ODI World Cup 2023 : పాకిస్థాన్ మాజీ క్రికెట‌ర్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌.. అందువల్లే భార‌త బౌల‌ర్ల‌కు వికెట్లు..

భార‌త పేస‌ర్ల పై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ హసన్ రజా సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఐసీసీ, బీసీసీఐ వాళ్ల‌కు ప్ర‌త్యేక బాల్స్ ఇస్తుందని ఆరోపించాడు.

ODI World Cup 2023 : పాకిస్థాన్ మాజీ క్రికెట‌ర్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌.. అందువల్లే భార‌త బౌల‌ర్ల‌కు వికెట్లు..

Former Pakistan cricketer Hasan Raza

ODI World Cup : స్వ‌దేశంలో జ‌రుగుతున్న వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప‌స్‌లో టీమ్ఇండియా దూసుకుపోతుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఆడిన ఏడు మ్యాచుల్లోనూ విజ‌యం సాధించి ఈ మెగాటోర్నీలో సెమీస్‌కు చేరుకున్న మొద‌టి జ‌ట్టుగా నిలిచింది. భార‌త విజ‌య యాత్ర‌ను చూసి కొంద‌రు పాకిస్థాన్ మాజీ క్రికెట‌ర్లు త‌ట్టుకోలేక‌పోతున్నారు. టోర్నీ ఆరంభానికి ముందు టైటిల్ ఫేవ‌రెట్‌ల‌లో ఒక‌టిగా పాకిస్థాన్ ను ప‌రిగ‌ణించారు. అందుకు త‌గ్గ‌ట్లుగానే పాక్‌ మొద‌టి రెండు మ్యాచుల్లో విజ‌యం సాధించింది. ఆ త‌రువాతే ప‌రిస్థితి త‌ల‌క్రిందులైంది. వ‌రుస‌గా నాలుగు మ్యాచుల్లో ఓట‌మి పాలై సెమీస్ అవ‌కాశాల‌ను సంక్లిష్టం చేసుకుంది.

మ‌రో వైపు భార‌త్ వ‌రుస విజ‌యాలు సాధిస్తుండ‌గా సెమీస్‌కు దూసుకువెళ్లింది. భార‌త విజ‌యాల్లో ఫాస్ట్ బౌల‌ర్లు కీల‌క పాత్ర పోషిస్తున్నసంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో భార‌త పేస‌ర్ల పై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ హసన్ రజా సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఐసీసీ, బీసీసీఐ వాళ్ల‌కు ప్ర‌త్యేక బాల్స్ ఇస్తుందని ఆరోపించాడు. ఓ టీవీ ఛానెల్‌లో జ‌రిగిన చ‌ర్చా కార్య‌క్ర‌మంలో అత‌డు ఈ వ్యాఖ్య‌లు చేశాడు. ఈ కార‌ణం వ‌ల్ల‌నే భార‌త బౌల‌ర్లు మిగిలిన బౌల‌ర్ల‌తో పోలిస్తే సీమ్‌ను, స్వింగ్‌ను ఎక్కువ‌గా రాబ‌డుతున్నార‌ని అన్నాడు. కాబ‌ట్టి భార‌త బౌల‌ర్ల‌కు ఇచ్చే బంతుల‌ను చెక్ చేయాల‌న్నాడు.

Team India: టాప్ గేర్ లో టీమిండియా.. రికార్డులే రికార్డులు!

హసన్ రజా చేసిన కామెంట్ల పై సోష‌ల్ మీడియా వేదిక‌గా భార‌త మాజీ క్రికెట్ ఆకాశ్ స్పందించాడు. ఏం మాట్లాడుతున్నాడో అత‌డికే అర్థం కావ‌డం లేద‌న్నాడు. అత‌డు పాల్గొన్న‌ది తీవ్ర‌మైన క్రికెట్ షోనేనా అని ప్ర‌శ్నించాడు. దయచేసి ‘వ్యంగ్య కామెడీ’ని ఎక్కడైనా ఇంగ్లీషులో రాయాల‌ని సూచించాడు. అలా వారు ఉర్దూలో రాసి ఉండ‌వ‌చ్చు. అయితే నేను దానిని చ‌ద‌వలేక‌పోతున్నాను అంటూ ఎక్స్‌లో చోప్రా రాసుకొచ్చాడు.

1996 నుంచి 2005 మధ్య హ‌స‌న్ ర‌జా పాకిస్థాన్ టీమ్ తరఫున 7 టెస్టులు, 16 వన్డేలు ఆడాడు. అత‌డు చేసిన వ్యాఖ్య‌లు నిరాధార‌మైన‌వి. దీనిని భార‌త అభిమానులు ప‌ట్టించుకోవ‌డం లేదు.

గురువారం భార‌త జ‌ట్టు శ్రీలంక‌తో త‌ల‌ప‌డింది. ఈ మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 357 ప‌రుగులు చేసింది. శుభ్‌మ‌న్ గిల్ (92), విరాట్ కోహ్లీ (88), శ్రేయ‌స్ అయ్య‌ర్ (82) లు హాఫ్ సెంచ‌రీల‌తో రాణించారు. శ్రీలంక బౌల‌ర్ల‌లో మ‌ధుశంక ఐదు వికెట్లు తీశాడు. చ‌మీర ఓ వికెట్ ప‌డ‌గొట్టాడు. అనంత‌రం భార‌త పేస‌ర్లు చెల‌రేగ‌డంతో శ్రీలంక 55 ప‌రుగుల‌కే ఆలౌటైంది. దీంతో భార‌త్ 302 ప‌రుగుల భారీ తేడాతో విజ‌యం సాధించింది. ష‌మీ ఐదు, సిరాజ్ మూడు, బుమ్రా, జ‌డేజా చెరో వికెట్ తీశారు.

IND vs SL : బెస్ట్ ఫీల్డ‌ర్ అవార్డుల్లో స‌ర్‌ప్రైజ్‌.. అనౌన్స్ చేసిన క్రికెట్ దిగ్గ‌జం.. ఎవ‌రికో తెలుసా..?