న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న 10మీ ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ ఈవెంట్‌లో మనూ బాకర్, సౌరవ్ చౌదరీలు గోల్డ్ దక్కించుకున్నారు. క్వాలిఫికేషన్ రౌండ్‌లోనే 778పాయింట్లు సాధించిన ఈ జోడీ ప్రపంచ రికార్డు పట్టేసింది. మరో భారత జోడీ అయిన హీనా సిద్దు, అభిషేక్ వర్మ 770 పాయింట్లు సాధించి క్వాలిఫై రౌండ్‌ను కోల్పోయారు.
Also Read: ఇదేం బాల్ బాబూ..: పిచ్‌పైన పడకపోయినా లీగల్ డెలీవరీయా?
ఆదివారం జరిగిన 10మీ. ఎయిర్ పిస్టల్ పోటీలో సౌరవ్ చౌదరీ 245.0 పాయింట్లతో రికార్డు సాధించారు. దీంతో ఆవిడ ఖాతాలో మొదటి గోల్డ్ మెడల్ చేరినట్లు అయింది. ఈ స్వర్ణ పతకం భారత్‌కు 2020 ఒలింపిక్స్ దక్కేలా చేసింది. ఆమెతో పాటు సౌరవ్ చౌదరి కూడా జూనియర్ కేటగిరలో రికార్డు పట్టేసింది.
సిక్స్ షాట్ల సిరీస్‌లో మనూ ఫైనల్ షాట్‌లో 98తో రికార్డు పట్టేసింది. మరోవైపు హీనా సిద్ధు తీవ్రంగా ప్రయత్నించి 97పాయింట్లు దక్కించుకుంది. ఆదివారం జరిగిన 25మీ. ఈవెంట్లో మనూ కనీసం ఒక్క పతకం కూడా దక్కించు కోలేకపోయింది. ఫైనల్స్‌లో 35 షాట్లకు 22 షాట్లు మాత్రమే చేసి ముగించింది.