KKR Defeat: వరుస ఓటములు.. కేకేఆర్ హెడ్ కోచ్ పదవి నుంచి అభిషేక్ నాయర్‌కు ఉద్వాసన! కెవిన్ పీటర్సన్ సంచలన వ్యాఖ్యలు
KKR Defeat in IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ (Kolkata Knight Riders)పేలవ ప్రదర్శన చేస్తోంది.
- Thota Vamshi Kumar
- Updated on- April 18, 2026 / 12:59 PM IST
Kevin pietersen prediction kkr next coach is Brandon McMullen
- ఐపీఎల్ 2026 సీజన్‌లో పేలవ ప్రదర్శన చేస్తున్న కేకేఆర్
- వచ్చే ఏడాది కేకేఆర్ కోచింగ్ స్టాఫ్‌లో భారీ మార్పులు తప్పవంటున్న కెవిన్ పీటర్సన్
- మళ్లీ హెడ్ కోచ్‌గా మెక్ కల్లమ్ వస్తాడని జోస్యం
KKR IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ పేలవ ప్రదర్శన చేస్తోంది. ఇప్పటి వరకు ఈ సీజన్‌లో ఒక్క మ్యాచ్‌లోనూ విజయం సాధించలేదు. కేకేఆర్ ఇప్పటి వరకు ఆరు మ్యాచ్‌లు ఆడింది. ఐదు మ్యాచ్‌ల్లో ఓడిపోగా, పంజాబ్ కింగ్స్‌తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. దీంతో ఆ జట్టు ఖాతాలో ఓ పాయింట్ ఉండగా నెట్‌రన్‌రేటు -1.149గా ఉంది. పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది.
ఈ సీజన్‌లో కేకేఆర్ ప్లేఆఫ్స్‌కు చేరడం దాదాపుగా అసాధ్యంగానే కనిపిస్తోంది. ఈ సీజన్‌లో కేకేఆర్ మరో 8 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. అన్నింటిలో విజయం సాధిస్తేనే ప్లేఆఫ్స్‌కు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కేకేఆర్ కనీసం ఒక్క మ్యాచ్ గెలవడం కూడా కష్టంగానే ఉంది. 2024 ఛాంపియన్లు అయిన కేకేఆర్.. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో ఘోరంగా విఫలం అవుతోంది. కెప్టెన్ అజింక్యా రహానేతో పాటు సహచర ఆటగాళ్లలోనూ నిరాశ స్పష్టంగా కనిపిస్తోంది.
*ఆస్ట్రేలియాను అడగాల్సిన పని లేదు.. కామెరూన్ గ్రీన్ బౌలింగ్ చేయకపోవడంపై స్పందించిన రహానే
ఈ క్రమంలో ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. వచ్చే ఏడాది కేకేఆర్ కోచింగ్ స్టాఫ్ లో భారీ మార్పులు తప్పవని చెప్పుకొచ్చాడు. మాజీ కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్‌ను తిరిగి తీసుకురావచ్చునని తెలిపాడు. తన మాటలను గుర్తు పెట్టుకోవాల్సిందిగా కోరారు.
“వచ్చే సీజన్‌లో కేకేఆర్‌కు బాజ్ మెక్‌కల్లమ్ కోచ్‌గా ఉంటారు. ఈ ట్వీట్‌ను బుక్‌మార్క్ చేసుకోండి” అని పీటర్సన్ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.
ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందే కేకేఆర్ కోచింగ్ స్టాఫ్‌లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. చంద్రకాంత్ పండిట్ స్థానంలో అభిషేక్ నాయర్ ను హెడ్ కోచ్‌గా నియమించారు. అయితే.. ఈ మార్పు ఆశించినంత ఫలితాలను ఇవ్వలేదు. మరోవైపు ఇంగ్లాండ్ హెడ్ కోచ్‌గా మెక్ కల్లమ్ ఉన్నాడు. 2027 వరకు ఈసీబీతో అతడి కాంట్రాక్టు కొనసాగనుంది.
Baz McCullum will be the coach of KKR next season.
Bookmark this tweet.— Kevin Pietersen🦏 (@KP24) April 17, 2026
ఇదిలా ఉంటే.. కేకేఆర్‌తో మెక్‌కల్లమ్‌కు సుదీర్ఘం అనుభం ఉంది. 2008 నుంచి 2010 మధ్య 2012 నుంచి 2013 మధ్య ఆ జట్టు తరఫున ఆడాడు. 2020 నుంచి 2022 వరకు కేకేఆర్ హెడ్ కోచ్‌గా పని చేశాడు.
