Vaibhav Sooryavanshi Awards : ఐపీఎల్లో ఒకే ఒక్కడు వైభవ్ సూర్యవంశీ.. బుడ్డోడి పేరిట అవార్డులు రికార్డులు ఎన్నంటే..

Vaibhav Sooryavanshi Awards : ఈ ఐపీఎల్ సీజన్ కే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు వైభవ్ సూర్యవంశీ. మరి తాను ఈ సీజన్ లో సాధించిన అవార్డులు ఎన్నంటే..

Vaibhav Sooryavanshi Ipl 2026 Awards List Orange Cap Mvp And Multiple Records

  • ఐపీఎల్ లో సూర్యవంశీ రికార్డుల వేట
  • ఆరెంజ్ క్యాప్, ఎంవీపీ సహా పలు అవార్డులు
  • ఈ సీజన్ కే ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన వైభవ్

Vaibhav Sooryavanshi Awards : ఐపీఎల్ 2026 సీజన్ ముగిసింది. వరుసగా రెండోసారి ఆర్సీబీ టైటిల్ గెలిచింది. అయితే ఈ ఐపీఎల్ సీజన్‌లో పెను సంచలనం సృష్టించింది మాత్రం 15 ఏళ్ల యువ క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ. అద్భుతమైన బ్యాటింగ్ తో అభిమానుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. ఫైనల్ మ్యాచ్ ముందు వరకు ఎక్కడ చూసినా సూర్యవంశీ గురించే చర్చ. ఒక్కసారి క్రీజులోకి దిగాడా.. ఇక మరి దేని గురించి ఆలోచించకుండా బ్యాట్‌ను ఝళిపిస్తాడు. ఆర్సీబీ టైటిల్ గెలిచినా.. ఈ సీజన్‌కే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది మాత్రం వైభవ్ సూర్యవంశీనే. అలానే తన వ్యక్తిగత ప్రదర్శనతో ఈ ఐపీఎల్లో ఎన్నో రికార్డులను తన పేరుపై లిఖించుకున్నాడు.

ఈ ఐపీఎల్ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగిన వైభవ్ సూర్యవంశీ.. ప్రత్యర్థి జట్ల బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 15 ఏళ్ల ఈ యువకెరటం.. అంతర్జాతీయ స్థాయి స్టార్ బౌలర్లను సైతం ఎంతో ధైర్యంగా ఎదుర్కొంటూ తన స్టైల్ భారీ షాట్లతో అలరించాడు. మొత్తం 16 ఇన్నింగ్స్‌ల్లో 776 పరుగులు సాధించి ఈ ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచి ప్రతిష్టాత్మక ఆరెంజ్ క్యాప్‌ను దక్కించుకున్నాడు.

*ఫైనల్లో గెలిచిన ఆర్సీబీ.. అభిమానులకు మాత్రం బ్యాడ్ న్యూస్.. అదే కారణమా..!

ఇదిలా ఉంటే వైభవ్ సూర్యవంశీ అద్భుత బ్యాటింగ్ ప్రదర్శనల కారణంగా ఈ సీజన్‌లో ఆర్ఆర్ క్వాలిఫయర్-2 వరకు చేరుకుంది అన్నది సత్యం. చివరకు గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడిపోవడంతో.. ఫైనల్‌కు చేరలేకపోయింది. కానీ జట్టు విజయయాత్రలో వైభవ్ కీలక పాత్ర పోషించాడు అన్నది ప్రతి ఒక్కరూ అంగీకరించే సత్యం. గత సీజన్‌లో పాయింట్ల పట్టికలో చివరి స్థానాల్లో నిలిచిన రాజస్థాన్, ఈసారి బలమైన పోటీదారుగా మారడానికి ముఖ్య కారణం వైభవ్ బ్యాటింగ్ అనడంలో అతిశయోక్తి లేదు.

రికార్డుల వేట.. అవార్డుల పంట

ఈ ఐపీఎల్ సీజన్‌లో అద్భుతమైన బ్యాటింగ్‌తో వైభవ్ సూర్యవంశీ అనేక రికార్డులను తన పేరిట నమోదు చేసుకున్నాడు. ఈ ఐపీఎల్ చరిత్రలో వేగవంతమైన సెంచరీ రికార్డుకు అత్యంత చేరువగా వెళ్లిన ఆటగాడిగా సూర్యవంశీ నిలిచాడు. క్రిస్ గేల్ 30 బంతుల్లో చేసిన సెంచరీ రికార్డును బద్దలు కొట్టే దశ వరకు వెళ్లినా.. చివరికి స్వల్ప తేడాతో ఆ రికార్డును చేరుకోలేకపోయాడు.

ఇదిలా ఉంటే ఈ ఐపీఎల్ 2026 సీజన్‌లో వైభవ్ సూర్యవంశీ గెలుచుకున్న అవార్డుల విషయానికి వస్తే:

  • ఆరెంజ్ క్యాప్ – రూ. 10 లక్షలు
  • మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ (MVP) – రూ. 15 లక్షలు
  • సూపర్ సిక్సెస్ ఆఫ్ ది సీజన్ – రూ. 10 లక్షలు
  • ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ – రూ. 10 లక్షలు
  • సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్

ఒక్క ఐపీఎల్ సీజన్‌లోనే ఇన్ని వ్యక్తిగత అవార్డులు అందుకుని మరోసారి తన ప్రతిభను నిరూపించుకున్నాడు సూర్యవంశీ. ఆర్సీబీ వర్సెస్ జీటీ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌ను చూడటం కోసం వైభవ్ సూర్యవంశీ స్టేడియానికి హాజరయ్యాడు. ఈ సందర్భంగా అతడు బీసీసీఐ కార్యదర్శి జై షా పక్కన కూర్చుని మ్యాచ్ చూశాడు. సీజన్ మొత్తంలో తాను గెలుచుకున్న అవార్డులను అందుకోవడానికి అతడు ఫైనల్ ప్రెజెంటేషన్ వేడుకల్లో పాల్గొన్నాడు.