IPL 2022 David Warner : ఒకే ప్రత్యర్థి జట్టుపై వెయ్యి పరుగులు.. డేవిడ్ వార్నర్ అరుదైన రికార్డ్

ఐపీఎల్ 2022 సీజ‌న్‌ 15లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆటగాడు డేవిడ్‌ వార్నర్‌ అరుదైన రికార్డు సృష్టించాడు. ఒకే ప్రత్యర్థి జట్టుపై..

IPL 2022 David Warner : ఒకే ప్రత్యర్థి జట్టుపై వెయ్యి పరుగులు.. డేవిడ్ వార్నర్ అరుదైన రికార్డ్

Ipl 2022 David Warner

IPL 2022 David Warner : ఐపీఎల్ 2022 సీజ‌న్‌ 15లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆటగాడు డేవిడ్‌ వార్నర్‌ అరుదైన రికార్డు సృష్టించాడు. ఒకే ప్రత్యర్థి జట్టుపై వెయ్యి పరుగులు సాధించిన రెండో ఆటగాడిగా నిలిచాడు. బుధవారం పంజాబ్‌ కింగ్స్ పై ఢిల్లీ క్యాపిట‌ల్స్ విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో వార్న‌ర్ 60 ప‌రుగులు చేశాడు. దీంతో ఒకే ప్రత్యర్థిపై 1,000 అత్యధిక పరుగులు చేసిన ఆట‌గాడిగా రోహిత్‌ శర్మ త‌ర్వాతి స్థానంలో వార్న‌ర్ నిలిచాడు.

ఐపీఎల్‌లో ఇప్ప‌టికే ప్ర‌త్యర్థి జ‌ట్టు కోల్ కతా నైట్ రైడర్స్ పై రోహిత్‌ శర్మ 1,018 పరుగులు చేశాడు. ఇక ఒకే ప్ర‌త్య‌ర్థి జ‌ట్టుపై అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాళ్ల‌లో మూడో స్థానంలోనూ డేవిడ్ వార్న‌రే ఉండ‌డం గ‌మ‌నార్హం. కేకేఆర్‌పై డేవిడ్‌ వార్నర్ 976 పరుగులు చేశారు. ఇక నాలుగో స్థానంలో విరాట్‌ కోహ్లీ (సీఎస్‌కేపై 949 పరుగులు) ఉన్నాడు. కాగా, ఐపీఎల్‌ వేలంలో వార్న‌ర్ ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.6.25 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. గత సీజన్ వరకూ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆడాడు డేవిడ్ వార్నర్. ఇప్పటివరకు ఈ సీజన్‌లో 4 మ్యాచ్‌లు ఆడిన డేవిడ్ వార్నర్.. 191 పరుగులు సాధించాడు. ఐపీఎల్‌లో 53 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు.(IPL 2022 David Warner)

డేవిడ్ వార్నర్. క్రికెట్ అభిమానులకు పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. ఐపీఎల్ పుణ్యమా అని తెలుగు ప్రేక్షకులకూ మరింత చేరువైన వ్యక్తి. ఈ ఆస్ట్రేలియన్ స్టార్ ఓపెనర్, మాజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్. ప్రస్తుతం ఢిల్లీ కేపిటల్స్ ఆటగాడు. క్రికెట్‌లో పరుగుల వరద పారిస్తాడు. వార్నర్ లో మరో నైపుణ్యం కూడా ఉంది. క్రికెట్‌లోనే కాదు ఫన్నీ విషయాల్లో కూడా సందడి చేస్తుంటాడు. అప్పుడప్పుడూ టాలీవుడ్, బాలీవుడ్ పాటలకు స్టెప్పులేస్తూ.. వీడియోలు విడుదల చేస్తూ హల్‌చల్ చేస్తుంటాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఉన్నంతవరకూ తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైన వ్యక్తి డేవిడ్ వార్నర్.

Virat Kohli : ఐపీఎల్ చరిత్రలో కోహ్లీ ఖాతాలో ఇదే చెత్త రికార్డు..

ఈ సీజన్ లో జట్టు మారాడు. ఢిల్లీ కేపిటల్స్ తరపున ఆడుతున్నాడు. అక్కడా పరుగుల వరదే. బుధవారం పంజాబ్ కింగ్స్ లెవెన్‌తో జరిగిన మ్యాచ్‌లో అరుదైన రికార్డు నమోదు చేసి ఐపీఎల్ చరిత్రలో రెండవ ఆటగాడిగా నిలిచాడు. ఒకే ప్రత్యర్ధి జట్టుపై వెయ్యి పరుగులు పూర్తి చేశాడు.

డేవిడ్ వార్నర్ ఇటువంటిదే మరో రికార్డు నెలకొల్పేందుకు ఎంతో దూరంలో లేడు. కేకేఆర్ జట్టుపై ఇప్పటివరకు 976 పరుగులు చేసిన వార్నర్.. మరో 24 పరుగులు పూర్తయితే.. మరో ప్రత్యర్ధి జట్టుపై కూడా వెయ్యి పరుగులు చేసిన ఘనత సాధిస్తాడు. అంటే రెండు ప్రత్యర్ధి జట్లపై చెరో వెయ్యి పరుగులు సాధించిన తొలి ఆటగాడు కానున్నాడు. విరాట్ కోహ్లి కోసం కూడా ఇలాంటి ఓ రికార్డు ఎదురు చూస్తోంది. కోహ్లీ.. సీఎస్కేపై ఇప్పటివరకు 949 పరుగులు చేశాడు. మరో 51 పరుగులు చేస్తే.. విరాట్ కోహ్లీకి కూడా ఆ రికార్డు దక్కుతుంది.(IPL 2022 David Warner)