Sara Tendulkar : ల‌క్నోలో అడుగుపెట్టిన సారా పాప‌.. త‌మ్ముడి కోస‌మా? ప్రియుడి కోస‌మా?.. ముసిముసి న‌వ్వులు న‌వ్వుతూ ఏమ‌న్న‌దంటే?

క్రికెట్ దిగ్గ‌జం స‌చిన్ కూతురిగా సారా టెండూల్క‌ర్ (Sara Tendulkar) దాదాపుగా అంద‌రికి తెలుసు.

IPL 2026 Sara Tendulkar in Lucknow she blushes when asked about LSG vs GT support

  • ఆదివారం ల‌క్నో, గుజ‌రాత్ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్‌
  • ల‌క్నోకు చేరుకున్న స‌చిన్ కూతురు
  • ల‌క్నో, గుజ‌రాత్ జ‌ట్ల‌లో సారా సపోర్టు ఎవ‌రికి?

Sara Tendulkar : సారా టెండూల్క‌ర్‌.. పెద్ద‌గా ప‌రిచ‌యం చేయాల్సిన ప‌ని లేదు. క్రికెట్ దిగ్గ‌జం స‌చిన్ టెండూల్క‌ర్ కూతురిగా అంద‌రికి తెలుసు. ఇక సారా టీమ్ఇండియా వ‌న్డే, టెస్టు కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్‌తో ప్రేమ‌లో ఉన్న‌ట్లు గ‌త కొంత‌కాలంగా వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే.. వీటిపై అటు గిల్ గానీ, ఇటు సారా గానీ ఎన్న‌డూ స్పందించ‌లేదు. ఇక తాజాగా సారా టెండూల్క‌ర్ ల‌క్నో లో అడుగుపెట్టింది.

మామూలుగా అయితే.. ఇది పెద్ద విష‌యం కాదు గానీ.. ఆదివారం ఐపీఎల్ 2026లో భాగంగా ల‌క్నోలోని ఎకానా స్టేడియంలో గుజ‌రాత్ టైటాన్స్‌తో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఈ మ్యాచ్ చూసేందుకే సారా ల‌క్నోకు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది.

Vaibhav Sooryavanshi : బౌల‌ర్ ఎవ‌రు అన్న‌ది చూడ‌ను.. కేవ‌లం ఆ ఒక్క దానిపైనే నా దృష్టంతా.. వైభ‌వ్ సూర్యవంశీ కామెంట్స్‌..

ఐపీఎల్‌లో గుజ‌రాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్ అన్న సంగ‌తి తెలిసిందే. ఇక ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ కు స‌చిన్ కొడుకు, సారా టెండూల్క‌ర్ త‌మ్ముడు అయిన అర్జున్ టెండూల్క‌ర్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్నాడు.

ల‌క్నో విమానాశ్ర‌మంలో సారా క‌నిపించ‌గానే.. మీరు ల‌క్నో, గుజ‌రాత్‌ల‌లో ఎవ‌రికి స‌పోర్టు చేస్తారు అనే ప్ర‌శ్న ఎదురైంది. దీనికి సారా టెండూల్క‌ర్ స‌మాధానం మాత్రం ఇవ్వ‌లేదు. ముసి ముసిన‌వ్వులు న‌వ్వుకుంటూ అక్క‌డి నుంచి వెళ్లిపోయింది. ప్ర‌స్తుతం ఈ వీడియో వైరల్‌గా మారగా నెటిజ‌న్లు మాత్రం త‌మ‌దైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

ఆ న‌వ్వుకి అర్థం తెలియ‌డం లేదా.. గిల్ కోస‌మే సారా వ‌చ్చింద‌ని అంటున్నారు. ఎందుకంటే.. అర్జున్ టెండూల్క‌ర్ ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ త‌రుపున ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడ‌లేద‌ని, గుజ‌రాత్‌తో మ్యాచ్‌లో కూడా అత‌డికి తుది జ‌ట్టులో చోటు ద‌క్క‌డం క‌ష్ట‌మేన‌ని అంటున్నారు.

Virat Kohli : ఆర్‌సీబీ పై వైభ‌వ్ సూర్య‌వంశీ విధ్వంసం.. బుడ్డోడి కోసం విరాట్ కోహ్లీ చేసిన ప‌నికి అంద‌రూ ఫిదా

ఐపీఎల్ 2026 సీజ‌న్‌కు ముందు ట్రేడింగ్ లో అర్జున్ టెండూల్క‌ర్ ముంబై ఇండియ‌న్స్ నుంచి ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌కు వ‌చ్చాడు. ఇప్ప‌టి వ‌ర‌కు అత‌డు ల‌క్నో త‌రుపున అరంగ్రేటం చేయ‌లేదు.