Mangesh Yadav : ఆర్‌సీబీ కోట్లు కుమ్మరించిన మంగేష్ యాదవ్ ఎవరు? అతడి ట్రాక్ రికార్డు ఏంటి?
ఐపీఎల్ 2026 మినీ వేలంలో మంగేష్ యాదవ్ (Mangesh Yadav ) కోసం ఆర్‌సీబీ కోట్లు కుమ్మరించింది
Who is Mangesh Yadav who was picked by RCB
Mangesh Yadav : ఐపీఎల్ 2026 మినీ వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మధ్యప్రదేశ్ కు చెందిన ఎడమచేతి వాటం పేస్ ఆల్‌రౌండర్ అయిన మంగేష్ యాదవ్ కోసం కోట్లు కుమ్మరించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో పోటీపడి మరీ రూ.5.20 కోట్ల భారీ మొత్తానికి ఆర్‌సీబీ అతడిని సొంతం చేసుకుంది.
దీంతో అతడు ఎవరు? అతడి కోసం ఆర్‌సీబీ అంత పెద్ద మొత్తం ఎందుకు వెచ్చింది అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.
Yashasvi Jaiswal : హాస్పిటల్ బెడ్ పై యశస్వి జైస్వాల్.. ఆందోళనలో ఫ్యాన్స్..!
మంగేష్ యాదవ్ డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ కావడంతో పాటు ఆఖరల్లో బ్యాటింగ్ చేయగల సామర్థ్యం అతడి సొంతం. రజత్ పాటిదార్ సూచనతో ట్రయల్స్‌లో అతడి సామర్థ్యాన్ని ఆర్‌సీబీ పరీక్షించింది.
లీగ్‌లో అదరగొట్టాడు..
ఈ ఏడాది ఆరంభంలో మధ్యప్రదేశ్ టీ20 లీగ్‌లో మంగేష్ రాణించాడు. రజత్ పాటిదార్‌తో కలిసి గ్వాలియర్ చీతాస్ తరపున ఆడుతూ కేవలం ఆరు మ్యాచ్‌ల్లో 12 సగటుతో 14 వికెట్లు పడగొట్టాడు. ఇందులో మూడు సార్లు నాలుగు వికెట్ల ప్రదర్శన ఉంది.
Prithvi Shaw : పృథ్వీ షాను కొన్నారోచ్చ్.. ఒకప్పుడు 8 కోట్లు.. ఇప్పుడు ఎంతో తెలిస్తే ఫ్యూజులు ఔట్..
ప్రస్తుతం జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో రెండు మ్యాచ్‌లు ఆడాడు. మూడు వికెట్లు పడగొట్టాడు. ఓ మ్యాచ్‌లో 12 బంతుల్లోనే 233.33 స్ట్రైక్‌రేటుతో 28 పరుగులు చేశాడు.
