Jasprit Bumrah : చరిత్ర సృష్టించిన జస్‌ప్రీత్ బుమ్రా.. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఒకే ఒక భారతీయుడు
టీమ్ఇండియా పేస్ గుర్రం జస్‌ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah ) అరుదైన ఘనత సాధించాడు.
- Thota Vamshi Kumar
- Published On : February 23, 2026 / 10:09 AM IST
Jasprit Bumrah Creates history became most T20 World Cup wickets for India
Jasprit Bumrah : టీమ్ఇండియా పేస్ గుర్రం జస్‌ప్రీత్ బుమ్రా అరుదైన ఘనత సాధించాడు. టీ20 ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ గా చరిత్ర సృష్టించాడు. ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో బుమ్రా మూడు వికెట్లు తీయడం ద్వారా ఈ ఘనత సాధించాడు. ఈ క్రమంలో అతడు మాజీ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ ను అధిగమించాడు.
అశ్విన్ 24 మ్యాచ్‌ల్లో 32 వికెట్లు తీయగా.. బుమ్రా 22 మ్యాచ్‌ల్లోనే 33 వికెట్లు సాధించాడు. మరో పేసర్ అర్ష్‌దీప్ సింగ్ దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో రెండు వికెట్లు పడగొట్టడం ద్వారా అశ్విన్‌ను సమం చేశాడు.
Sanju Samson : దక్షిణాఫ్రికాపై ఘోర పరాజయం.. తుది జట్టులోకి సంజూ శాంసన్..! భారత కోచ్ కీలక సూచన
టీ20 ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లు వీరే..
* జస్‌ప్రీత్ బుమ్రా – 22 మ్యాచ్‌ల్లో 33 వికెట్లు
* రవిచంద్రన్ అశ్విన్ – 24 మ్యాచ్‌ల్లో 32 వికెట్లు
* అర్ష్‌దీప్ సింగ్ – 18 మ్యాచ్‌ల్లో 32 వికెట్లు
* హార్దిక్ పాండ్యా – 29 మ్యాచ్‌ల్లో 29 వికెట్లు
* రవీంద్ర జడేజా – 30 మ్యాచ్‌ల్లో 22 వికెట్లు
ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో డేవిడ్ మిల్లర్ (63; 35 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్థశతకం బాదాడు. డేవాల్డ్ బ్రెవిస్ (45; 29 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు), ట్రిస్టన్ స్టబ్స్ (44నాటౌట్; 24 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లు) లు దంచికొట్టారు. టీమ్ఇండియా బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా మూడు, అర్ష్‌దీప్ సింగ్ రెండు, వరుణ్ చక్రవర్తి, శివమ్‌దూబె లు తలా ఓ వికెట్ తీశారు.
అనంతరం 188 పరుగుల లక్ష్య ఛేదనలో శివమ్ దూబె (42; 37 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లు) రాణించినప్పటికి మిగిలిన వారు విఫలం కావడంతో టీమ్ఇండియా 18.5 ఓవర్లలో 111 పరుగులకే ఆలౌటైంది. దీంతో భారత్ 76 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది. పరుగుల పరంగా టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత్‌కు ఇదే అతి పెద్ద ఓటమి. దక్షిణాఫ్రికా బౌలర్లలో మార్కో జాన్సెన్ నాలుగు, కేశవ్ మహారాజ్ మూడు, కార్బిన్ బాష్ రెండు, ఐడెన్ మార్‌క్రమ్ ఓ వికెట్ సాధించాడు.
