Test team of the year 2023 : విరాట్ కోహ్లీ, రోహిత్‌శ‌ర్మ‌ల‌కు నో ఛాన్స్‌.. హ‌ర్షా ఏంద‌య్యా ఇది..!

ప‌లువురు మాజీ క్రికెట‌ర్ల‌తో పాటు క్రికెట్ విశ్లేష‌కులు ఈ సంవ‌త్స‌రం టెస్టు క్రికెట్‌లో అత్యుత్త‌మంగా రాణించిన ఆట‌గాళ్ల‌తో కూడిన 11 మందితో గ‌ల‌ టీమ్‌ల‌ను ప్ర‌క‌టిస్తున్నారు.

Test team of the year 2023 : విరాట్ కోహ్లీ, రోహిత్‌శ‌ర్మ‌ల‌కు నో ఛాన్స్‌.. హ‌ర్షా ఏంద‌య్యా ఇది..!

Harsha Bhogle Picks Test Team Of The Year 2023

Test team of the year : మ‌రో రెండు రోజుల్లో 2023 సంవ‌త్స‌రం ముగుస్తోంది. ఈ క్ర‌మంలో ప‌లువురు మాజీ క్రికెట‌ర్ల‌తో పాటు క్రికెట్ విశ్లేష‌కులు ఈ సంవ‌త్స‌రం టెస్టు క్రికెట్‌లో అత్యుత్త‌మంగా రాణించిన ఆట‌గాళ్ల‌తో కూడిన 11 మందితో గ‌ల‌ టీమ్‌ల‌ను ప్ర‌క‌టిస్తున్నారు. టెస్ట్ టీమ్ ఆఫ్ ది ఇయ‌ర్ 2023 అంటూ ఇప్ప‌టికే ప‌లువురు మాజీ ఆట‌గాళ్లు త‌మ‌కు న‌చ్చిన ఆట‌గాళ్ల‌తో కూడిన టీమ్‌ల‌ను ప్ర‌క‌టించ‌గా తాజాగా ఈ జాబితాలోకి ప్ర‌ముఖ కామెంటేట‌ర్ హ‌ర్షా భోగ్లే కూడా చేరిపోయారు.

తాజాగా హ‌ర్షా భోగ్లే టెస్టు టీమ్ ఆఫ్ ది ఇయ‌ర్ 2023 ప్ర‌క‌టించాడు. అయితే.. త‌న టీమ్‌లో స్టార్ ప్లేయ‌ర్లు విరాట్ కోహ్లీ, కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌ల‌కు స్థానం దక్క‌లేదు. టీమ్ఇండియా నుంచి ఇద్ద‌రు క్రికెట‌ర్ల‌కు మాత్ర‌మే చోటు ల‌భించ‌గా ఇంగ్లాండ్ నుంచి అత్య‌ధికంగా న‌లుగురు ఆట‌గాళ్లు జ‌ట్టులో స్థానం ల‌భించింది. ఆస్ట్రేలియా నుంచి ముగ్గురు, న్యూజిలాండ్ నుంచి ఇద్ద‌రు చొప్పున చోటు ద‌క్కించుకున్నారు.

Ajinkya Rahane : టీమ్ఇండియా ఘోర ఓట‌మి త‌రువాతి రోజు ర‌హానే పోస్ట్.. వైర‌ల్‌

భార‌త్ నుంచి ఆ ఇద్ద‌రికే..

ఆస్ట్రేలియాకు చెందిన ఉస్మాన్ ఖవాజా, ఇంగ్లాండ్‌కు చెందిన జాక్ క్రాలీలను ఓపెనర్లుగా ఎంచుకున్నాడు. ఖ‌వాజా 2023లో వెయ్యి ప‌రుగుల మార్క్‌ను అధిగ‌మించిన ఏకైక బ్యాట‌ర్‌. మొత్తంగా ఖ‌వాజా 12 మ్యాచుల్లో 1210 ప‌రుగులు చేశాడు. క్రాలీ 8 మ్యాచ్‌ల్లో 606 పరుగులు చేశాడు. వ‌న్‌డౌన్‌లో కేన్ విలియ‌మ్స‌న్‌కు నాలుగో స్థానంలో జో రూట్‌ల‌ను తీసుకున్నాడు. కేన్ మామ 7 మ్యాచుల్లో 695 ప‌రుగులు చేయ‌గా రూట్ 787 ప‌రుగులు చేశాడు. ఐదో స్థానంలో హ్యారీ బ్రూక్‌కు అవ‌కాశం ఇచ్చాడు. బ్రూక్ 53.92 సగటుతో 91.51 స్ట్రైక్ రేట్‌తో 701 పరుగులు చేశాడు.

న్యూజిలాండ్‌కు చెందిన టామ్ బ్లండెట్ వికెట్ కీప‌ర్‌గా ఎంపిక అయ్యాడు. రవీంద్ర జడేజా, ఆర్ అశ్విన్ ల‌ను స్పిన్ ఆల్‌రౌండ‌ర్లుగా ఎంపిక చేశాడు. అశ్విన్ 2023లో భారత్ తరఫున అత్యధికంగా 150 పరుగులు చేసి 41 వికెట్లు తీశారు. జడేజా 281 పరుగులు చేసి 33 వికెట్లు ప‌డ‌గొట్టాడు. పేస‌ర్లుగా స్టువ‌ర్ట్ బ్రాడ్‌, మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్‌ల‌ను తీసుకున్నాడు.

MS Dhoni : ఆహారం కోసం పాకిస్తాన్‌కు వెళ్లండి.. అభిమానికి ధోని స‌ల‌హా..! వీడియో వైర‌ల్‌

కాగా.. హ‌ర్షా భోగ్లే ఎంచుకున్న టీమ్‌పై నెటిజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. హ‌ర్షా ఏంట‌య్యా.. ఇది విరాట్ కోహ్లి, రోహిత్ శ‌ర్మ‌ల‌ను ఎందుకు తీసుకోలేదు అంటూ ప‌లువురు ప్ర‌శ్నిస్తున్నారు.

హర్ష భోగ్లే టెస్ట్ టీమ్ 2023 : ఉస్మాన్ ఖవాజా, జాక్ క్రాలే, కేన్ విలియమ్సన్, జో రూట్, హ్యారీ బ్రూక్, టామ్ బ్లండెల్ (వికెట్ కీప‌ర్‌), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, స్టువర్ట్ బ్రాడ్, మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్‌వుడ్