Vaibhav Suryavanshi : వైభవ్ సూర్యవంశీ సరికొత్త రికార్డు.. తొలి భారతీయుడిగా గుర్తింపు.. టార్గెట్ గేల్
Vaibhav Suryavanshi : ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ యువ బ్యాటర్ వైభవ్ సూర్య వంశీ 21 బంతుల్లో 46 పరుగులు చేశాడు. ఈ క్రమంలో సరికొత్త రికార్డును నమోదు చేశాడు.
- Harish Thanniru
- Updated on- May 18, 2026 / 07:39 AM IST
Vaibhav Suryavanshi
- రాజస్థాన్ జట్టుపై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం
- సరికొత్త రికార్డు నమోదు చేసిన వైభవ్ సూర్యవంశీ
- అభిషేక్ శర్మ రికార్డు బ్రేక్..
- తొలి భారతీయుడిగా గుర్తింపు
Vaibhav Suryavanshi : ఐపీఎల్ 2026 టోర్నీలో భాగంగా ఆదివారం రాత్రి రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి 193 పరుగులు చేసింది. ఆ తరువాత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 19.2 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 197 పరుగులు చేసి ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే, ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ సరికొత్త రికార్డు నమోదు చేశాడు.
Also Read : Hardik Pandya : రెండో పెళ్లి చేసుకోబోతున్న హార్దిక్ పాండ్యా? మే 22న ?
ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ యువ బ్యాటర్ వైభవ్ సూర్య వంశీ 21 బంతుల్లో 46 పరుగులు చేశాడు. ఇందులో ఐదు ఫోర్లు, మూడు సిక్సులు ఉన్నాయి. 15ఏళ్ల వైభవ్ తనదైన శైలిలో ఢిల్లీ బౌలర్లను ఉతికారేశాడు. ప్రపంచ స్థాయి బౌలర్ మిచెల్ స్టార్క్ ను సైతం సూర్యవంశీ విడిచిపెట్టలేదు. స్టార్క్ బౌలింగ్ లో వరుసగా బౌండరీలు బాదాడు. ఈ క్రమంలో సూర్యవంశీ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఒకే ఐపీఎల్ సీజన్లో అత్యధిక సిక్సర్లు బాదిన భారతీయ బ్యాటర్ గా సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు.
వైభవ సూర్యవంశీ ఈ ఏడాది సీజన్లో ఇప్పటి వరకు 12 మ్యాచ్ లు ఆడి 486 పరుగులు చేశాడు. ఈ క్రమంలో ఇప్పటి వరకు 44 సిక్స్ లు బాదాడు. ఇంతకుముందు ఈ రికార్డు అభిషేక్ శర్మ పేరిట ఉండేది. ఐపీఎల్ -2024లో అభిషేక్ శర్మ 42 సిక్సర్లు బాదాడు. తాజాగా ఐపీల్ -2026లో అభిషేక్ రికార్డును వైభవ్ సూర్యవంశీ బ్రేక్ చేశాడు. దీంతో ఒకే ఐపీఎల్ సీజన్లో అత్యధిక సిక్సర్లు బాధిన భారతీయ బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు.
ఓవరాల్‌గా చూసుకుంటే ఐపీఎల్ ఒకే సీజన్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్లలో క్రిస్ గేల్ తొలి స్థానంలో ఉన్నాడు. గేల్ ఒకే సీజన్లో 59 సిక్సర్లు బాదాడు. అయితే, ఈ ఐపీఎల్ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు లీగ్ దశలో మరో రెండు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ఈ రెండు మ్యాచ్‌లలో సూర్యవంశీ గేల్ రికార్డును బద్దలు కొడతాడా లేదా అనేది వేచి చూడాల్సిందే. ఒకవేళ రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్స్‌కు చేరుకుంటే మరికొన్ని మ్యాచ్‌లు ఆడే అవకాశం సూర్యవంశీకి లభిస్తుంది. దీంతో గేల్ రికార్డును బ్రేక్ చేసే అవకాశం మరింత ఈజీ అవుతుంది.
ఒకే ఐపీఎల్ సీజన్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత ప్లేయర్లు వీరే:
♦ వైభవ్ సూర్యవంశీ : 44 సిక్సర్లు (2026)
♦ అభిషేక్ శర్మ : 42 సిక్సర్లు (2024)
♦ శ్రేయస్ అయ్యర్ : 39 సిక్సర్లు (2025)
♦ విరాట్ కోహ్లి : 38 సిక్సర్లు (2016 & 2024)
♦ సూర్యకుమార్ యాదవ్ : 38 సిక్సర్లు (2025)
🚨 HISTORY BY VAIBHAV SOORYAVANSHI 🚨
– 15 year old Vaibhav Suryavanshi has most sixes by an Indian in single IPL season. 👑🇮🇳 pic.twitter.com/TTXf4DVZ9P
— Johns. (@CricCrazyJohns) May 17, 2026
