Ishan kishan : ఇషాన్ కిషన్ సెంచరీతో టీమిండియాలో టెన్షన్.. వారి స్థానాలకు చెక్ పడినట్లేనా? సెలెక్టర్లకు కొత్త తలనొప్పి

Ishan kishans : అఫ్గాన్‌తో రెండో వన్డేలో చెలరేగిన ఇషాన్ కిషన్.. కేవలం 79బంతుల్లో 125 పరుగులు చేశాడు. దీంతో టీమిండియా మిడిల్ ఆర్డర్‌కు ఇషాన్ గట్టి సవాల్ చేశాడు.

Ishan kishan

  • అఫ్గాన్‌తో రెండో వన్డేలో ఇషాన్ కిషన్ సెంచరీ
  • జట్టులో స్థానం సుస్థిరం చేసుకునేందుకు యత్నం
  • ఇషాన్ దూకుడుతో సెలెక్టర్లకు కొత్త తలనొప్పి

Ishan kishan : కొద్దికాలం క్రితం వరకు టీమిండియాలో స్థానం కోల్పోయిన వికెట్ కీపర్, బ్యాటర్ ఇషాన్ కిషన్ ప్రస్తుతం తన బ్యాటింగ్‌తో అదరగొడుతున్నాడు. ఇటీవల ఐపీఎల్‌లో పరుగుల వరద పారించిన ఇషాన్.. ప్రస్తుతం అఫ్గానిస్థాన్ జట్టుతో జరిగిన వన్డే మ్యాచ్‌లో సత్తాచాటాడు.

Also Read : IND vs AFG : భారీ శ‌త‌కాల‌తో చెల‌రేగిన శుభ్‌మ‌న్‌ గిల్, ఇషాన్ కిష‌న్‌.. టీమ్ఇండియా భారీ స్కోరు..

లక్నో వేదికగా అఫ్గానిస్థాన్ జట్టుతో బుధవారం రెండో వన్డే జరిగింది. ఈ వన్డేలో వికెట్ కీపర్ – బ్యాటర్ ఇషాన్ కిషన్ అద్భుత ప్రదర్శనతో మరోసారి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. గాయంతో విరాట్ కోహ్లీ జట్టుకు దూరంకావడంతో తుది జట్టులో ఇషాన్ కిషన్ కు చోటు దక్కింది. ఆ అవకాశాన్ని ఇషాన్ కిషన్ సద్వినియోగం చేసుకున్నాడు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో కలిసి మూడో వికెట్‌కు 224 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పిన ఇషాన్ కిషన్.. కేవలం 79 బంతుల్లో 125 పరుగులు సాధించాడు. తొలుత 50 పరుగులకోసం 53 బంతులు ఎదుర్కొన్న ఇషాన్.. ఆ తరువాత కేవలం 19 బంతుల్లోనే విధ్వంసకర బ్యాటింగ్ తో శతకం పూర్తి చేశాడు.

ఇషాన్ కిషన్ ఆడిన ఈ ఇన్నింగ్స్‌తో టీమిండియా వన్డే ప్రపంచకప్ జట్టులో స్థానం కోసం పోటీ మరింత ఉత్కంఠభరితంగా మారింది. ఇప్పటికే విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ వంటి సీనియర్ బ్యాటర్లు జట్టులో ఉండగా.. ఇషాన్ కిషన్ ఫామ్‌లోకి రావడం సెలెక్టర్లకు జట్టు ఎంపిక కొంత తలనొప్పిగా మారే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇషాన్ కిషన్ ఇటీవలి కాలంలో టి20లు, వన్డేల్లో వరుసగా ఆకట్టుకుంటూ టీమిండియా జట్టులో తన స్థానాన్ని మరింత బలపరుచుకుంటున్నాడు. అఫ్గానిస్థాన్‌పై ఈ సెంచరీతో అతడు ప్రపంచకప్ ఎంపిక రేసులో తాను కూడా బలమైన పోటీదారునేనని చాటిచెప్పాడు.