IPL 2026 : వారి వల్లే మేము గెలిచాం.. నాపై ఒత్తిడి చాలా తగ్గింది.. ఇషాన్ కిషన్ కీలక కామెంట్స్
IPL 2026 : చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన ఉత్కంఠ పోరులో సన్ రైజర్స్ హైదరాబాద్ గెలిచింది. 10 పరుగుల తేడాతో చెన్నైని చిత్తు చేసింది.
- Harishth Thanniru
- Published on- April 19, 2026 / 07:10 AM IST
Sunrisers Hyderabad
- సీఎస్‌కే జట్టుపై ఎస్ఆర్‌హెచ్ విజయం
- అభిషేక్, క్లాసెన్ మెరుపులు
- సొంతగడ్డపై సన్‌రైజర్స్ మరో విజయం
- వారివల్లే గెలిచామంటూ ఇషాన్ కిషన్ కీలక కామెట్స్
IPL 2026 : ఐపీఎల్ 2026 టోర్నీలో భాగంగా శనివారం హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) వర్సెస్ చెన్నై సూపర్‌కింగ్స్ (CSK) జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. చివరి వరకు ఉత్కంఠతగా సాగిన ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు పది పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ సందర్భంగా ఆ జట్టు కెప్టెన్ ఇషాన్ కిషన్ మాట్లాడుతూ.. వాళ్ల వల్లే గెలిచామంటూ కీలక కామెంట్స్ చేశారు.
Also Read : RCB vs DC : గ్రీన్ కలర్ జెర్సీతో బరిలోకి దిగిన బెంగళూరు.. ఎందుకో తెలుసా?
మ్యాచ్ అనంతరం ఇషాన్ కిషన్ మాట్లాడుతూ.. యువ బౌలర్లపై ప్రశంసల జల్లు కురిపించాడు. మా యువ బౌలర్లు అద్భుత బంతులతో ప్రత్యర్థి బ్యాటర్లపై ఒత్తిడి తెస్తున్నారు. వారు తమ సొంత ఆలోచనలతో.. ప్రణాళిక ప్రకారం బౌలింగ్ చేస్తున్నారు. ఈ కారణంగా ఫీల్డింగ్ సెట్ చేయడంలో కెప్టెన్‌గా నాపై ఒత్తిడి చాలా తగ్గుతుంది. ఎందుకంటే వారు ఆటలో ఇప్పటికే ప్రత్యర్థి కంటే ముందుంటున్నారు. ఈరోజు వారు బౌలింగ్ చేసిన తీరు అద్భుతం అని ఇషాన్ కిషన్ పేర్కొన్నారు.
BALL OF THE MATCH – SAKIB 🥶 The Game Changer pic.twitter.com/zaCFaUbgJT
— Johns. (@CricCrazyJohns) April 18, 2026
వాస్తవానికి ఇది బ్యాటింగ్‌కు చాలా మంచి వికెట్. అందుకే మేము 30 నుంచి 40 పరుగులు తక్కువ చేశాం. సాధారణంగా మేము 220 లేదా 230 పరుగులు చేసినప్పుడల్లా టాప్-3 బ్యాటర్లలో ఎవరో ఒకరు భారీ స్కోరు సాధిస్తారు. ఈరోజు ఆ భారీ ఇన్నింగ్స్ మిస్ అయ్యాం. మాకున్న ఈ బ్యాటింగ్ లైనప్‌ను బట్టి మేం కచ్చితంగా ఒక 20-30 పరుగులు తక్కువ చేశాం.ఈ మ్యాచ్ నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. షాట్ సెలక్షన్ విషయంలో మేము ఇంకా మెరగవ్వాల్సి ఉంది. ఇది చాలా సుదీర్ఘ టోర్నీ.. ఒక్కో మ్యాచ్‌ను గెలుచుకుంటూ పోవడమే లక్ష్యంగా పెట్టుకున్నాం అని ఇషాన్ కిషన్ తెలిపాడు.
SUNRISERS HYDERABAD IS THE DEFENDING TEAM IN IPL 2026 🥶🔥 pic.twitter.com/XuTGIlrQ1q
— Johns. (@CricCrazyJohns) April 18, 2026
ఉత్కంఠ పోరులో హైదరాబాద్ విజయం..
చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన ఉత్కంఠ పోరులో సన్ రైజర్స్ హైదరాబాద్ గెలిచింది. 10 పరుగుల తేడాతో చెన్నైని చిత్తు చేసింది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లో విజయం హైదరాబాద్ నే వరించింది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 9 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ (59), క్లాసెన్ (59) హాఫ్ సెంచరీలతో మెరిశారు. 195 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన సీఎస్‌కే ఎనిమిది వికెట్ల నష్టానికి 184 పరుగులే చేసింది. హైదరాబాద్ బౌలర్లు మరోసారి సత్తాచాటారు. ప్రత్యర్థిని కట్టడి చేయగలిగారు. మలింగ మూడు వికెట్లతో మెరిశాడు. నితీశ్ రెండు వికెట్లు తీశాడు. ఈ సీజన్ లో హైదరాబాద్ కు ఇది బ్యాక్ టు బ్యాక్ విక్టరీ.
