Kapil Dev : దిగ్గజ ఆటగాడు కపిల్ దేవ్ కిడ్నాప్.. !
టీమ్ఇండియా మాజీ క్రికెటర్, ఢిల్లీ ఎంపీ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
- Thota Vamshi Kumar
- Updated on- September 25, 2023 / 07:21 PM IST
Kapil Dev Kidnapped
Kapil Dev Kidnapped : టీమ్ఇండియా మాజీ క్రికెటర్, ఢిల్లీ ఎంపీ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటీజన్లు ఆందోళనకు గురి అవుతున్నారు. ఈ వీడియోలో టీమ్ఇండియాకు మొట్ట మొదటి వన్డే ప్రపంచకప్ (ODI World Cup) అందించిన దిగ్గజ ఆల్‌రౌండర్ కపిల్ దేవ్ కిడ్నాప్‌కు గురైనట్లు కనిపిస్తోంది. ఇంకా ఈ వీడియోలో ఏం ఉందంటే..? కపిల్ దేవ్లా కనిపిస్తున్న వ్యక్తి చేతులను తాళ్లతో, మాట్లాడకుండా నోటిని కర్చీఫ్‌తో కుక్కేసి.. ఇద్దరు వ్యక్తులు బలవంతంగా లాక్కెళ్లుతున్నారు.
కొంతదూరం వెళ్లాక కపిల్ వెనక్కి తిరిగి ఏదో సైగలు చేయడం కనిపించింది. ఈ వీడియో నాకే వచ్చిందా..? ఇంకెవరికైనా వచ్చిందా..? అందులో ఉన్నది నిజమైన కపిల్ దేవ్ కాదని అనుకుంటున్నా. నిజమైన కపిల్‌దేవ్ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నట్లు గంభీర్ ఎక్స్(ట్విట్టర్)లో ఈ వీడియోకి క్యాప్షన్ ఇచ్చాడు. క్షణాల్లో ఈ వీడియో వైరల్‌గా మారింది. కొందరు ఈ వీడియోను మార్ఫింగ్ చేశారని అంటుంటే, మరికొందరు మాత్రం ఏదైన ప్రకటన కోసం కావొచ్చునని అంటున్నారు. వన్డే ప్రపంచకప్ దగ్గర పడుతుండడంతో అందుకు సంబంధించిన ప్రకటనై ఉండొచ్చునని అంటున్నారు.
Smriti Mandhana : నిజంగా ఇది ఎంతో ప్రత్యేకం.. నా కళ్లలో నీళ్లు తిరిగాయి
ఇదిలా ఉంటే.. కపిల్‌దేవ్ రెండు రోజు క్రితం వారణాసిలో కనిపించిన సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ, సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్లతో కలిసి అతి పెద్ద స్టేడియం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు.
