IPL 2026 RCB vs GT : మా ఓటమికి ప్రధాన కారణాలివే.. కోహ్లీ క్యాచ్ డ్రాప్‌పై జీటీ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కీలక కామెంట్స్..

IPL 2026 RCB vs GT : ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే విరాట్ కోహ్లీ ఇచ్చిన క్యాచ్ ను వాషింగ్టన్ సుందర్ జారవిడవడం పై గిల్ స్పందిస్తూ కీలక కామెంట్స్ చేశాడు.

Shubman Gill

  • గుజరాత్ టైటాన్స్ పై ఆర్సీబీ ఘన విజయం
  • ఓటమిపై కీలక కామెంట్స్ చేసిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్
  • కోహ్లీ క్యాచ్ వదిలేయడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

IPL 2026 RCB vs GT : ఐపీఎల్ 2026 టోర్నీలో భాగంగా శుక్రవారం రాత్రి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ (Royal Challengers Bengaluru) వర్సెస్ గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ జట్టు ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ లో ఓటమి అనంతరం గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) మాట్లాడుతూ ఓటమికి గల కారణాలపై కీలక కామెంట్స్ చేశాడు.

Also Read : Akash Ambani : ముంబై ఇన్నింగ్స్ మ‌ధ్య‌లోనే వెళ్లిపోయిన ఆకాశ్ అంబానీ.. వెళ్తూ వెళ్తూ సైగ‌లు చేశాడు చూడండి.. వామ్మో..

ఇన్నింగ్స్ మధ్యలో తాము మెరుగైన స్థితిలో ఉన్నామని, కానీ, కీలకమైన సమయాల్లో చేసిన కొన్ని తప్పిదాలు మ్యాచ్ ఫలితాన్ని మార్చేశాయని శుభ్‌మన్ గిల్ విచారం వ్యక్తం చేశాడు. ముఖ్యంగా 16వ ఓవర్ నుంచి 19వ ఓవర్ వరకు ఉన్న ఆ మూడు ఓవర్లు మ్యాచ్ ను మలుపు తిప్పాయి. ఆ సమయంలో ఆశించిన స్థాయిలో బౌండరీలు రాకపోవడం వల్ల జట్టు స్కోరు 220 దాటాల్సిన చోట 205 పరుగుల వద్దే ఆగిపోయింది. చివరి ఓవర్లలో బ్యాటర్లు మరింత వేగంగా ఆడిఉంటే విజయం సాధ్యమయ్యేదని గిల్ చెప్పుకొచ్చాడు.


ఈ మ్యాచ్‌లో సాయి సుదర్శన్ సెంచరీ చేయడం పట్ల గిల్ స్పందిస్తూ.. సుదర్శన్‌ను మనస్ఫూర్తిగా అభినందించాడు. అతను అద్భుతంగా ఆడాడు.. తదుపరి మ్యాచ్ లో కూడా ఇలాగే రాణించాలని గిల్ కోరాడు. ఇదే సమయంలో గిల్ ఓ సరదా కామెంట్ చేశాడు. ‘వచ్చే మ్యాచ్‌లో పవర్ ప్లే సమయంలో నాకు కూడా కొంచెం ఎక్కువ స్ట్రైక్ ఇస్తాడని కోరుకుంటున్నాను’ అని గిల్ నవ్వుతూ అన్నాడు. అయితే, ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే విరాట్ కోహ్లీ ఇచ్చిన క్యాచ్ ను వాషింగ్టన్ సుందర్ జారవిడవడం పై గిల్ స్పందిస్తూ.. అది ఆటలో ఒక భాగమైనప్పటికీ భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు.

డకౌట్ కావాల్సిన బ్యాటర్ బతికిపోతే అది ఫీల్డర్‌పైనే కాకుండా బౌలర్ల ఆత్మవిశ్వాసంపై కూడా ప్రభావం చూపుతుందని తెలిపాడు. కోహ్లీ ఆ అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడంటూ గిల్ చెప్పుకొచ్చాడు. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని తిరిగి పుంజుకుంటామని శుభ్‌మన్ గిల్ ధీమా వ్యక్తం చేశాడు. బౌలింగ్‌లో నిలకడ లేకపోవడం, ఫీల్డింగ్‌లో చిన్న చిన్న పొరపాట్లు సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని చెప్పాడు.


ఇదిలాఉంటే.. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ సూపర్ సెంచరీతో మెరిశాడు. 58 బంతుల్లో 100 పరుగులు చేశాడు. 206 పరుగుల టార్గెట్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేజ్ చేసింది. మరో 7బంతులు మిగిలి ఉండగానే 5వికెట్ల తేడాతో గుజరాత్‌ను చిత్తు చేసింది. బెంగళూరు బ్యాటర్లలో విరాట్ కోహ్లి, పడిక్కల్ హాఫ్ సెంచరీలతో కదం తొక్కారు. కోహ్లి 44 బంతుల్లో 81 పరుగులు.. పడిక్కల్ 27 బంతుల్లో 55 పరుగులు బాదారు. ఈ సీజన్ లో ఆర్సీబీకి ఇది 5వ విజయం. ఈ గెలుపుతో పాయింట్ల టేబుల్‌లో 2వ స్థానానికి ఆర్సీబీ చేరింది. అటు గుజరాత్ కు ఇది బ్యాక్ టు బ్యాక్ ఓటమి. హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసి ఊపు మీద కనిపించిన గుజరాత్.. వరుసగా రెండు మ్యాచుల్లో ఓటమి పాలైంది.