Yashasvi Jaiswal : హాస్పిట‌ల్ బెడ్ పై య‌శ‌స్వి జైస్వాల్.. ఆందోళ‌న‌లో ఫ్యాన్స్‌..!

టీమ్ఇండియా స్టార్ ఆట‌గాడు య‌శ‌స్వి జైస్వాల్ (Yashasvi Jaiswal ) ఆస్ప‌త్రిలో చేరాడు.

Yashasvi Jaiswal : హాస్పిట‌ల్ బెడ్ పై య‌శ‌స్వి జైస్వాల్.. ఆందోళ‌న‌లో ఫ్యాన్స్‌..!

SMAT 2025 Yashasvi Jaiswal Hospitalised After Match In Pune Report (p/c @ Team Yashasvi Jaiswal)

Updated On : December 17, 2025 / 11:34 AM IST

Yashasvi Jaiswal : టీమ్ఇండియా స్టార్ ఆట‌గాడు య‌శ‌స్వి జైస్వాల్ ఆస్ప‌త్రిలో చేరాడు. స‌య్య‌ద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ 2025లో భాగంగా మంగ‌ళ‌వారం రాజ‌స్థాన్, ముంబై జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ జ‌రిగింది. ఈ మ్యాచ్ అనంత‌రం జైస్వాల్ అనారోగ్యంతో ఆస్ప‌త్రిలో చేరాడు. అందుతున్న స‌మాచారం మేర‌కు అత‌డు తీవ్ర‌మైన క‌డుపు నొప్పితో బాధ‌ప‌డుతున్నాడు.

అతడిని పుణేలోని ఆదిత్య బిర్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్ర‌స్తుతం అత‌డి ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉన్న‌ట్లు వైద్యులు తెలిపారు. ప్ర‌స్తుతం విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.

మ్యాచ్ మొత్తం అత‌డు క‌డుపు నొప్పితో ఇబ్బంది ప‌డిన‌ట్లు ప‌లు నివేదిక‌లు తెలిపాయి. మ్యాచ్ అనంత‌రం ప‌రిస్థితి తీవ్రం కావ‌డంతో ఆస్ప‌త్రిలో చేరిన‌ట్లు పేర్కొన్నాయి.

Cameron Green : వేలంలో 25 కోట్లు.. త‌రువాతి రోజే కామెరూన్ గ్రీన్ క‌ళ్లు చెదిరే ఇన్నింగ్స్‌..! ఇలా ఐపీఎల్‌లో ఆడితే..

ఈ మ్యాచ్‌లో రాజ‌స్థాన్ మొద‌ట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి 216 ప‌రుగులు చేసింది. రాజ‌స్థాన్ బ్యాట‌ర్ల‌లో ముకుల్ చౌదరి (54; 28 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స‌ర్లు), దీప‌క్ హుడా (51; 31 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) అర్థ‌శ‌త‌కాలు చేశాడు. రామ్నివాస్ గోలడా (48; 29 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) రాణించాడు.

ఆ త‌రువాత 217 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ముంబై 18.1 ఓవ‌ర్ల‌లో 7 వికెట్లు కోల్పోయి అందుకుంది. ముంబై బ్యాట‌ర్ల‌లో అజింక్యా ర‌హానే (72 నాటౌట్‌; 41 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స‌ర్లు), స‌ర్ఫ‌రాజ్ ఖాన్ (73; 22 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్స‌ర్లు) మెరుపు అర్థ‌శ‌త‌కాలు సాధించారు. ఇక ఈ మ్యాచ్‌లో అస్వస్థతతో ఉన్నప్పటికీ జైస్వాల్ ఓపెన‌ర్ గా బ‌రిలోకి దిగాడు. 16 బంతుల్లో 15 ప‌రుగులు చేశాడు.

Prithvi Shaw : పృథ్వీ షాను కొన్నారోచ్చ్‌.. ఒకప్పుడు 8 కోట్లు.. ఇప్పుడు ఎంతో తెలిస్తే ఫ్యూజులు ఔట్‌..