IPL 2022: రాబోయే సీజన్‌కు పది జట్లు కన్ఫామ్!!

రాబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 10జట్లతో ముస్తాబు కానుంది. అంటే మరికొద్ది రోజుల్లో జరగబోయే ఐపీఎల్ 2021 సెకండాఫ్ లో కాదు.

Ipl 2022

IPL 2022: రాబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 10జట్లతో ముస్తాబు కానుంది. అంటే మరికొద్ది రోజుల్లో జరగబోయే ఐపీఎల్ 2021 సెకండాఫ్ లో కాదు. 2022 సీజన్ కు.. మొత్తం పది జట్లు ఆడేందుకు బీసీసీఐ ప్లాన్ చేస్తుంది. ఈ క్రమంలోనే కొత్త ఫ్రాంచైజీలను టెండ‌ర్లు ఆహ్వానించింది. 2022 ఐపీఎల్ సీజ‌న్‌లో పాల్గొన‌బోయే రెండు కొత్త టీమ్స్‌లో ఒక‌దాని కోసం ఐపీఎల్ గ‌వ‌ర్నింగ్ కౌన్సిల్ బిడ్ల‌ను ఆహ్వానించింద‌ని మంగ‌ళ‌వారం ఒక ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది.

టెండ‌ర్ డాక్యుమెంట్లు అక్టోబ‌ర్ 5వ‌ర‌కూ అమ్మ‌కానికి ఉంటాయని చెప్పింది. ఈ ఇన్విటేష‌న్ టూ టెండ‌ర్ డాక్యుమెంట్‌ను రూ.10 ల‌క్ష‌లుగా నిర్ణ‌యించింది. ఇదంతా నాన్-రీఫండ‌బుల్ అన్నమాట. ఈ డాక్యుమెంట్‌లోనే రూల్స్, రెగ్యూలేషన్స్, క్వాలిఫికేషన్, బిడ్‌కు అప్లైయింగ్ ప్రోసెస్, కొత్త టీమ్‌ల హ‌క్కుల వివ‌రాల‌న్నీ అందులో సవివరంగా ఉంటాయని బీసీసీఐ చెప్పింది.

బిడ్ దాఖ‌లు చేయాల‌నుకుంటున్న వాళ్లు టెండ‌ర్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అందులోని క్వాలిఫికేషన్ స్టాండర్డ్స్ అందుకున్న వారికే బిడ్ దాఖ‌లు అప్లై చేసే ఛాన్స్ ఉంటుంది. టెండర్ కొనుగోలు చేసిన ప్ర‌తి ఒక్క‌రూ బిడ్ దాఖ‌లు చేయ‌లేసే అవకాశం లేదని స్ప‌ష్టం చేసింది.

కొత్త టీమ్స్ ఏమై ఉండొచ్చని కొన్ని నెలలుగా చర్చలు జరుగుతున్నాయి. రెండు టీమ్స్‌లో ఒక‌టి అహ్మ‌దాబాద్‌కు చెందిన ఫ్రాంచైజీ అయి ఉండొచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒక్కోదానికి క‌నీస ధ‌ర‌ను రూ.2వేల కోట్లుగా నిర్ణ‌యించ‌గా.. రెండు టీమ్స్ ద్వారా బీసీసీఐ మ‌రో రూ.5 వేల కోట్లు చేరుతాయని భావిస్తుంది.