విఫలం అయ్యాడు. ఒక్క మ్యాచ్‌లోనూ రెండు అంకెల స్కోరు నమోదు చేయలేదు. సింగిల్ డిజిట్‌కే ఔట్ అయ్యాడు.
ఆదివారం చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 5 బంతులు ఆడిన సంజూ శాంసన్ ఓ సిక్స్ సాయంతో 9 పరుగులు చేసి జాకెబ్ డఫీ బౌలింగ్‌లో దేవ్‌దత్ పడిక్కల్ క్యాచ్ అందుకోవడంతో పెవిలియన్‌కు చేరుకున్నాడు. ప్రస్తుతం సంజూ శాంసన్ పై విమర్శల వర్షం కొనసాగుతోంది. అతడిని జట్టు నుంచి తప్పించాలని సీఎస్‌కే ఫ్యాన్స్ కోరుతున్నారు.
ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో ఆడిన తొలి మ్యాచ్‌లో 6 పరుగులు చేసిన సంజూ శాంసన్.. ఆ తరువాత పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 పరుగులు సాధించాడు. తాజాగా ఆర్‌సీబీతో మ్యాచ్‌లో 9 పరుగులు నమోదు చేశాడు. దీనిపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఒక్కొ మ్యాచ్‌కు తన స్కోరును శాంసన్ పెంచుకుంటూ పోతున్నాడని, సెంచరీ చేసేందుకు ఓ పదేళ్ల సమయం అతడికి ఇస్తే సరిపోతుందని వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు.
Ruturaj Gaikwad : తప్పు నాదే.. మా వాళ్లు ఇలా బ్యాటింగ్ చేస్తారని అనుకోలేదు.. ముందే తెలిసి ఉంటే..
