LSG vs DC : 150 కిలోమీటర్లకు పైగా వేగం.. ఆ స్పీడ్ స్టార్ తొలి మ్యాచ్‌లో ఆడతాడా? లక్నో కోచ్ కీలక కామెంట్స్..
బుధవారం లక్నోలోని ఎకానా స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్‌ల మధ్య మ్యాచ్ (LSG vs DC ) జరగనుంది.
IPL 2026 LSG coach major update on pacer Mayank Yadav ahead of LSG vs DC match (pic credit@IPL)
- బుధవారం లక్నో, ఢిల్లీల మధ్య మ్యాచ్
- మయాంక్ యాదవ్ పై లక్నో కోచ్ కీలక అప్డేట్
LSG vs DC : ఐపీఎల్ 2026 సీజన్లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. బుధవారం లక్నోలోని ఎకానా స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్‌ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఇరు జట్లకు ఈ సీజన్లో ఇదే తొలి మ్యాచ్. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలని ఇరు జట్లు కోరుకుంటున్నాయి.
ఇక అందరి దృష్టి లక్నో పేసర్ మయాంక్ యాదవ్ పైనే ఉంది. గాయం కారణంగా ఈ యువ పేసర్ చాన్నాళ్లుగా ఆటకు దూరంగా ఉన్నాడు. దీంతో ఐపీఎల్ 2026లో అతడు ఎలాంటి ప్రదర్శన చేస్తాడోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే.. అతడు పూర్తి ఫిట్‌గా ఉన్నాడా? తొలి మ్యాచ్‌లో ఆడతాడా? లేదా ? అనేది మాత్రం తెలియలేదు. తాజాగా దీనిపై లక్నో హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్ స్పందించాడు.
PBKS vs GT : అర్ష్‌దీప్ సింగ్ వచ్చి ఒక్కటే చెప్పాడు.. విజయం పై శ్రేయస్ అయ్యర్ హాట్ కామెంట్స్..
పేసర్లు మయాంక్ యాదవ్, నమన్ తివారీలు ఫిట్‌గా ఉన్నారని చెప్పుకొచ్చాడు. వాళ్లిదరు అద్భుతమైన ఆటగాళ్లు అని, వారికి ఉజ్వల మైన భవిష్యత్తు ఉందన్నాడు. ఇక వారిద్దరు తొలి మ్యాచ్‌లో ఆడేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. గతంలో ఎన్నడూ ఇలా లేదని.. ఈ ఇద్దరితో పాటు మోసిన్ ఖాన్, మహ్మద్ షమీ, ఆకాశ్ సింగ్ వంటి ప్రతిభావంతమైన పేసర్లు జట్టులో ఉన్నారన్నాడు.
అయితే.. అన్రిచ్ నోకియా సేవలను మిస్ అవుతున్నామని చెప్పుకొచ్చాడు. అర్జున్ టెండూల్కర్ రూపంలో యువ ఆల్ రౌండర్ ఉన్నాడని, వీరిలో ఎవరిని తుది జట్టులోకి తీసుకోవాలనే విషయంపై మ్యాచ్ ముందు నిర్ణయం తీసుకుంటామన్నాడు.
మయాంక్ యాదవ్ నిలకడగా గంటకు 150 కిలోమీటర్లు లేదా అంతకంటే ఎక్కువ వేగంగా బౌలింగ్ చేస్తుంటాడు. అంతేకాకుండా ఖచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్‌ను పాటిస్తూ ఉంటాడు. గాయాల కారణంగా అతడి కెరీర్ పెద్దగా ముందుకు సాగడం లేదు. రెండు సీజన్ల పాటు లక్నో తరుపున కేవలం 6 మ్యాచ్‌ల్లో మాత్రమే ఆడాడు. 20.55 సగటుతో 9 వికెట్లు తీశాడు. అతని అత్యుత్తమ గణాంకాలు 3/14. ఇక టీమ్ఇండియా తరఫున మూడు టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 20.75 సగటుతో నాలుగు వికెట్లు పడగొట్టాడు.
