Israel-Iran Conflict PV Sindhu Stuck In Dubai
PV Sindhu : ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా ఇరాన్‌పై మిసైళ్ల వర్షం కురిపించాయి. ప్రతీకారంగా ఇరాన్ సైన్యం యూఎస్ సైనిక స్థావరాలపై దాడులు జరిపింది. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో పలు విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు దుబాయ్ విమానాశ్రయంలో చిక్కుకుపోయింది. ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఆడేందు కోసం ఆమె ఇంగ్లాండ్ వెలుతోంది.
అక్కడి పరిస్థితుల గురించి పీవీ సింధు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తాము ఉన్న ప్రాంతానికి అతి సమీపంలోనే పేలుడు సంభవించినట్లు తెలిపింది.
The ordeal continues to unfold, and the situation is becoming more frightening by the hour.
A few hours ago, there was an explosion close to where we were holed up at the airport. My coach had to quickly run out of the area as he was closest to the smoke and debris. It was an… https://t.co/ZdNtuALk0P
— Pvsindhu (@Pvsindhu1) March 1, 2026
‘పరిస్థితులు గంట గంటకు భయానకంగా మారుతున్నాయి. కొన్ని గంటల క్రితం విమానాశ్రయంలో మేము చిక్కుకున్న ప్రదేశానికి చాలా సమీపంలో పేలుడు సంభవించింది. పెద్ద ఎత్తున పొగ వ్యాప్తించింది. భయంతో కోచ్‌తో సహా అందరం అక్కడి నుంచి పరుగులు తీశాము.’ అని సింధు తెలిపింది.
తనతో పాటు తన బృందం ప్రస్తుతం మరింత సురక్షితమైన ప్రదేశంలో ఉన్నట్లు బ్యాడ్మింటన్ స్టార్ తెలిపింది. ఎయిర్ పోర్టు సిబ్బంది, అధికారులు తమను సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు చెప్పింది. తమ భద్రతకు చర్యలు తీసుకున్న విమానాశ్రయ సిబ్బంది, స్థానిక అధికారులతో పాటు దుబాయ్‌లోని భారత రాయబార కార్యాలయ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసింది. అతి తొందరలోనే పరిస్థితులు మెరుగు పడతాయని ఆశిస్తున్నట్లు చెప్పింది.
పీవీ సింధునే కాకుండా బాలీవుడ్ హీరోయిన్ సోనాల్ చౌహాన్‌తో పాటు పలువరు సినీ, క్రీడా ప్రముఖులు దుబాయ్‌లో చిక్కుకుపోయారు.