IPL Points Table : ఒక్కొ మ్యాచ్ ఆడిన అన్ని జట్లు.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్నది ఎవరంటే?
ఐపీఎల్ 2026 సీజన్‌లో అన్ని జట్లు ఒక్కొ మ్యాచ్‌ను పూర్తి చేసుకున్నాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో(IPL Points Table ) అగ్రస్థానంలో ఆర్ఆర్ ఉంది.
- Thota Vamshi Kumar
- Published On : April 2, 2026 / 09:17 AM IST
IPL Points Table 2026 After 10 teams complete thier first matches
IPL Points Table : మార్చి 28 నుంచి ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభమైంది. మ్యాచ్‌లు ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఇప్పటి వరకు 5 మ్యాచ్‌లు పూర్తి అయ్యాయి. మొత్తం 10 జట్లు తలా ఓ మ్యాచ్‌ను పూర్తి చేసుకున్నాయి. ఐదు జట్లు.. రాజస్థాన్, బెంగళూరు, ఢిల్లీ, ముంబై, పంజాబ్‌లు విజయంతో టోర్నీని ప్రారంభించగా మిగిలిన ఐదు జట్లు.. గుజరాత్, కోల్‌కతా, లక్నో, హైదరాబాద్, చెన్నైలు ఓటమితో టోర్నీని మొదలుపెట్టాయి.
గెలిచిన ఐదు జట్లకు తలా రెండు పాయింట్లు వచ్చాయి. అయినప్పటికి కూడా నెట్‌రన్‌రేటులో తేడాల వల్ల పాయింట్ల పట్టికలో స్థానాల్లో తేడాలు వచ్చాయి. చెన్నై సూపర్ కింగ్స్ పై భారీ విజయాన్ని సాధించిన రాజస్థాన్ రాయల్స్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ఆర్ఆర్ నెట్‌రన్‌రేటు +4.171గా ఉంది.
ఇక రెండో స్థానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉంది. ఆర్‌సీబీ నెట్‌రన్‌రేటు +2.907గా ఉంది. +1.397 నెట్‌రన్‌రేటుతో ఢిల్లీ క్యాపిటల్స్ మూడో స్థానంలో నిలిచింది. నాలుగో స్థానంలో ఉన్న ముంబై ఇండియన్స్ నెట్‌రన్‌రేటు +0.687గా ఉంది. ఐదో స్థానంలో పంజాబ్ కింగ్స్ ఉంది. పంజాబ్ నెట్‌రన్‌రేటు +0.509గా ఉంది.
ఇక ఆ తరువాత వరుసగా గుజరాత్ టైటాన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్‌లు ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది, పది స్థానాల్లో నిలిచాయి.
Sanjiv Goenka : ఈయన మారడు.. మ్యాచ్ ఓడిపోగానే లక్నో యజమాని సంజీవ్ గొయెంకా ఏం చేశాడో చూశారా?
లీగ్ దశలో అన్ని జట్లు ఇంకో 13 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. లీగ్ దశ పూరైన తరువాత పాయింట్ల పట్టికలో టాప్-2లో నిలిచిన జట్ల మధ్య క్వాలిఫయర్-1 మ్యాచ్ జరుగుతుంది. ఇందులో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌లో అడుగుపెడుతుంది. ఇక మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు ఎలిమినేటర్ మ్యాచ్ ఆడతాయి. ఇందులో ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్ర్కమిస్తుంది. ఎలిమినేటర్‌లో విజయం సాధించిన జట్టు క్వాలిఫయర్-1లో ఓడిపోయిన జట్టుతో క్వాలిఫయర్-2లో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు క్వాలిఫయర్-1 విజేతతో ఫైనల్ మ్యాచ్ ఆడుతుంది.
