IPL2022 RR Vs RCB : మారని బెంగళూరు బ్యాటర్ల తీరు.. రాజస్తాన్ చేతిలో చిత్తు

ఈ సీజన్ లో బెంగళూరు బ్యాటర్లు తీరు మారలేదు. మరోసారి ఘోరంగా విఫలం అయ్యారు. దీంతో రాజస్తాన్ చేతిలో చిత్తుగా ఓడారు.(IPL2022 RR Vs RCB)

Ipl2022 Rr Vs Rcb

IPL2022 RR Vs RCB : ఐపీఎల్ 2022 సీజన్ లో 15లో భాగంగా మంగళవారం బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, రాజస్తాన్ రాయల్స్ జట్లు తలపడ్డాయి. ఈ సీజన్ లో బెంగళూరు బ్యాటర్లు తీరు మారలేదు. మరోసారి ఘోరంగా విఫలం అయ్యారు. దీంతో రాజస్తాన్ చేతిలో చిత్తుగా ఓడారు. రాజస్తాన్ నిర్దేశించిన 145 పరుగుల స్వల్ప టార్గెట్ ను కూడా బెంగళూరు చేధించలేక చేతులెత్తేసింది. బౌలింగ్ లో విజృంభించిన ఆర్సీబీ బ్యాటింగ్ లో మాత్రం చతికిలపడింది. 19.3 ఓవర్లలోనే 115 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఫలితంగా 29 పరుగుల తేడాతో రాజస్తాన్ జట్టు గెలుపొందింది.

బెంగళూరు బ్యాటర్లలో బ్యాటర్లలో కెప్టెన్‌ డుప్లెసిస్‌ (23) తప్పితే ఎవరూ పెద్దగా ఆడలేదు. కోహ్లీ (9) మరోసారి విఫలమవ్వగా.. మ్యాక్స్‌వెల్‌ (0) గోల్డెన్‌ డకౌటయ్యాడు. దినేశ్‌ కార్తిక్‌ (6) అనవసర పరుగుకు యత్నంచి రనౌట్‌గా పెవిలియన్‌కు చేరాడు. రాజస్తాన్‌ బౌలర్లలో కుల్‌దీప్‌ సేన్ 4 వికెట్లు పడగొట్టి బెంగళూరు ఓటమిని శాసించాడు. రవిచంద్రన్ అశ్విన్ మూడు వికెట్లు తీయగా, ప్రసిధ్‌ కృష్ణ 2 వికెట్లు తీశాడు.(IPL2022 RR Vs RCB)

తొలుత బ్యాటింగ్‌ చేసిన రాజస్తాన్‌ ఎనిమిది వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. రియాన్‌ పరాగ్ (56*) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో 12 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకుంది రాజస్తాన్. కాగా, బెంగళూరుకు వరుసగా రెండో ఓటమి. ఇకపోతే టీ20 లీగ్‌ తొలి రౌండ్‌లో ఓడించిన బెంగళూరును చిత్తు చేసి రాజస్తాన్‌ ప్రతీకారం తీర్చుకుంది.

కాగా, ఈ మ్యాచ్ లో బెంగళూరు బౌలర్లు అదరగొట్టారు. బంతితో విజృంభించారు. బ్యాటింగ్‌ పరంగా బలంగా ఉన్న రాజస్తాన్‌ను మోస్తరు పరుగులకే కట్టడి చేశారు. ఆర్సీబీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో ఆరంభంలో పరుగులు చేసేందుకు రాజస్తాన్‌ బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. అయితే లోయర్‌ ఆర్డర్‌లో రియాన్‌ పరాగ్ (56*) అద్భుత హాఫ్ సెంచరీ సాధించాడు. దీంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన రాజస్తాన్‌ ఎనిమిది వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది.

లోయర్ ఆర్డర్ లో వచ్చిన రియాన్‌ పరాగ్ దంచికొట్టాడంతో ఆ స్కోర్ అయినా వచ్చింది. పరాగ్‌తోపాటు సంజూ శాంసన్‌ (27) రాణించాడు. అశ్విన్‌ (17), డారిల్‌ మిచెల్ (16) ఫర్వాలేదనిపించడంతో రాజస్తాన్‌ ఓ మోస్తరు స్కోరును చేయగలిగింది. బెంగళూరు బౌలర్లలో సిరాజ్‌, హేజిల్‌వుడ్, హసరంగా తలో రెండేసి వికెట్లు పడగొట్టారు. హర్షల్ పటేల్‌ ఒక వికెట్‌ తీశాడు.

కాగా, ఈ సీజన్ లో సూపర్ ఫామ్ లో ఉండి పరుగుల వరద పారిస్తున్న సెంచరీల హీరో జోస్ బట్లర్ బెంగళూరుపై రాణించలేకపోయాడు. బట్లర్ 9 బంతుల్లో కేవలం 8 పరుగులు మాత్రమే చేశాడు. ఐదో ఓవర్ లో హేజిల్ వుడ్ బౌలింగ్ లో సిరాజ్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఈ సీజన్ లో ఇప్పటికే మూడు సెంచరీలు బాదాడు బట్లర్. 2 హాఫ్ సెంచరీలు కూడా నమోదు చేశాడు.(IPL2022 RR Vs RCB)

ఈ మ్యాచ్ లో టాస్‌ నెగ్గిన బెంగళూరు కెప్టెన్ డుప్లెసిస్‌ బౌలింగ్‌ ఎంచుకుని రాజస్తాన్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. రాజస్తాన్ ఆడిన 8 మ్యాచుల్లో 6 గెలిచింది. బెంగళూరు ఆడిన 9 మ్యాచుల్లో 5 గెలిచింది. ఈ మ్యాచ్‌లో విజయంతో రాజస్తాన్‌ అగ్రస్థానానికి చేరుకుంది. ఇక గత రికార్డులు పరిశీలిస్తే.. ఈ రెండు జట్లు తలపడిన సందర్భాల్లో బెంగళూరు 13 విజయాలతో రాజస్తాన్ రాయల్స్ పై(11) ఆధిపత్యం సాధించింది.

జట్ల వివరాలు:

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : డుప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్, సూయష్‌ ప్రభుదేశాయ్‌, రాజత్‌ పాటిదార్, షాహ్‌బాజ్ అహ్మద్, దినేశ్‌ కార్తిక్, హర్షల్ పటేల్, వనిందు హసరంగా, జోష్‌ హేజిల్‌వుడ్, మహమ్మద్‌ సిరాజ్

రాజస్తాన్‌ రాయల్స్ : జోస్ బట్లర్, దేవదుత్ పడిక్కల్, సంజూ శాంసన్ (కెప్టెన్), హెట్‌ మైర్, రియాన్ పరాగ్, డారిల్ మిచెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, కుల్‌దీప్‌ సేన్, ప్రసిధ్‌ కృష్ణ, యుజువేంద్ర చాహల్‌