Ishan Kishan big jump in ICC T20I rankings
ICC T20I rankings : అంతర్జాతీయ టీ20 క్రికెట్ ర్యాంకింగ్స్‌లో టీమ్ఇండియా బ్యాటర్ ఇషాన్ కిషన్ అదరగొట్టాడు. ఐదు కాదు పది కాదు ఏకంగా 32 స్థానాలు ఎగబాకాడు. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన ఐదో టీ20 మ్యాచ్‌లో సెంచరీ (43 బంతుల్లో 103 పరుగులు) చేయడంతో ప్రస్తుతం అతడు ర్యాంకింగ్స్‌లో 32 ర్యాంక్‌కు చేరుకున్నాడు.
టీమ్ఇండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ తన అగ్రస్థానంలోనే కొనసాగుతున్నాడు. ఇంగ్లాండ్ ఆటగాడు ఫిల్‌సాల్ట్ రెండో ర్యాంక్‌లోనే ఉన్నాడు. ఇక న్యూజిలాండ్‌తో సిరీస్‌కు దూరమైన తెలుగు ఆటగాడు తిలక్ వర్మ ఓ స్థానం దిగజారాడు. మూడో స్థానం నుంచి నాలుగుకు పడిపోయాడు. ఇంగ్లాండ్ ఆటగాడు జోస్ బట్లర్ మూడో స్థానానికి చేరుకున్నాడు. ఇక ఐదో స్థానంలో శ్రీలంక బ్యాటర్ పాతుమ్ నిస్సాంక ఉన్నాడు.
టీ20 బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో టాప్-5లో ఉన్న ప్లేయర్లు వీరే..
* అభిషేక్ శర్మ (భారత్) – 917 రేటింగ్ పాయింట్లు
* ఫిల్ సాల్ట్ (ఇంగ్లాండ్) – 834 రేటింగ్ పాయింట్లు
* జోస్ బట్లర్ (ఇంగ్లాండ్) – 769 రేటింగ్ పాయింట్లు
* తిలక్ వర్మ (భారత్) – 766 రేటింగ్ పాయింట్లు
* పాతుమ్ నిస్సాంక (శ్రీలంక) – 759 రేటింగ్ పాయింట్లు
ఇక బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికి వస్తే.. భారత ఆటగాడు వరుణ్ చక్రవర్తి అగ్రస్థానంలోనే కొనసాగుతున్నాడు. అతడు మినహా మరే భారత ఆటగాడు టాప్-10లో లేడు. పేసర్ అర్ష్‌దీప్ సింగ్ రెండు స్థానాలు ఎగబాకి 14వ ర్యాంకుకు చేరుకున్నాడు. పేస్ గుర్రం జస్‌ప్రీత్ బుమ్రా రెండు స్థానాలు పడిపోయాడు. అతడు 13 నుంచి 15వ ర్యాంక్‌కు దిగజారాడు. అక్షర్ పటేల్ 17వ ర్యాంక్‌కు చేరుకున్నాడు.
టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్‌లో టాప్-5లో ఉన్న ప్లేయర్లు వీరే..
* వరుణ్ చక్రవర్తి (భారత్) – 776 రేటింగ్ పాయింట్లు
* అబ్రార్ అహ్మద్ (పాకిస్తాన్) – 748 రేటింగ్ పాయింట్లు
* రషీద్ ఖాన్ (అఫ్గానిస్తాన్) – 737 రేటింగ్ పాయింట్లు
* ఆదిల్ రషీద్ (ఇంగ్లాండ్) – 710 రేటింగ్ పాయింట్లు
* జాకబ్ డఫీ (న్యూజిలాండ్) – 684 రేటింగ్ పాయింట్లు