Vaibhav Sooryavanshi : వైభవ్ సూర్య‌వంశీ అస‌లు నా మాట విన‌డు.. ఆర్‌సీబీ ప్లేయ‌ర్ జితేశ్ శ‌ర్మ హాట్ కామెంట్స్‌..

వైభ‌వ్ సూర్య‌వంశీ (Vaibhav Sooryavanshi) గురించి రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ జితేశ్ శ‌ర్మ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు.

Jitesh Sharma highlighted Vaibhav late night ice cream habit

  • వైభ‌వ్ సూర్యవంశీ అద్భుత‌మైన ప్లేయ‌ర్‌
  • ప్ర‌స్తుతానికి అత‌డు ప్రొఫెష‌న‌ల్ కాదు
  • ఆర్‌సీబీ ప్లేయ‌ర్ జితేశ్ శ‌ర్మ కామెంట్స్‌

Vaibhav Sooryavanshi : ఐపీఎల్ 2026 మార్చి 28న‌ ప్రారంభం కానుంది. ఇక ఇప్పుడు అంద‌రి దృష్టి రాజ‌స్థాన్ రాయ‌ల్స్ యువ ఓపెన‌ర్ వైభ‌వ్ సూర్య‌వంశీ పైనే ఉంది. 14 ఏళ్ల ఈ కుర్రాడు గ‌త ఏడాది ఐపీఎల్‌లో అరంగ్రేటం చేశాడు. తొలి సీజ‌న్‌లోనే సెంచ‌రీ చేసి అంద‌రి దృష్టిని త‌న‌వైపుకు తిప్పుకున్నాడు. ఇక ఈ సీజ‌న్‌లో అత‌డు ఎన్ని ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తాడోన‌ని అంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా.. వైభ‌వ్ సూర్య‌వంశీ గురించి రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ జితేశ్ శ‌ర్మ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు.

ద‌క్షిణాఫ్రికా దిగ్గ‌జ ఆట‌గాడు ఏబీ డివిలియ‌ర్స్‌తో యూట్యూబ్ ఛానెల్‌లో జితేశ్ శ‌ర్మ మాట్లాడుతూ.. వైభ‌వ్ పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు. వైభ‌వ్ గొప్ప ప్లేయ‌ర్ అని చెప్పాడు. తాను అత‌డిని అండ‌ర్‌-19 జ‌ట్టులో చూశాన‌న్నాడు. నిల‌క‌డ‌గా రాణించ‌డం చాలా క‌ష్టం అని చెప్పుకొచ్చాడు. అండ‌ర్‌-19 ప్ర‌పంచ‌క‌ప్‌లో అత‌డి ఆడిన విధానం త‌న‌ను ఎంతో ఆక‌ట్టుకుంద‌న్నాడు.
MS Dhoni : ధోని సార్.. 60 ఏళ్ల వ‌ర‌కు ఆడండి.. మ‌హికి హీరో శివ కార్తికేయ‌న్ రిక్వెస్ట్‌

త‌న వయ‌సు క‌న్నా ఎంతో ప‌రిణితి సాధించాడ‌ని తెలిపాడు. అత‌డు త‌న ఆట ప్ర‌ణాళిక‌కు క‌ట్టుబ‌డి ఆడుతున్నాడ‌ని అన్నాడు. ఐపీఎల్‌లో ఎలా ఆడాడో అక్క‌డా అలాగే ఆడాడ‌ని వివ‌రించాడు. మ‌రొక‌రిలా ప్ర‌య‌త్నించ‌లేద‌ని చెప్పుకొచ్చాడు. భ‌విష్య‌త్తులో అత‌డు ప్రొఫెష‌న‌ల్‌గా మార‌తాడ‌ని జితేశ్ తెలిపాడు.

ప్ర‌స్తుతానికి వైభ‌వ్‌.. ప్రొఫెష‌న‌ల్ కాద‌ని అంద‌రూ అత‌డిని ప్రొఫెష‌న‌ల్‌గా మార్చ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నారు. అయితే.. అత‌డు ఎప్ప‌టికి అలాగే ఉంటాడ‌ని తాను అనుకోవ‌డం లేద‌న్నారు. ఇక అత‌డికి తాను కొన్ని స‌ల‌హాల‌ను ఇస్తున్న‌ట్లుగా చెప్పుకొచ్చాడు.

PSL 2026 : అరెరె ఇన్నాళ్లు ఈ విష‌యం తెలియ‌క‌పాయె.. పీఎస్ఎల్ అంటే పాకిస్థాన్ సూప‌ర్ లీగ్ కాదా.. ‘పెట్రోల్ షార్టేజ్ లీగ్‌’..

అయితే.. అత‌డు మాత్రం కొన్నింటిని అస‌లు ఫాలో కావ‌డం లేద‌న్నాడు. రాత్రి పూట ఐస్‌క్రీం తినొద్ద‌ని అత‌డికి చాలా సార్లు చెప్పాన‌ని, అయిన‌ప్ప‌టికి అత‌డు ఎప్పుడూ కూడా త‌న మాట విన‌డ‌ని జితేశ్ శ‌ర్మ అన్నాడు.