IPL  2026 : ఏం చేశావ్రా నాయనా..! నిమ్మకాయ చూపిస్తు మంత్రాలు.. దెబ్బకు దూబే వికెట్ పడింది.. వీడియో వైరల్.. నెటిజన్ల కామెంట్ల వర్షం.. 

IPL 2026 : ఐపీఎల్ 2026 టోర్నీలో భాగంగా శనివారం రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

  • ఉప్పల్ స్టేడియంలో ఎస్ఆర్‌హెచ్ వర్సెస్ సీఎస్‌కే మ్యాచ్
  • స్టేడియంలో నిమ్మకాయతో మంత్రాలు చదివిన వ్యక్తి
  • శివందూబే ఔట్.. వీడియో వైరల్ 
  • సోషల్ మీడియాలో నెటిజన్ల ప్రశ్నల వర్షం

IPL 2026 : ఐపీఎల్ 2026 టోర్నీలో భాగంగా శనివారం రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో చివరికి ఎస్ఆర్‌హెచ్ జట్టు విజయం సాధించింది. అయితే, ఈ మ్యాచ్‌లో ఊహించని ఘటన ఒకటి చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read : IPL 2026 : SRH సూపర్ విక్టరీ.. కావ్య పాప సంబరాలు అదుర్స్.. ఎగిరి గంతులేస్తూ.. వీడియో వైరల్

సీఎస్‌కే జట్టు బ్యాటింగ్ సమయంలో ఓ విచిత్ర ఘటన జరిగింది. 16వ ఓవర్ నడుస్తుంది.. ఎస్ఆర్‌హెచ్ బౌలర్ సాకిబ్ హుస్సేన్ బౌలింగ్ చేస్తున్నాడు. నాలుగు బాల్స్ పూర్తయ్యాయి.. అప్పటికే సీఎస్‌కే జట్టు స్కోర్ 156 పరుగులు. ఆరు వికెట్లు కోల్పోయింది. క్రీజులో శివమ్ దూబే ఉన్నాడు. అప్పటికే దూబే 21 పరుగులతో క్రీజులో బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇక్కడే సరిగ్గా విచిత్ర ఘటన చోటు చేసుకుంది.

స్టేడియంలో క్రికెట్ చూసేందుకు వచ్చిన ఎస్ఆర్‌హెచ్ అభిమాని ఒకరు.. ఓ నిమ్మకాయను పట్టుకొని శివదూబే వైపు చూపిస్తూ మంత్రాలు చదివాడు.. సాకిబ్ హుస్సేన్ ఐదో బాల్ వేసే సమయంలో ఆ నిమ్మకాయను దూబే వైపు విసిరేసినట్లు చేశాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడ దూబే వికెట్ కోల్పోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.


కొందరు నెటిజన్లు.. ఇది అనుకోకుండా జరిగిన సంఘటన అని.. వికెట్ పడింది అతను నిమ్మకాయ పట్టుకొని మంత్రాలు చదివినందుకు కాదు.. ఇది ఓ ఫన్నీ వీడియో అంటూ పేర్కొంటుండగా.. మరికొందరు నెటిజన్లు.. నిజంగానే నిమ్మకాయ పట్టుకొని మంత్రాలు చదివితే వికెట్లు పడతాయా అంటూ కామెంట్లు చేస్తున్నారు. మంత్రాలు నిజంగా మ్యాచ్‌లు గెలిపిస్తాయా? అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు నెటిజన్లు ఇదంతా ఫేక్ వీడియో అన్నట్లుగా కొట్టిపారేస్తున్నారు. అయితే, ఇది నిజమైన వీడియోనా.. లేదంటే ఏఐ వీడియోనా..? అనేది ప్రస్తుతం ప్రశ్నగానే ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.