Joe Root : ఎట్ట‌కేల‌కు మౌనం వీడిన జోరూట్.. స‌చిన్ రికార్డు పై.. నేను పుట్టక ముందే..

టెస్టు క్రికెట్ అత్యుత్త‌మ ఆట‌గాళ్ల‌లో ఇంగ్లాండ్ సీనియ‌ర్ ఆట‌గాడు జోరూట్ (Joe Root) ఒక‌డు.

Joe Root Ends Silence On Chasing Sachin Tendulkar Record

  • టెస్టుల్లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన రెండో ఆట‌గాడిగా కొన‌సాగుతున్న జోరూట్
  • తొలి స్థానంలో స‌చిన్ టెండూల్క‌ర్‌
  • స‌చిన్ రికార్డును బ్రేక్ చేయ‌డంపై స్పందించిన రూట్‌
  • నేను పుట్టక ముందే స‌చిన్ టెస్టుల్లో అరంగ్రేటం చేశాడు

Joe Root : టెస్టు క్రికెట్ అత్యుత్త‌మ ఆట‌గాళ్ల‌లో ఇంగ్లాండ్ సీనియ‌ర్ ఆట‌గాడు జోరూట్ ఒక‌డు. ఈ దిగ్గ‌జ ఆట‌గాడు ప్ర‌స్తుతం సుదీర్ఘ ఫార్మాట్‌లో ఇంగ్లాండ్ త‌రుపున అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాడిగా, ఓవ‌రాల్‌గా టెస్టుల్లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన రెండో ఆట‌గాడిగా కొన‌సాగుతున్నాడు. అగ్ర‌స్థానంలో టీమ్ఇండియా దిగ్గ‌జ ఆట‌గాడు స‌చిన్ టెండూల్క‌ర్ ఉన్నాడు.

స‌చిన్ టెస్టుల్లో 15921 ప‌రుగులు చేశాడు. ఇక‌ జోరూట్ విష‌యానికి వ‌స్తే 13943 ప‌రుగులు సాదించాడు. టెస్టుల్లో స‌చిన్ రికార్డును బ్రేక్ చేసే అవ‌కాశం ప్ర‌స్తుతం ఒక్క రూట్‌కే ఉంది. ఇక ఇదే విష‌యం గురించి చాలా సార్లు రూట్‌కు ప్ర‌శ్న‌లు ఎదురు అయ్యాయి. అయితే.. వాటిపై ఎన్న‌డూ రూట్ నేరుగా స‌మాధానం చెప్ప‌కుండా దాట‌వేస్తూ వ‌చ్చాడు. తాజాగా స‌మాధానం చెప్పాడు. స‌చిన్ రికార్డును బ‌ద్ద‌లు కొట్టాల‌ని తాను కోరుకుంటున్నాన‌ని, అదే స‌మ‌యంలో అత‌డు దిగ్గ‌జ ఆటగాడు అనే విష‌యాన్ని మ‌రువ‌కూడ‌ద‌ని అన్నాడు.

Pat Cummins : తృటిలో చేజారిన క్వాలిఫ‌య‌ర్‌-1 బెర్తు.. పాట్ క‌మిన్స్ కీల‌క కామెంట్స్‌.. ఇంకో 5 రోజులు..

స‌చిన్ టెండూల్క‌ర్ క్రికెట్‌లో సాధించిన‌ది అద్భుతం అని చెప్పాడు. తాను పుట్టక ముందే టెండూల్క‌ర్ టెస్టుల్లో అరంగ్రేటం చేశాడ‌ని, తాను టెస్టుల్లో అరంగ్రేటం చేసిన స‌మ‌యంలోనూ ఆడాడ‌ని గుర్తు చేసుకున్నాడు. ఆయ‌నది సుదీర్ఘ కెరీర్ అని అన్నాడు. ఆయ‌న దిగ్గ‌జ క్రికెట‌ర్ అని, టెస్టు క్రికెట్‌లో అత్య‌ధిక ప‌రుగులు, వ‌న్డేల్లోనూ 50 సెంచ‌రీలు ఇందుకు చ‌క్క‌ని ఊదాహ‌ర‌ణ‌లు అని చెప్పాడు.

త‌న బ్యాటింగ్‌ను మెరుగుప‌ర‌చుకోవ‌డానికి నిరంత‌రం ప్ర‌య‌త్నిస్తూనే ఉంటాన‌ని అన్నాడు. క్రీజులో ఉన్నప్పుడు సాంకేతిక విషయాల గురించి గానీ, మరే ఇతర అంశాల గురించి గానీ ఆందోళన చెంద‌న‌ని, బంతిని గ‌మ‌నించి మాత్ర‌మే ఆడ‌తాన‌ని చెప్పాడు.