Shreyas Iyer : టీమ్ఇండియా కోచ్‌గా గంభీర్‌.. ఆశ‌ల ప‌ల్ల‌కిలో శ్రేయ‌స్ అయ్య‌ర్‌..?

టీమ్ఇండియా హెడ్ కోచ్‌గా గౌత‌మ్ గంభీర్‌ను బీసీసీఐ నియ‌మించింది.

Iyer Sweats It Out Ahead Of Gambhir Debut Series As India Coach

Shreyas Iyer – Gautam Gambhir : టీమ్ఇండియా హెడ్ కోచ్‌గా గౌత‌మ్ గంభీర్‌ను బీసీసీఐ నియ‌మించింది. శ్రీలంక ప‌ర్య‌ట‌న‌తో గంభీర్ బాధ్య‌త‌ల‌ను చేప‌ట్ట‌నున్నాడు. లంక ప‌ర్య‌ట‌న‌లో భార‌త జ‌ట్టు మూడు వ‌న్డేలు, మూడు టీ20లు ఆడ‌నుంది. జూలై 26 నుంచి లంక ప‌ర్య‌ట‌న ప్రారంభం కానుంది. ఈ క్ర‌మంలో అతి త్వ‌ర‌లోనే భారత జ‌ట్టును ప్ర‌క‌టించేందుకు బీసీసీఐ సిద్ద‌మవుతోంది. తొలి ప‌ర్య‌ట‌న‌ను విజ‌య‌వంతం చేసుకుని త‌న‌దైన ముద్ర వేయాల‌ని గంభీర్ ప‌ట్టుద‌ల‌గా ఉన్నాడు.

మ‌రోవైపు టీమ్ఇండియా మిడిల్ ఆర్డ‌ర్ ఆట‌గాడు శ్రేయ‌స్ అయ్య‌ర్ పున‌రాగ‌మ‌నం కోసం గ‌ట్టిగానే క‌ష్ట‌ప‌డుతున్నాడు. ఫిట్‌నెస్ పై ఫోక‌స్ పెట్టాడు. గంభీర్ హెడ్‌కోచ్‌గా రావ‌డంతో త‌న పున‌రాగ‌మ‌నం పై అయ్య‌ర్ చాలా ఆశ‌లే పెట్టుకున్నాడు. అయ్య‌ర్ నాయ‌క‌త్వంలో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ ఐపీఎల్ 2024 విజేత‌గా నిలిచింది. ఆ స‌మ‌యంలో కేకేఆర్ మెంటార్‌గా గౌత‌మ్ గంభీరే ఉన్నాడు.

Asia Cup 2024 : క్రికెట్ అభిమానుల‌కు శుభ‌వార్త‌.. జూలై 19 భార‌త్ వ‌ర్సెస్ పాక్ మ్యాచ్‌.. స్టేడియంలోకి ఫ్రీ ఎంట్రీ

వెన్ను నొప్పి అని చెబుతూ ముంబై త‌రుపున రంజీట్రోఫీలో ఆడేందుకు అయ్య‌ర్ నిరాక‌రించాడు. అదే స‌మ‌యంలో అయ్య‌ర్ ఫిట్‌గానే ఉన్న‌ట్లుగా నేష‌న‌ల్ క్రికెట్ అకాడ‌మీ (ఎన్‌సీఏ) స‌ర్టిఫికెట్ ఇచ్చింది. దీంతో అత‌డు బీసీసీఐ ఆగ్ర‌హానికి గురైయ్యాడు. సెంట్ర‌ల్ కాంట్రాక్టు జాబితాలో చోటు కోల్పోయాడు. న‌ష్టం జ‌రిగాక దిద్దుబాటు చ‌ర్య‌లు చేప‌ట్టాడు. సెమీఫైన‌ల్‌లో ముంబై త‌రుపున ఆడాడు. అయిన‌ప్ప‌టికీ కూడా టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024తో పాటు ప్ర‌స్తుతం జ‌రుగుతున్న జింబాబ్వే సిరీస్‌కు అత‌డు ఎంపిక కాలేదు.

ప్ర‌స్తుతం గౌతీ అండ‌తో టీమ్ఇండియాలోకి వ‌చ్చేందుకు అయ్య‌ర్‌ సిద్ధ‌మ‌వుతున్నాడు. ఇందుకోసం మైదానంలో చెమ‌టోడ్చుతున్నాడు. ఈ క్ర‌మంలో ఫిట్‌నెస్ పై దృష్టి పెట్టిన అయ్య‌ర్ స్ర్పింట‌ర్‌లా వేగంగా ప‌రిగెతున్న వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. మ‌రి అయ్య‌ర్ ఆశ‌లు ఫ‌లిస్తాయో మ‌రో వారంలో తేలిపోనుంది.

Shubman Gill Sister : పాపం గిల్‌..! స్నేహితుడు అని న‌మ్మితే.. టీమ్ఇండియా స్టార్ క్రికెట్‌తో గిల్ సోద‌రి ప్రేమ‌..?

ట్రెండింగ్ వార్తలు