Ishan Kishan : వాటి గురించి ఆలోచనలేదు.. మా లక్ష్యం ఆ ఒక్కటే.. టీమిండియా బ్యాటర్ ఇషాన్ కిషన్ కీలక కామెంట్స్ ..
Ishan Kishan : టీ20 సిరీస్‌లో ఇషాన్ కిషన్ అద్భుత బ్యాటింగ్ ప్రదర్శన చేశాడు. తాజాగా. శనివారం జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లోనూ ఇషాన్ కిషన్ కివీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 43 బంతుల్లోనే 103 పరుగులు చేశాడు.
- Harish Thanniru
- Published on- February 1, 2026 / 07:46 AM IST
Ishan Kishan
- చివరి మ్యాచ్‌లో సెంచరీ చేసిన ఇషాన్ కిషన్
- వ్యక్తిగత లక్ష్యం కాదు.. జట్టు ప్రయోజనాలు ముఖ్యం
- నా దృష్టంతా టీ20 వరల్డ్‌కప్‌పైనే
- మెగా టోర్నీలోనూ ఇదే ఫామ్‌ను కొనసాగించేందుకు ప్రయత్నిస్తా
Ishan Kishan : ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా చివరి మ్యాచ్ శనివారం రాత్రి జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు రెచ్చిపోయారు.. బ్యాటుతో పరుగుల వరద పారించారు. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 271 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ 43 బంతుల్లోనే 103 పరుగులతో సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తరువాత బ్యాటింగ్ ప్రారంభించిన కివీస్ జట్టు 19.4 ఓవర్లలో 225 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో టీ20 సిరీస్‌ను భారత్ జట్టు 4-1తో కైవసం చేసుకుంది.
ఈ టీ20 సిరీస్ లో ఇషాన్ కిషన్ అద్భుత బ్యాటింగ్ ప్రదర్శన చేశాడు. తాజాగా. శనివారం జరిగిన చివరి టీ20 మ్యాచ్ లోనూ ఇషాన్ కిషన్ కివీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 43 బంతుల్లోనే 103 పరుగులు చేశాడు. ఇందులో ఆరు ఫోర్లు, 10 సిక్సులు ఉండటం గమనార్హం. మ్యాచ్ అనంతరం ఇషాన్ కిషన్ మాట్లాడుతూ కీలక కామెంట్స్ చేశాడు.
అభిషేక్ శర్మతో బ్యాటింగ్ చేయడం నిజంగా సహాయపడుతుంది. మీరు అతని ఉద్దేశ్యాన్ని చూస్తే.. పరుగుల విషయంలో ప్రారంభ ఓవర్లలో జట్టుకు అవసరమైన వేగాన్ని అందించడంలో అతను దిట్ట. వ్యక్తిగత మైలురాళ్ల గురించి మాట్లాడుతూ.. ఇప్పుడు మా జట్టులోని ప్రతిఒక్కరి మనస్తత్వం అదే అని నేను అనుకుంటున్నాను. మీరు ఒక మైలురాయికి దగ్గరగా ఉన్నప్పటికీ.. అది నిజంగా పట్టింపు లేదు. మీరు ఆ దశలో సింగిల్స్ తీసుకోవడం ప్రారంభిస్తే.. భారీ పరుగులు చేసే అవకాశాన్ని కోల్పోయినట్లవుతుంది. కాబట్టి మ్యాచ్ లో వ్యక్తిగత మైలురాళ్ల కంటే జట్టుకు మరిన్ని పరుగులు అందించడమే లక్ష్యంగా టీమిండియా బ్యాటర్లు దృష్టిపెడతారంటూ ఇషాన్ కిషన్ అన్నారు.
ఈ సిరీస్ లో నేను బాగానే రాణించాను. నాకు అవార్డులు కూడా వచ్చాయి. కానీ, నా దృష్టి మొత్తం టీ20 ప్రపంచకప్ పైనే ఉంది. ఆ మెగా టోర్నీలో పరుగులు రాబట్టాలంటే అదనపు కృషి అవసరం. ప్రస్తుత ఫామ్ ను ముందుకు తీసుకెళ్లడం టీ20 వరల్డ్ కప్‌లో నాకు ఎంతో ముఖ్యమంటూ ఇషాన్ కిషన్ చెప్పారు.
