IPL 2026 RR vs LSG: వైభవ్ సూర్యవంశీ ఊచకోత.. హడలెత్తిపోయిన లక్నో బౌలర్లు.. రాజస్థాన్ సూపర్ విక్టరీ..
RR vs LSG : ఐపీఎల్ 2026లో భాగంగా మంగళవారం రాత్రి లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈమ్యాచ్ లో వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర బ్యాటింగ్ తో ఆర్ఆర్ జట్టు ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
- Harish Thanniru
- Updated on- May 20, 2026 / 11:16 AM IST
IPL 2026 RR vs LSG Vaibhav Suryavanshi Super Innings
RR vs LSG : ఐపీఎల్ 2026లో భాగంగా మంగళవారం రాత్రి లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో రాజస్థాన్ ఆటగాళ్లు రెచ్చిపోయారు. ముఖ్యంగా ఆ జట్టు ఓపెనింగ్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ లక్నో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. క్రీజులో ఉన్నంత సేపు ఫోర్లు, సిక్సర్లతో విధ్వంసం సృష్టించాడు. ఫలితంగా రాజస్థాన్ రాయల్స్ జట్టు ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
Also Read : Ethanol Petrol : కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. భారత్‌లో ఇక E30 పెట్రోల్‌కు మార్గం సుగమం..
తొలుత లక్నో సూపర్ జెయింట్స్ జట్టు బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 220 పరుగులు చేసింది. ఆ జట్టు బ్యాటర్లలో మిచెల్ మార్ష్ (96), జోష్ ఇంగ్లీస్ (60), రిషబ్ పంత్ (35) రాణించారు. భారీ పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన రాజస్థాన్ రాలయ్స్ జట్టు 19.1 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి 225 పరుగులు చేసింది. దీంతో ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆర్ఆర్ జట్టులో వైభవ్ సూర్యవంశీ (38బంతుల్లో 93) సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. ధ్రువ్ జురెల్ (53 నాటౌట్), యశస్వీ జైస్వాల్ (43) రాణించడంతో రాజస్థాన్ జట్టు సూపర్ విక్టరీ నమోదు చేసింది.
లక్నో జట్టుపై విజయం తరువాత రాజస్థాన్ రాయల్స్ జట్టు పాయింట్ల పట్టికలో నాల్గో స్థానానికి చేరుకుంది. ఆ జట్టుకు ఇంకో మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. మే 24న ముంబయితో తలపడనుంది. ఈ మ్యాచ్ లోనూ గెలిస్తే నేరుగా ప్లే ఆఫ్స్ కు క్వాలిఫై అవుతుంది.
RAJASTHAN ROYALS IS PEAKING IN IPL 2026. 🥶🔥
– They chase down 221 runs in the must win match. pic.twitter.com/wmaOtycgSB
— Johns. (@CricCrazyJohns) May 19, 2026
