IND vs SL : శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు ముందు భారత్‌కు భారీ షాక్.. జస్‌ప్రీత్ బుమ్రా దూరం.. అతడి స్థానంలో ఎవరంటే?
శ్రీలంకతో రెండు టెస్టు మ్యాచ్‌ల ప్రారంభానికి ముందు టీమ్ఇండియాకు (IND vs SL) భారీ షాక్ తగిలింది.
- Thota Vamshi Kumar
- Updated on- August 3, 2026 / 10:17 AM IST
Jasprit Bumrah Ruled Out Of Sri Lanka Tests Auqib Nabi replaces
IND vs SL : శ్రీలంకతో రెండు టెస్టు మ్యాచ్‌ల ప్రారంభానికి ముందు టీమ్ఇండియాకు భారీ షాక్ తగిలింది. టీమ్ఇండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఈ సిరీస్‌కు దూరం అయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ వెల్లడించింది. ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో బుమ్రా మోకాలికి గాయమైన సంగతి తెలిసిందే. ఈ గాయం నుంచి అతడు ఇంకా పూర్తిగా కోలుకోలేదని, అందుకనే అతడు లంకతో సిరీస్‌కు దూరం అయ్యాడని తెలిపింది.
బుమ్రా స్థానంలో ఆకిబ్ నబీని ఎంపిక చేసింది. జమ్మూ కాశ్మీర్‌కు చెందిన ఈ పేసర్ టీమ్ఇండియాలో చోటు దక్కించుకోవడం ఇదే తొలిసారి. గత రెండు రంజీ ట్రోఫీ సీజన్లలో నబీ మొత్తం 104 వికెట్లు పడగొట్టారు. ఇందులో 2025-26 సీజన్‌లో సాధించిన 60 వికెట్లు కూడా ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్ జట్టు తొలిసారిగా రంజీ ట్రోఫీని గెలవడంలో నబీ కీలక పాత్ర పోషించాడు. ఇటీవల శ్రీలంకలో పర్యటించిన ఇండియా ‘ఎ’ జట్టులో కూడా అతడు భాగంగా ఉన్నాడు. అక్కడ రెండు ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లలో ఆరు వికెట్లు తీశారు.
Commonwealth Games 2026 : కామన్వెల్త్ గేమ్స్ 2026.. పతకాల సంఖ్య తగ్గినా… భారత ప్రదర్శన అసాధారణమే!
𝗡𝗘𝗪𝗦:
Auqib Nabi replaces Jasprit Bumrah in India’s Test squad.
Details 🔽 #TeamIndia | #SLvIND https://t.co/lAf25FbpDN
— BCCI (@BCCI) August 3, 2026
శ్రీలంకతో టెస్టు సిరీస్ కోసం నవీకరించిన భారత జట్టు ఇదే..
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సాయి సుదర్శన్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, దేవదత్ పడిక్కల్, సారాంశ్ జైన్, ఆకిబ్ నబీ.
భారత్, శ్రీలంక టెస్టు సిరీస్ షెడ్యూల్ ఇదే..
* తొలి టెస్టు – ఆగస్టు 15 నుంచి 19 వరకు – గాలే వేదికగా
* రెండో టెస్టు – ఆగస్టు 23 నుంచి 27 వరకు – కొలంబో వేదికగా
