IPL 2026 : ఎందుకు బ్రో అంతకోపం! బ్యాటును నేలకేసి కొట్టి.. హెల్మెట్ విసిరేసి.. స్టార్ బ్యాటర్ రచ్చరచ్చ.. వీడియో వైరల్..
IPL 2026 : ట్రిస్టన్ స్టబ్స్ అంపైర్లతో వాగ్వాదానికి దిగడమే కాకుండా డ్రెసింగ్ రూంకు వెళ్లే క్రమంలో డ్రెస్సింగ్ రూం వద్ద బ్యాటును నేలకేసి కొట్టాడు.. ఆ తరువాత డ్రెస్సింగ్ రూమ్‌లోకి అడుగుపెట్టగానే హెల్మెంట్‌ను కోపంతో విసిరేశాడు.
- Harish Thanniru
- Updated on- April 12, 2026 / 08:19 AM IST
Tristan Stubbs
- ఢిల్లీ వర్సెస్ చెన్నై మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన
- అంపైర్ల నిర్ణయంపై ఢిల్లీ స్టార్ బ్యాటర్ అసహనం
- ఆగ్రహంతో బ్యాట్‌ను నేలకేసి, హెల్మెంట్ విసిరేసిన వైనం
IPL 2026 : ఐపీఎల్ -2026లో భాగంగా శనివారం చెన్నై సూపర్ కింగ్స్ (CSK) వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ (DC) జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే జట్టు విజయం సాధించింది. వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయిన సీఎస్‌కే జట్టు ఎట్టకేలకు ఈ సీజన్లో తొలి విజయాన్ని నమోదు చేసింది. అయితే, సంజూ శాంసన్ అద్భుత సెంచరీతో ఆ జట్టు విజయంలో కీలక భూమిక పోషించాడు. ఈ మ్యాచ్‌లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ బ్యాటర్ తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read : Sanju Samson : 18ఏళ్లుగా ధోనీకి సాధ్యం కాలేదు.. కానీ, చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్.. నువ్వు తోపు గురూ..
శనివారం రాత్రి చెపాక్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే జట్టు బ్యాటర్లు అద్భుత బ్యాటింగ్ చేశారు. దీంతో నిర్ణీత 20ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 212 పరుగులు చేశారు. ఇందులో సంజూ శాంసన్ 115 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. భారీ పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్ జట్టు 20ఓవర్లలో 189 పరుగులకు ఆలౌట్ అయింది. అయితే, ఈ మ్యాచ్ ఢిల్లీ స్టార్ బ్యాటర్ ట్రిస్టన్ స్టబ్స్ స్టేడియంలోనే తన అసహనాన్ని వ్యక్తం చేశాడు.
అంపైర్లతో స్టబ్స్ వాగ్వాదంకు దిగాడు. చెన్నైలోని విపరీతమైన ఉక్కపోత, తేమ కారణంగా తన గ్లోవ్స్ తడిసిపోయాయని.. వాటిని మార్చుకుంటానని స్టబ్స్ కోరగా.. ఆన్‌ఫీల్డ్ అంపైర్లు నిరాకరించారు. మ్యాచ్ కీలక దశలో ఉండగా.. ఓవర్ మధ్యలో గ్లోవ్స్ మార్చడం వల్ల సమయం వృథా అవుతుందని అంపైర్లు పేర్కొన్నారు. ఈ నిర్ణయం స్టబ్స్‌కు ఏమాత్రం నచ్చలేదు. అప్పటికే స్టబ్స్ మంచి ఫామ్‌తో బ్యాటింగ్‌లో అదరగొడుతున్నాడు. అంపైర్ల నిర్ణయంతో అతను అసహనం వ్యక్తం చేశాడు. ఈ అంతరాయం వల్ల అతను బ్యాటింగ్ ఫామ్ కోల్పోయాడు. ఆ తరువాత కొద్దిసేపటికే 60 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద స్టబ్స్ఔటయ్యాడు. ఓవర్‌లో ట్రిస్టన్ స్టబ్స్‌ను గ్లౌజులు మార్చుకోనివ్వకపోవడంతో డిసి కోచ్ హేమాంగ్ బదానీ, నితీష్ రాణా అంపైర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ట్రిస్టన్ స్టబ్స్ అంపైర్లతో వాగ్వాదానికి దిగడమే కాకుండా డ్రెసింగ్ రూంకు వెళ్లే క్రమంలో డ్రెస్సింగ్ రూం వద్ద బ్యాటును నేలకేసి కొట్టాడు.. ఆ తరువాత డ్రెస్సింగ్ రూమ్‌లోకి అడుగుపెట్టగానే హెల్మెంట్‌ను కోపంతో విసిరేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వాస్తవానికి ఐపీఎల్ నిబంధనల ప్రకారం.. ఓవర్ల మధ్యలో పరికరాలు మార్చుకోవడం వల్ల బౌలర్ వేగానికి అడ్డు కలుగుతుందని అంపైర్లు భావిస్తారు. అందుకే స్టబ్స్ విన్నపాన్ని వారు తోపిపుచ్చారు.
స్టబ్స్ అసహనంతో బ్యాట్ ను నేలకేసి కొట్టడం, హెల్మెంట్ విసిరేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో కొందరు నెటిజన్లు ఎందుకు బ్రో అంత కోపం.. గేమ్‌లో ఇలాంటివి సర్వసాధారణం అంటూ పేర్కొంటున్నారు.
