Mumbai Indians : ఐపీఎల్ 2026 విజేత‌గా ముంబై ఇండియ‌న్స్..! బీసీసీఐ ప్లాన్ చేసిందా? అప్పుడు ఇలాగే.. షెడ్యూల్‌తో బ‌య‌ట‌ప‌డ్డ నిజం?

ఐపీఎల్ 2026 సీజ‌న్ విజేత‌గా ముంబై ఇండియ‌న్స్ (Mumbai Indians) నిలుస్తుంద‌ని ప‌లువురు జోస్యం చెబుతున్నారు

IPL 2026 schedule RCB vs SRH first match mumbai indians champion

Mumbai Indians : ఐపీఎల్ 2026 సీజ‌న్ మార్చి 28 నుంచి ప్రారంభం కానుంది. భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఐపీఎల్ 2026 సీజ‌న్ తొలి ద‌శ షెడ్యూల్‌ను విడుద‌ల చేసింది. ప‌లు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో 20 మ్యాచ్‌ల షెడ్యూల్‌ను మాత్ర‌మే విడుద‌ల చేసింది. ఆరంభ మ్యాచ్ రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్ల మ‌ధ్య జ‌ర‌గ‌నుంది. ఈ మ్యాచ్‌కు బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి స్టేడియం ఆతిథ్యం ఇవ్వ‌నుంది.

యాదృచ్చికం ఏమిటి?

ఐపీఎల్ 2026 సీజ‌న్ విజేత‌గా ముంబై ఇండియ‌న్స్ నిలుస్తుంద‌ని ప‌లువురు జోస్యం చెబుతున్నారు. ఇందుకు ఐపీఎల్ 2026 తొలి ద‌శ షెడ్యూలే కార‌ణం అని చెబుతున్నారు. 2017 ఐపీఎల్‌లో కూడా ఆరంభ మ్యాచ్ రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్ల మ‌ధ్యే జ‌రిగింది. ఆ సీజ‌న్‌లో ముంబై ఐపీఎల్ క‌ప్పును ముద్దాడింది. యాదృచ్చికంగా ఈ సారి కూడా తొలి మ్యాచ్ ఆర్‌సీబీ, స‌న్‌రైజ‌ర్స్ మ‌ధ్య జ‌ర‌గ‌నుంది. దీంతో ముంబై క‌ప్పు గెలుస్తుంద‌ని అంటున్నారు.

BAN vs PAK : మేం చేసిన బిగ్ మిస్టేక్ అదే.. అందుక‌నే బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోయాం.. లేదంటేనా.. పాక్ కెప్టెన్ షాహీన్ అఫ్రిది కామెంట్స్‌..

18 ఏళ్ల త‌రువాత‌..

ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌కు బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి స్టేడియం ఆతిథ్యం ఇవ్వ‌డం 18 ఏళ్ల త‌రువాత ఇదే తొలిసారి కావ‌డం గ‌మ‌నార్హం. ఐపీఎల్ ఆరంభ ఎడిష‌న్ అంటే 2008లో తొలి మ్యాచ్‌కు చిన్న‌స్వామి ఆతిథ్యం ఇచ్చింది. నాటి మ్యాచ్‌లో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌, రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి.

నాలుగు మ్యాచ్‌లు ఆడ‌నున్న ముంబై..

ఐపీఎల్ 2026 తొలి ద‌శ షెడ్యూల్‌లో ముంబై ఇండియ‌న్స్ నాలుగు మ్యాచ్‌లు ఆడ‌నుంది. ముంబై త‌మ తొలి మ్యాచ్‌ను మార్చి 29న వాంఖ‌డే మైదానంలో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో ఆడ‌నుంది. ఏప్రిల్ 4న ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో త‌ల‌ప‌డ‌నుంది. ఏప్రిల్ 7న రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌తో గౌహ‌తి వేదిక‌గా ఆడ‌నుంది. ఏప్రిల్ 12న వాంఖ‌డే వేదిక‌గా ఆర్‌సీబీని ఢీ కొట్ట‌నుంది.

Hardik Pandya : ప్ర‌పంచ‌క‌ప్ వేడుక‌ల్లో గ‌ర్ల్‌ఫ్రెండ్‌తో స‌ర‌సాలు.. చిక్కుల్లో హార్దిక్ పాండ్యా.. శివాజీన‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్‌లో ఆల్‌రౌండ‌ర్‌పై న్యాయ‌వాది ఫిర్యాదు..

హార్దిక్ పాండ్యా సార‌థ్యంలో బ‌రిలోకి దిగుతున్న‌ ముంబై ఇండియన్స్ ఆరోసారి క‌ప్పును ముద్దాడాల‌ని ఆరాట‌ప‌డుతోంది.

ఐపీఎల్‌ 2026 కోసం ముంబై ఇండియన్స్ జట్టు ఇదే..

హార్దిక్ పాండ్యా (కెప్టెన్‌), రోహిత్ శర్మ, జ‌స్‌ప్రీత్‌ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, మిచెల్ సాంట్నర్, ట్రెంట్ బౌల్ట్, విల్ జాక్స్, క్వింటన్ డికాక్, ర్యాన్ రికెల్టన్, శార్దూల్ ఠాకూర్, ఏఎమ్ ఘజన్‌ఫర్, అశ్విని కుమార్, కార్బిన్ బోష్, దీపక్ చాహర్, రాజ్‌మాన్ డికాండే, రగ్‌మన్ డికాండె, రగ్‌మన్ డికాండే బావా, రాబిన్ మింజ్, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, డానిష్ మలేవార్, అథర్వ అంకోలేకర్, మయాంక్ రావత్, మహ్మద్ ఇజార్.