Kapil Dev : ఇంటర్నెట్‌ను ఊపేస్తున్న కపిల్‌దేవ్ డ్యాన్స్.. ఎవరితో, ఏ పాటకో తెలుసా?
భారత దిగ్గజ ఆటగాడు కపిల్ దేవ్ 2024 జనవరి 6న 65వ పుట్టిన రోజును జరుపుకున్నారు.
- Thota Vamshi Kumar
- Published On : January 8, 2024 / 03:18 PM IST
Kapil Dev Dance
Kapil Dev Dance : భారత దిగ్గజ ఆటగాడు కపిల్ దేవ్ 2024 జనవరి 6న 65వ పుట్టిన రోజును జరుపుకున్నారు. ఈ సందర్భంగా అభిమానులు, పలువురు ఆటగాళ్లు సోషల్ మీడియా వేదికగా ఈ లెజండరీ క్రికెటర్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా.. కపిల్ దేవ్ తన భార్య రోమితో కలిసి డ్యాన్స్ చేసిన పాత వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ద ట్రెయిన్ సినిమాలోని గులాభీ ఆంఖీన్ అనే పాటకు తన భార్యతో కలిసి స్టెప్పులు వేశాడు.
తన బ్యాటింగ్, బౌలింగ్‌తో ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లను డ్యాన్స్ చేసేలా చేసే కపిల్ ఇలా డ్యాన్స్ మూమెంట్స్ చేయడం అభిమానులను మంత్ర ముగ్దులను చేస్తోంది. ఇంకెందుకు ఆలస్యం మీరు ఓసారి వీడియో పై లుక్కేయండి.
KL Rahul : కేఎల్ రాహుల్ టీ20లకు పనికిరాడా..? జట్టులో చోటు దక్కకపోవడానికి కారణమేంటి..?
1983లో టీమ్ఇండియా తొలిసారి వన్డే ప్రపంచకప్ అందించిన కెప్టెన్‌గా కపిల్ దేవ్ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. టీమ్ ఇండియా తరుపున కపిల్ 131 టెస్టుల్లో, 225 వన్డేల్లో ప్రాతినిధ్యం వహించాడు. టెస్టుల్లో 431 వికెట్లు తీయడంతో పాటు 5,248 పరుగులు చేశాడు. ఇక వన్డేల్లో 253 వికెట్లు పడగొట్టడంతో పాటు 3,783 పరుగులు చేశాడు.
