Joe Root : న‌వ్వు తోపురా అయ్యా.. సిరీస్ మొత్తంలో ఒక్క‌సారి ఔట్ కాలే.. మెంట‌ల్ ఎక్కించేశాడు..

ఇంగ్లాండ్ సీనియ‌ర్ ఆట‌గాడు జోరూట్ (Joe Root) అరుదైన ఘ‌న‌త సాధించాడు.

Joe Root world record most runs without getting out in odi series

Joe Root : ఇంగ్లాండ్ సీనియ‌ర్ ఆట‌గాడు జోరూట్ అరుదైన ఘ‌న‌త సాధించాడు. టీమ్ఇండియాతో జ‌రిగిన మూడు మ్యాచ్ ల‌ వ‌న్డే సిరీస్‌లో అత‌డు ఒక్క‌సారి కూడా ఔట్ కాలేదు. ఈ క్ర‌మంలో ఓ ద్వైపాక్షిక వ‌న్డే సిరీస్‌లో ఔట్ కాకుండా అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాడిగా జోరూట్ చ‌రిత్ర సృష్టించాడు. భార‌త్‌తో జ‌రిగిన వ‌న్డే సిరీస్‌లో రూట్ 249 ప‌రుగులు సాధించాడు.

ఎడ్జ్‌బాస్ట‌న్ వేదిక‌గా జ‌రిగిన తొలి వ‌న్డేలో 76 ప‌రుగులు సాధించిన రూట్‌.. కార్డిఫ్ వేదిక‌గా జ‌రిగిన రెండో వ‌న్డేలో 99 ప‌రుగుల‌తో తృటిలో శ‌త‌కాన్ని చేజార్చుకున్నాడు. ఇక ఆదివారం లార్డ్స్ వేదిక‌గా జ‌రిగిన మూడో వ‌న్డే మ్యాచ్‌లో కేవ‌లం 48 బంతుల్లో 74 ప‌రుగులు సాధించాడు. ఈ క్ర‌మంలో మొత్తంగా భార‌త్‌తో వ‌న్డే సిరీస్‌లో 257 బంతులను ఎదుర్కొని 249 పరుగులు సాధించాడు.

Shubman Gill : ఆ త‌ప్పే మా కొంప‌ముంచింది.. రోహిత్ శ‌ర్మ ఉన్నాడు చూడండి.. శుభ్‌మ‌న్ గిల్ హాట్ కామెంట్స్‌..

ఓ ద్వైపాక్షిక వ‌న్డే సిరీస్ ఔట్ కాకుండా అత్య‌ధిక పరుగులు సాధించిన రికార్డు గ‌తంలో ఇంగ్లాండ్‌కే చెందిన జోస్ బ‌ట్ల‌ర్ పేరిట ఉండేది. 2022లో నెద‌ర్లాండ్స్ పై బ‌ట్ల‌ర్ 248 ప‌రుగులు సాధించాడు. తాజాగా రూట్ అత‌డిని అధిగ‌మించాడు

ఓ వన్డే సిరీస్‌లో ఔట్ కాకుండా అత్యధిక పరుగులు చేసిన ప్లేయ‌ర్లు వీరే..

* జోరూట్ – భార‌త్ పై 249 ప‌రుగులు (2026లో)
* జోస్ బ‌ట్ల‌ర్ – నెద‌ర్లాండ్ పై 248 ప‌రుగులు (2022లో)
* రికీ పాంటింగ్ – న్యూజిలాండ్ పై 241 ప‌రుగులు (2007లో)
* జావేద్ మియాందాద్ – భార‌త్ పై 234 ప‌రుగులు (1982లో)
* ఎంఎస్ ధోని – ఇంగ్లాండ్ పై 212 ప‌రుగులు (2011లో)