Kieron Pollard : ముంబై కెప్టెన్సీ వివాదం.. రోహిత్‌కు మద్దతుగా పొలార్డ్..! అవసరం తీరగానే..
వెస్టిండీస్ మాజీ ఆటగాడు, ప్రస్తుత ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ కోచ్ ఆదివారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన స్టోరీ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
- Thota Vamshi Kumar
- Published On : January 7, 2024 / 03:37 PM IST
Keiron Pollard cryptic post triggers speculation among Mumbai Indians fans
Kieron Pollard -Rohit Sharma : వెస్టిండీస్ మాజీ ఆటగాడు, ప్రస్తుత ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ కోచ్ కీరన్ పొలార్డ్ ఆదివారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన స్టోరీ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఇది ఖచ్చితంగా ముంబైని ఉద్దేశించిందేనని పలువురు కామెంట్లు చేస్తున్నారు. దీని ద్వారా హార్దిక్‌కు కౌంటర్ ఇచ్చాడని, రోహిత్ శర్మకు తన మద్దతు ఉందని చెప్పకనే చెప్పాడని అంటున్నారు. అతడు విధేయత గురించి పోస్ట్ చేయడమే ప్రస్తుత చర్చకు కారణం.
“వర్షం కురవడం ఆగిపోయిన తరువాత ప్రతి ఒక్కరికి గొడుగు భారంగా అనిపిస్తుంది. అలాగే అవసరాలు తీరిపోయిన తరువాత విధేయత కూడా ఇలాగే అంతం అవుతుంది.” అని పొలార్డ్ తన ఇన్‌స్టా స్టోరీలో ఓ కొటేషన్‌ను షేర్ చేశాడు. ముంబై ఇండియన్స్‌లో ఇటీవల జరిగిన పరిణామాల గురించే పొలార్డ్ ఇలా అని ఉంటాడని పలువురు కామెంట్లు చేస్తున్నారు.
ముంబైలో ఏం జరుగుతోంది..?
ఐపీఎల్ 2024 వేలానికి ముందు ముంబై ఇండియన్స్‌లో పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ట్రేడింగ్‌లో గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్ పాండ్యను దక్కించుకుంది. ఆ తరువాత ఐదు సార్లు ఐపీఎల్ ట్రోఫీలు అందించిన రోహిత్ శర్మను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించింది. ఆ వెంటనే హార్దిక్ పాండ్యకు నాయకత్వ బాధ్యతలు అప్పగించింది. దీనిపై ముంబై అభిమానులు రెండుగా విడిపోయారు.
BBL : ఏంటీ భయ్యా.. ఇది ఔటా..? థర్డ్ అంపైరే తప్పు చేస్తే ఇక దిక్కెవరూ..!
రోహిత్‌కు మద్దతుగా లక్షల మంది అభిమానులు ముంబైని సోషల్ మీడియాలో అన్‌ఫాలో చేశారు. ముంబైలో కీలక ఆటగాడు అయిన సూర్యకుమార్ యాదవ్ సైతం ఎక్స్‌లో హార్ట్ బ్రేక్ సింబల్‌ను పోస్ట్ చేసి రోహిత్‌కు మద్దతుగా నిలిచాడు.
గాయంతో బాధపడుతున్న పాండ్య..
వన్డే ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచులో హార్దిక్ పాండ్య గాయపడ్డాడు. ప్రస్తుతం దీని నుంచి కోలుకుంటున్నాడు. అయితే.. అతడు పూర్తి ఫిట్‌నెస్ సాధించేందుకు చాలా సమయం పడుతుందని అంటున్నారు. ఈ క్రమంలో జనవరి 11 నుంచి అఫ్గానిస్తాన్‌తో జరగనున్న టీ20 సిరీస్‌తో పాటు ఐపీఎల్ 2024 సైతం ఆడడు అని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ హార్దిక్ ఐపీఎల్ ఆడకపోతే ముంబై కెప్టెన్‌గా ఎవరు ఉంటారు అనే అంశం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
MS Dhoni : హుక్కా తాగింది ధోనినేనా..! ఏఐ సాయంతో డీప్ ఫేక్ వీడియో సృష్టించారా..! ఏదీ నిజం..!
అటు..రోహిత్ శర్మ నాయకత్వంలో దక్షిణాఫ్రికా పర్యటనలో టెస్టు సిరీస్‌ను 1-1తో సమం చేసుకుంది టీమ్ఇండియా. పర్యటన ముగియడంతో రోహిత్ శర్మ ముంబై చేరుకున్నాడు. 2022 టీ20 ప్రపంచకప్ సెమీ ఫైనల్ మ్యాచ్ అనంతరం టీమ్ఇండియా తరుపున రోహిత్ మరో టీ20 మ్యాచ్ ఆడలేదు. అయితే.. అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్‌లో బరిలోకి దిగుతాడని, రోహిత్ నాయకత్వంలోనే వెస్టిండీస్-అమెరికాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న టీ20 ప్రపంచకప్ 2024లో టీమ్ఇండియా ఆడుతుందని వార్తలు వస్తున్నాయి. మరీ రోహిత్ ఏ నిర్ణయం తీసుకుంటాడోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
