LSG vs DC : ల‌క్నో వ‌ర్సెస్ ఢిల్లీ.. హెడ్‌-టు-హెడ్ రికార్డుల్లో ఎవ‌రిది పై చేయి?

బుధ‌వారం ల‌క్నోలోని ఎకానా స్టేడియంలో ఢిల్లీ క్యాపిట‌ల్స్‌, ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ (LSG vs DC ) పోటీప‌డ‌నున్నాయి.

IPL 2026 today LSG vs DC match here is head to head pitch report details

LSG vs DC : ఐపీఎల్ 2026లో మ‌రో ఆస‌క్తిక‌ర పోరుకు రంగం సిద్ధ‌మైంది. బుధ‌వారం ల‌క్నోలోని ఎకానా స్టేడియంలో ఢిల్లీ క్యాపిట‌ల్స్‌, ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ పోటీప‌డ‌నున్నాయి. ఈ సీజ‌న్‌లో ఇరు జ‌ట్ల‌కు ఇదే తొలి మ్యాచ్. ఈ క్ర‌మంలో ఈ మ్యాచ్‌లో విజ‌యం సాధించి.. గెలుపుతో టోర్నీని ఆరంభించాల‌ని ఇరు జ‌ట్లు భావిస్తున్నాయి.

గ‌త సీజ‌న్‌లో అంచ‌నాల‌ను అందుకోవ‌డంలో విఫ‌ల‌మైన ల‌క్నో కెప్టెన్ రిష‌బ్ పంత్ ఈ ఏడాది ఎలా ఆడ‌తాడోన‌ని అంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. గ‌త సీజ‌న్ ఆరంభం నుంచే ల‌క్నో పేస‌ర్ల గాయాల‌తో స‌త‌మ‌త‌మైంది. అయితే.. ఈ సారి ప‌రిస్థితి భిన్నంగా ఉంది. ష‌మీ, నోర్జే వంటి సీనియ‌ర్ల పేస‌ర్లకు తోడుగా యువ పేస‌ర్ మ‌యాంక్ యాద‌వ్ కూడా ఫిట్‌గా ఉన్నాడు.

LSG vs DC : 150 కిలోమీట‌ర్ల‌కు పైగా వేగం.. ఆ స్పీడ్ స్టార్ తొలి మ్యాచ్‌లో ఆడ‌తాడా? ల‌క్నో కోచ్ కీల‌క కామెంట్స్‌..

ఆస్ట్రేలియా స్టార్ బౌల‌ర్ మిచెల్ స్టార్క్ అందుబాటులో లేక‌పోయిన‌ప్ప‌టికి కూడా ఢిల్లీ క్యాపిట‌ల్స్ బ‌ల‌మైన పేస్ బౌలింగ్ విభాగాన్ని క‌లిగి ఉంది. లుంగి ఎంగిడి పేస్ విభాగానికి నాయ‌క‌త్వం వ‌హించ‌నున్నాడు. అక్ష‌ర్ ప‌టేల్, కుల్దీప్ యాద‌వ్ జోడీ స్పిన్ బాధ్య‌త‌ల‌ను పంచుకోనుంది.

హెడ్‌-టు-హెడ్ రికార్డులు..

ఐపీఎల్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌, ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్లు 7 సంద‌ర్భాల్లో ముఖాముఖిగా త‌ల‌పడ్డాయి. ఇందులో మూడు మ్యాచ్‌ల్లో ల‌క్నో విజ‌యం సాధించ‌గా ఢిల్లీ 4 మ్యాచ్‌ల్లో గెలిచింది.

పిచ్‌..

ఎకానా స్టేడియంలోని పిచ్ సాధార‌ణంగా స్పిన్న‌ర్ల‌కు కాస్త అనుకూలం. స్పిన్‌ను స‌మ‌ర్ధ‌వంతంగా ఆడే బ్యాట‌ర్లు భారీ స్కోర్లు సాధించ‌వ‌చ్చు. టాస్ గెలిచిన జ‌ట్టు బౌలింగ్ ఎంచుకోవ‌చ్చు.

తుది జ‌ట్ల అంచ‌నా..

లక్నో సూపర్ జెయింట్స్..
మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్రామ్, రిషబ్ పంత్ (కెప్టెన్), నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, దిగ్వేష్ రాఠీ, మహ్మద్ షమీ, మయాంక్ యాదవ్, అన్రిచ్ నార్త్జే.

Glenn Maxwell : గ్లెన్ మాక్స్‌వెల్‌కు భారీ షాక్ ఇచ్చిన క్రికెట్ ఆస్ట్రేలియా.. ఇక ఆసీస్ త‌రుపున మ‌ళ్లీ ఆడ‌న‌ట్లే!

ఢిల్లీ క్యాపిట‌ల్స్‌..
కేఎల్ రాహుల్ (వికెట్ కీప‌ర్), పృథ్వీ షా, పాతుమ్ నిస్సాంక, డేవిడ్ మిల్లర్, నితీష్ రాణా, అక్షర్ పటేల్ (కెప్టెన్), విప్రజ్ నిగమ్, ఔకిబ్ నబీ దార్, లుంగి ఎన్గిడి, దుష్మంత చమీరా, కుల్దీప్ యాదవ్