BBL : ఏంటీ భ‌య్యా.. ఇది ఔటా..? థర్డ్ అంపైరే తప్పు చేస్తే ఇక దిక్కెవరూ..!

బిగ్‌బాష్ లీగ్‌లోనూ ఇలాంటి ఘ‌ట‌న‌నే చోటు చేసుకుంది.

BBL : ఏంటీ భ‌య్యా.. ఇది ఔటా..? థర్డ్ అంపైరే తప్పు చేస్తే ఇక దిక్కెవరూ..!

TV umpire presses the wrong button during Melbourne Stars vs Sydney Sixer match

Big Bash League : క్రికెట్‌లో అప్పుడ‌ప్పుడు కొన్ని స‌ర‌దా ఘ‌ట‌న చోటు చేసుకుంటాయి. తాజాగా ఆస్ట్రేలియాలో జ‌రుగుతున్న బిగ్‌బాష్ లీగ్‌లోనూ ఇలాంటి ఘ‌ట‌న‌నే చోటు చేసుకుంది. నాన్ స్ట్రైక‌ర్ ఎండ్‌లో ఉన్న బ్యాట‌ర్ ర‌నౌట్ అయ్యాడు అంటూ ఫీల్డింగ్ టీమ్ అప్పీల్ చేయ‌గా రిప్లే ప‌రిశీలించిన థ‌ర్డ్ అంపైర్ ఇచ్చిన నిర్ణ‌యం ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారింది. చాలా క్లియ‌ర్‌గా నాటౌట్ అని తెలుస్తున్నా కూడా థ‌ర్డ్ అంపైర్ ఔట్ అని ఇవ్వ‌డంపై నెటిజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

ఏం జ‌రిగిందంటే..?

ఎంసీజీ వేదిక‌గా శ‌నివారం మెల్‌బోర్న్ స్టార్‌, సిడ్నీ సిక్స‌ర్స్ జ‌ట్ల మ‌ధ్య‌ మ్యాచ్ జ‌రిగింది. ఈ మ్యాచ్‌లో సిడ్నీ సిక్స‌ర్స్ ఇన్నింగ్స్ సంద‌ర్భంగా ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఇన్నింగ్స్ మూడో ఓవ‌ర్‌ను ఇమాద్ వ‌సీమ్ వేశాడు. ఈ ఓవ‌ర్‌లో ఓ బంతిని బ్యాట‌ర్ జేమ్స్ విన్సీ స్ట్రైయిట్ షాట్ ఆడాడు. బౌల‌ర్ వ‌సీమ్ బంతి ఆపేందుకు ప్ర‌య‌త్నించ‌గా అత‌డి తాకుతూ బంతి నాన్‌స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న వికెట్ల‌ను ప‌డ‌గొట్టింది. దీంతో నాన్‌స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న బ్యాట‌ర్ ర‌నౌట్ అయ్యాడు అంటూ మెల్‌బోర్న్ స్టార్స్ ఆట‌గాళ్లు అప్పీల్ చేయ‌గా ఫీల్డ్ అంపైర్‌.. థ‌ర్డ్ అంపైర్‌కు రిఫ‌ర్‌ చేశారు.

Cheteshwar Pujara : సెల‌క్ట‌ర్ల‌కు పుజారా స్ట్రాంగ్ మెసేజ్‌..! ఇక ఎంపిక చేయ‌క త‌ప్ప‌దు..!

రిప్లేను చూడ‌గా బంతి వికెట్ల‌ను తాక‌డానికి కంటే ముందుగానే బ్యాట‌ర్ క్రీజులోకి వ‌చ్చేశాడు. అయితే.. టీవీ అంపైర్ పాల్ విల్సన్ నాటౌట్ బ‌ట‌న్‌ను నొక్క‌బోయి ఔట్ బ‌ట‌న్‌ను ప్రెస్ చేశాడు. దీంతో మైదానంలోని స్ర్కీన్ల‌పై ఔట్ అంటూ వ‌చ్చింది. దీన్ని చూసిన ఆట‌గాళ్లతో పాటు ప్రేక్ష‌కులు ఒక్క‌సారిగా ఆశ్చ‌ర్య‌పోయారు. అదేంటి ఇది క్లియ‌ర్‌గా నాటౌట్‌గా అని చ‌ర్చించుకుంటుండ‌గా ఈ సారి నాటౌట్ అంటూ స్ర్కీన్ల‌పై ప్ర‌త్య‌క్ష్య‌మైంది. అంపైర్ త‌ప్పుడు బ‌ట‌న్‌ను నొక్క‌డంతోనే ఇలా జ‌రిగింద‌ని తెలుసుకుని అంతా న‌వ్వుకున్నారు. కాగా.. ఈ వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది. నెటిజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. మొద‌ట బ్యాటింగ్ చేసిన మెల్‌బోర్న్ స్టార్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో నాలుగు వికెట్లు కోల్పోయి 156 ప‌రుగులు చేసింది. ల‌క్ష్యాన్ని సిడ్నీ సిక్స‌ర్స్ 18.1 ఓవ‌ర్ల‌లో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. సిడ్నీ బ్యాట‌ర్ల‌లో జేమ్స్ విన్సీ (79) హాఫ్ సెంచ‌రీతో రాణించాడు.

T20 World Cup 2024 : అంతా మీ ఇష్ట‌మేనా..? మాకు రోహిత్ శ‌ర్మ‌నే కావాలి.. మీరు మార్చాల్సిందే.. నెటిజ‌న్ల గ‌రం గ‌రం