IPL 2026 : SRH సూపర్ విక్టరీ.. కావ్య పాప సంబరాలు అదుర్స్.. ఎగిరి గంతులేస్తూ.. వీడియో వైరల్
IPL 2026 : ఎస్ఆర్హెచ్ జట్టు విజయం అనంతరం స్టేడియంలో కావ్యమారన్ చేసిన సెలబ్రేషన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Kavya Maran
- సీఎస్కే జట్టుపై ఎస్ఆర్హెచ్ విజయం
- స్టేడియంలో సంబురాలు చేసుకున్న కావ్య మారన్
- కావ్య మారన్ సెలెబ్రేషన్స్ వీడియో వైరల్
IPL 2026 : ఐపీఎల్ 2026 టోర్నీలో భాగంగా శనివారం రాత్రి ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగింది. చివరిలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 60 బంతుల్లో 84 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో ఏడు వికెట్లు ఉన్నాయి. చెన్నై గెలుపు ఖాయమని అందరూ భావించారు. కానీ, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు బౌలర్లు అద్భుత బంతులతో చెన్నై ఫ్యాన్స్ ఆశలపై నీళ్లు చల్లారు. బంతి బంతికి ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచుతూ చెన్నై చేతుల్లోంచి మ్యాచ్‌ను లాగేసుకున్నారు. దీంతో 10 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు విజయం సాధించింది.
Also Read : IPL 2026 : వారి వల్లే మేము గెలిచాం.. నాపై ఒత్తిడి చాలా తగ్గింది.. ఇషాన్ కిషన్ కీలక కామెంట్స్
చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు విజయం సాధించడంతో ఆ జట్టు యాజమాని కావ్య మారన్ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. విజయం అనంతరం ఎగిరి గంతులేస్తూ సంబురాలు చేసుకున్నారు. తన జట్టు గెలుపును చూసి కావ్యమారన్ ఎంతో ఉత్సాహంగా గాలిలో పిడికిలి బిగించి, చప్పట్లు కొడుతూ చేసిన సంబరాలు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
SRH ENTERS TOP 4 OF IPL POINTS TABLE. 🎯
– An animated celebration by Kavya Maran. ❤️ pic.twitter.com/kPm109cPtU
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 18, 2026
ఉత్కంఠ పోరులో ఎస్ఆర్హెచ్ విజయం..
చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 9 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ (59), క్లాసెన్ (59) హాఫ్ సెంచరీలతో మెరిశారు. 195 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన సీఎస్కే ఎనిమిది వికెట్ల నష్టానికి 184 పరుగులే చేసింది. హైదరాబాద్ బౌలర్లు సత్తా చాటారు. ప్రత్యర్థిని కట్టడి చేయగలిగారు. మలింగ మూడు వికెట్లతో మెరిశాడు. నితీశ్ రెండు వికెట్లు తీశాడు. ఈ సీజన్ లో హైదరాబాద్ కు ఇది బ్యాక్ టు బ్యాక్ విక్టరీ.
