Irfan Pathan : సునీల్ గవాస్కర్‌కు క్షమాపణలు చెప్పిన ఇర్ఫాన్ పఠాన్.. అంగీకరించని దిగ్గజ ఆటగాడు.. ఇద్దరి మధ్య ఏం జరిగిందంటే..?
మ్యాచ్ అనంతరం మొదటి ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్ ఆడిన ఇన్నింగ్స్ పై భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్, దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ మధ్య ఆసక్తికర సంబాషణ జరిగింది.
- Thota Vamshi Kumar
- Published on- December 30, 2023 / 02:36 PM IST
Irfan Pathan apologizes to Sunil Gavaskar
Irfan Pathan apologizes to Sunil Gavaskar : సెంచూరియన్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన మొదటి టెస్టు మ్యాచ్ మూడు రోజుల్లోనే ముగిసింది. రోహిత్ సారథ్యంలోని భారత్ ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దక్షిణాఫ్రికా మొదటి ఇన్నింగ్స్‌లో 408 పరుగులు చేయగా భారత్ వరుసగా రెండు ఇన్నింగ్స్‌ల్లో 245, 131 పరుగులకు కుప్పకూలింది. ఇక మ్యాచ్ అనంతరం మొదటి ఇన్నింగ్స్‌లో కష్టకాలంలో కేఎల్ రాహుల్ (101) ఆడిన ఇన్నింగ్స్ పై భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్, దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ మధ్య ఆసక్తికర సంబాషణ జరిగింది.
కేఎల్ రాహుల్ మొదటి ఇన్నింగ్స్‌లో ఆడిన విధానం తనను ఆకట్టుకుందని ఇర్ఫాన్ పఠాన్ చెప్పాడు. అతడి టెక్నిక్, బ్యాటింగ్ స్టైల్‌ను వివరించాడు. ఈ క్రమంలో రాహుల్ గురించి చాలా సేపు పఠాన్ మాట్లాడాడు. చాలా ఎక్కువ సమయం మాట్లాడినందుకు గవాస్కర్‌కు ఈ సందర్భంగా ఇర్ఫాన్ పఠాన్ క్షమాపణలు చెప్పాడు. అయితే.. తాను క్షమాపణలు అంగీకరించబోనని మాజీ కెప్టెన్ గవాస్కర్ అన్నారు.
Test team of the year 2023 : విరాట్ కోహ్లీ, రోహిత్‌శర్మలకు నో ఛాన్స్.. హర్షా ఏందయ్యా ఇది..!
రాహుల్ టెక్నిక్ పై ఇర్ఫాన్ అద్భుమైన విశ్లేషణ చేశాడని తాను భావిస్తున్నట్లు చెప్పాడు. అందుకని అతడు క్షమాపణలు చెప్పినా తాను అంగీకరించనన్నాడు. ఈ వీడియోను ఇర్ఫాన్ పఠాన్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. సునీల్ గవాస్కర్‌కు ధన్యవాదాలు తెలియజేశాడు.
ఈ రోజు తన హృదయం కృతజ్ఞతతో నిండిపోయిందని పఠాన్ చెప్పుకొచ్చాడు. ఇది కేవలం ఈ ఒక్క రోజుకు మాత్రమే కాదన్నాడు. అద్భుమైన కాంప్లిమెంట్ ఇచ్చినందుకు సునీల్ గవాస్కర్‌కు ధన్యవాదాలు తెలియజేశాడు. ఈ సంవత్సరంలో నేను పొందిన గొప్ప ప్రశంస ఇదే అంటూ ఆ వీడియో కింద ఇర్ఫాన్ పఠాన్ రాసుకొచ్చాడు.
Ajinkya Rahane : టీమ్ఇండియా ఘోర ఓటమి తరువాతి రోజు రహానే పోస్ట్.. వైరల్
ఇదిలా ఉంటే.. బుధవారం నుంచి కేప్‌టౌన్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా జట్లు రెండో టెస్టు మ్యాచులో తలపడనున్నాయి. ఈ మ్యాచులో గెలిచి సిరీస్‌ను వైట్ వాష్ చేయాలని దక్షిణాఫ్రికా భావిస్తుండగా, ఎలాగైనా ఈ మ్యాచులో విజయం సాధించి సిరీస్‌ను సమం చేయాలని భారత్ పట్టుదలగా ఉంది.
