ODI World Cup 2023 : శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ ల ఆన్ ఫీల్డ్ ప్రేమ.. మీమ్స్ వైరల్
యువ ఆటగాళ్లు శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ ల యొక్క ఆన్ ఫీల్డ్ ప్రేమ సోషల్ మీడియాలో వైరల్ గామారింది. దీనిపై మీమ్స్ వెల్లువెత్తాయి.
- Thota Vamshi Kumar
- Updated on- November 3, 2023 / 04:03 PM IST
Ishan Kishan and Shubman Gill
ODI World Cup : వన్డే ప్రపంచకప్‌లో భాగంగా గురువారం ముంబైలోని వాంఖడే వేదికగా భారత్, శ్రీలంక జట్లు తలపడ్డాయి. టీమ్ఇండియా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో డ్రింక్స్ విరామంలో యువ ఆటగాళ్లు శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ ల యొక్క ఆన్ ఫీల్డ్ ప్రేమ సోషల్ మీడియాలో వైరల్ గామారింది. దీనిపై మీమ్స్ వెల్లువెత్తాయి.
ఈమ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ 92 బంతుల్లో 92 పరుగులు చేశాడు. శతకానికి 8 పరుగుల దూరంలో ఔట్ అయ్యాడు. భారత విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. లంక పై విజయంతో టీమ్ఇండియా ఈ మెగా టోర్నీలో సెమీస్ చేరిన మొదటి జట్టుగా నిలిచింది. కాగా.. ఈ మ్యాచ్‌లో కొన్ని మ్యాజికల్ మూమెంట్స్ కెమెరాకు చిక్కాయి. డ్రింక్స్ బ్రేక్ సమయంలో ఇషాన్ కిషన్ గొడుగు పట్టుకుని రావడం అందరి దృష్టిని ఆకర్షించింది.
కోహ్లీ,గిల్ కొద్ది సేపు ఆ గొడుగు నీడలో విశ్రాంతి తీసుకున్నారు. మండే వేడి నుండి తమను తాము రక్షించుకున్నారు. అదే సమయంలో గిల్‌కు ఇషాన్ వాటర్ బాటిల్ నోటికి అందించడంతో పాటు తాపించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్‌గా మారగా.. నెటీజన్లు మీమ్స్‌తో ఆడుకుంటున్నారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో శుభ్‌మన్ గిల్ (92; 92 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లు), విరాట్ కోహ్లీ (88 ;94 బంతుల్లో 11 ఫోర్లు), శ్రేయస్ అయ్యర్ (82; 56 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్లు) లు హాఫ్ సెంచరీలతో రాణించారు. అనంతరం లక్ష్య ఛేదనలో శ్రీలంక తడబడింది. 19.4 ఓవర్లలో 55 పరుగులకే ఆలౌటైంది. దీంతో భారత్ 302 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
Team India: టాప్ గేర్ లో టీమిండియా.. రికార్డులే రికార్డులు!
