IPL2022 CSK VS MI : ధోనీ.. వాటే ఫినిష్.. ఉత్కంఠపోరులో చెన్నై విజయం.. ముంబైకి వరుసగా 7వ పరాజయం
వరుసగా 7వ మ్యాచులోనూ పరాజయం పాలైంది. చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్ లో ముంబై ఓటమి చవి చూసింది.
- Naveen
- Updated on- April 22, 2022 / 12:14 AM IST
Ipl2022 Csk Vs Mi (1)
IPL2022 CSK VS MI : ఐపీఎల్ 2022 సీజన్ 15లో ముంబై ఇండియన్స్ రాత మారలేదు. వరుస పరాజయాలు వెంటాడుతున్నాయి. ఈ సీజన్ లో ముంబై ఇంతవరకు బోణీ కొట్టలేదు. వరుసగా 7వ మ్యాచులోనూ పరాజయం పాలైంది. గురువారం చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్ లో ముంబై ఓటమి చవి చూసింది. ముంబయి నిర్దేశించిన 156 పరుగుల టార్గెట్ ని.. చెన్నై 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆఖరి ఓవర్లో 17 పరుగులు చేయాల్సి ఉండగా.. ఎంఎస్ ధోనీ (28*) ఫినిషర్‌గా బౌండరీల మోత మోగించాడు. దీంతో చివరి బంతికి సీఎస్కే విజయం సాధించింది. మూడు వికెట్ల తేడాతో ముంబైపై విక్టరీ కొట్టింది.
ముంబైతో మ్యాచ్‌లో ఎంఎస్ ధోనీ మరోసారి ‘ఫినిషర్’ అవతారమెత్తాడు. ధోనీ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. 13 బంతుల్లో 28* పరుగులు చేశాడు. అతడి స్కోర్ లో ఒక సిక్స్, 3 ఫోర్లు ఉన్నాయి. రోహిత్ సేన నిర్దేశించిన 156 పరుగుల లక్ష్యాన్ని చెన్నై సరిగ్గా 20 ఓవర్లలో ఏడు వికెట్లను కోల్పోయి ఛేదించింది. చివరి ఓవర్లో 17 పరుగులు కొట్టాల్సిన తరుణంలో ధోనీ ఒక సిక్స్, రెండు ఫోర్లు బాది చెన్నైకి విజయాన్ని అందించాడు.
Virat Kohli : ఐపీఎల్ చరిత్రలో కోహ్లీ ఖాతాలో ఇదే చెత్త రికార్డు..
చెన్నై బ్యాటర్లలో అంబటి రాయుడు (40), రాబిన్ ఉతప్ప (30), ప్రిటోరియస్ (22) రాణించారు. ముంబై బౌలర్లలో డానియల్ సామ్స్ 4 వికెట్లు పడగొట్టాడు. జయ్‌దేవ్ ఉనద్కత్ రెండు వికెట్లు తీశాడు. మెరెడిత్ ఒక వికెట్ తీశాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 155 పరుగులే చేసింది. ప్రస్తుత టీ20 లీగ్‌లో బోణీ కొట్టాలని చూసిన ముంబైకి మళ్లీ నిరాశే ఎదురైంది. టోర్నీలో ముంబయికిది వరుసగా ఏడో ఓటమి కాగా, చెన్నైకిది రెండో విజయం. చెన్నైతో జరిగిన డూ ఆర్ డై మ్యాచ్‌లోనూ రోహిత్ సేన ఓటమి చెందడంతో ఈ సీజన్లో ముంబయి కథ ఇక ముగిసినట్టే.(IPL2022 CSK VS MI)
తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ముంబై బ్యాటర్లలో తిలక్ వర్మ హాఫ్ సెంచరీతో రాణించాడు. తిలక్ వర్మ 43 బంతుల్లో 51 పరుగులు చేశాడు. అతడి స్కోర్ లో 3 ఫోర్లు, రెండు సిక్సులు ఉన్నాయి. చెన్నై బౌలర్లలో ముకేశ్ చౌదరి మూడు వికెట్లు పడగొట్టాడు. డ్వేన్ బ్రావో రెండు వికెట్లు తీశాడు. మిచెల్ సాంట్నర్, మహీశా తీక్షణ చెరో వికెట్ తీశారు.
IPL 2022 David Warner : ఒకే ప్రత్యర్థి జట్టుపై వెయ్యి పరుగులు.. డేవిడ్ వార్నర్ అరుదైన రికార్డ్
తొలి ఓవర్లోనే ముంబైకి భారీ షాక్ తగిలింది. చెన్నై పేసర్ ముకేశ్ చౌదరి చెలరేగడంతో ఓపెనర్లు రోహిత్ శర్మ (0) ఇషాన్ కిషన్ (0) డకౌట్‌గా వెనుదిరిగారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (32), తిలక్ వర్మ (51), హృతిక్ షోకీన్ (25) ఓ మోస్తరుగా రాణించారు. చివరలో జయదేవ్ ఉనాద్కత్ (19) బ్యాటు ఝుళిపించడంతో ముంబై 20 ఓవర్లలో 155 పరుగులు చేసింది.
ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు.. గత సీజన్ వరకు టాప్ జట్లు. ఈసారి మాత్రం దారుణమైన పరిస్థితి ఆ జట్లది. విజయాల కోసం వెంపర్లాడాల్సిన దుస్థితి. టీ20 లీగ్ చరిత్రలోనే అత్యధిక సార్లు టైటిళ్లను గెలుచుకున్న జట్లుగా రికార్డు సృష్టించిన ముంబై (5సార్లు), చెన్నై (4) ప్రస్తుతం సీజన్ పాయింట్ల పట్టికలో చివరి స్థానాల్లో ఉన్నాయి. ఇరు జట్లూ ఏడేసి మ్యాచ్‌లు ఆడగా.. చెన్నై రెండు విజయాలు నమోదు చేసింది. ముంబయి మాత్రం ఇంకా బోణీనే కొట్టలేదు.
