Uppal Stadium : నేడు ఉప్పల్‌ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌.. టికెట్లు ఉన్నవారు ఇలా చేయండి.. పోలీసుల కీలక సూచనలు..మెట్రో సేవలు పొడిగింపు

Uppal Stadium : ఈ ఐపీఎల్ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు శుక్రవారం ఉప్పల్ స్టేడియంలో చివరి మ్యాచ్ కావడంతో అభిమానులు ఎలాగైనా చూడాలంటూ టికెట్ల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. పైగా విరాట్ కోహ్లీ ఆడుతున్న బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు కూడా కావడంతో భారీ మొత్తంలో చెల్లించి టికెట్లు దక్కించుకునేందుకు క్రికెట్ ప్రియులు ప్రయత్నాలు చేస్తున్నారు.

Uppal Stadium

  • నేడు ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్
  • రాత్రి 7,.30గంటలకు మ్యాచ్ ప్రారంభం
  • టికెట్ ఉన్న వారినిక కీలక సూచనలు చేసిన పోలీసులు

Uppal Stadium : ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ సందర్భంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా మల్కాజిగిరి పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉప్పల్ వైపు వచ్చే భారీ వాహనాలను దారి మళ్లిస్తున్నట్లు తెలిపారు.

Also Read : Chennai Super Kings : ఐపీఎల్ నుంచి ఔట్‌.. సీఎస్‌కే కెప్టెన్ రుతురాజ్‌తో పాటు ఆ జ‌ట్టు ఆట‌గాళ్ల‌కు భారీ జ‌రిమానా..

ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ సందర్భంగా ఉప్పల్ స్టేడియం, చుట్టుపక్కల ప్రాంతాల్లో మధ్యాహ్నం 12గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ట్రాఫిక్ దారి మళ్లింపులు ఉంటాయని పోలీసులు తెలిపారు. ముఖ్యంగా ఉప్పల్ – హబ్సిగూడ, బోడుప్పల్ నుంచి ఉప్పల్, అంబర్ పేట్ వైపు వెళ్లే రోడ్లలో ట్రాఫిక్ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. దీంతో ప్రత్యామ్నాయంగా మార్గాలను ఎంచుకోవాలని సూచించారు.

IPL మ్యాచ్ వీక్షించేందుకు వచ్చే ప్రేక్షకులు గంట ముందే స్టేడియానికి చేరుకొని, కేటాయించిన సీట్లలోనే కూర్చోవాలని పోలీసులు సూచించారు. జొమాటో, డిస్ట్రిక్ట్ యాప్‌ లలో గేటు మ్యాప్ సదుపాయం
ఉందని, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి గేటును సులభంగా చేరుకోవచ్చునని తెలిపారు. సైన్ బోర్డులను తప్పనిసరిగా ఫాలో కావాలని, అత్యవసర సమయాల్లో ఎమర్జెన్సీ ఎగ్జిట్ మ్యాప్ చూడాలని, ఎమర్జెన్సీలో డయల్ 100కు కాల్ చేయాలని పోలీసులు సూచించారు.

టికెట్లకు భారీ డిమాండ్..
ఈ ఐపీఎల్ సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ కు శుక్రవారం ఉప్పల్ స్టేడియంలో చివరి మ్యాచ్ కావడంతో అభిమానులు ఎలాగైనా చూడాలంటూ టికెట్ల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. పైగా విరాట్ కోహ్లీ ఆడుతున్న బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు కూడా కావడంతో భారీ మొత్తంలో చెల్లించి టికెట్లు దక్కించుకునేందుకు క్రికెట్ ప్రియులు ప్రయత్నాలు చేస్తున్నారు. జొమాటో, డిస్ట్రిక్ట్ యాప్ లలో విడుదల చేసిన కొన్ని నిమిషాల్లోనే సోల్డ్ ఔట్ కనిపించినా.. చాలా మంది అభిమానులు ఇంకా పట్టువీడటం లేదు. ఎలాగైనా టికెట్లు దక్కించుకొని.. ఎస్ఆర్ హెచ్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ కు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. దీంతో టికెట్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. అయితే, బ్లాక్ టికెట్లపై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. బ్లాక్ టికెట్లపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

మెట్రో వేళలలు పొడగింపు..
ఉప్పల్ స్టేడియంలో ఎస్ఆర్‌హెచ్ వర్సెస్ ఆర్సీబీ జట్ల మధ్య మ్యాచ్ శుక్రవారం రాత్రి 7.30గంటలకు ప్రారంభమవుతుంది. మ్యాచ్ పూర్తయ్యే వరకు రాత్రి 11.30గంటల అయ్యే అవకాశం ఉంది. దీంతో మ్యాచ్ ను చూసేందుకు వచ్చిన ప్రేక్షకులకు ప్రయాణం ఇబ్బందులు తలెత్తకుండా మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది. అర్ధరాత్రి 12గంటల వరకు మెట్రో సర్వీసులు పొడిగించింది.